Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్.. నాటు నాటుగానే..

పుష్పా 2తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో AA22తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   1 Sept 2025 9:50 AM IST
అల్లు అర్జున్.. నాటు నాటుగానే..
X

పుష్పా 2తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో AA22తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్‌నే చూసి ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ అయింది. అంతేకాదు, సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది.

పాన్ వరల్డ్ లెవెల్‌లో

బాలీవుడ్ టాప్ స్టార్ దీపికా పదుకోనే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే హాలీవుడ్ కు సంబంధించిన టెక్నీషియన్స్ కూడా ఇందులో భాగమవుతున్నారు. దీంతో సినిమా పాన్ ఇండియా మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ లెవెల్‌లో హైప్ క్రియేట్ అవుతోంది. ఈ పాట వివరాలను ఇంకా మేకర్స్ సీక్రెట్‌గా ఉంచినా, ఇది సినిమాకి ప్రధాన హైలైట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

నాటు నాటు కంటే హై వోల్టేజ్ స్టెప్స్

ఇక తాజాగా ఈ సినిమాలో బన్నీ డ్యాన్స్ నంబర్ గురించి పెద్ద బజ్ క్రియేట్ అయింది. ముంబైలో షూట్ చేసిన ఈ సాంగ్ కోసం ప్రత్యేకంగా భారీ సెట్స్ వేశారు. ఈ పాటలో అల్లు అర్జున్ డ్యాన్స్ స్టెప్పులు చూసి యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోయారని సమాచారం. ముఖ్యంగా RRR నాటు నాటు ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో, అదే తరహాలో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డ్యాన్స్ లో ఇరగదీసే బన్నీ సోలోగా నాటు నాటు కంటే హై వోల్టేజ్ స్టెప్స్ తో రెడీ అవుతున్నట్లు సమాచారం. తన వింటేజ్ ఎనర్జీని చూపించి అందరినీ మెస్మరైజ్ చేశారని టాక్. ఆ ఒక్క పాటలో పక్కా తెలుగు నాటు స్టెప్పులతో పాటు వెస్ట్రన్ కి టచ్ అయ్యే స్టెప్పులు కూడా ఉంటాయట.

సంగీతం అందిస్తున్న సాయి అభ్యంకర్ ఈ సాంగ్‌ని ప్రత్యేకంగా కంపోజ్ చేసినట్లు సమాచారం. బన్నీ డ్యాన్స్‌కి సరిపోయే బీట్, స్టైల్ ఇచ్చి పాటను హైలైట్‌గా మార్చాడని ఇండస్ట్రీ టాక్. ఈ సాంగ్ లిరిక్స్, బీట్, విజువల్స్ థియేటర్లలో ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించేలా ఉంటాయంటున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ ముంబైలో జరగగా, త్వరలోనే మరో షెడ్యూల్ కోసం హైదరాబాద్కు షిఫ్ట్ కానుంది.

ఇక AA22 రిలీజ్ డేట్ విషయానికి వస్తే, 2027 సమ్మర్‌కి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అప్పటినుంచే ఈ మాస్ విజువల్ ఎంటర్‌టైనర్‌కు భారీగా థియేటర్స్ రిజర్వ్ చేయబోతున్నట్లు సమాచారం. మొత్తానికి అల్లు అర్జున్ డ్యాన్స్ నంబర్ చుట్టూ క్రేజ్ పెరగడంతో సినిమా అంచనాలు ఇంకో స్థాయికి చేరాయి.