లోకేష్ ప్రపంచంలోకి బన్నీ.. ఎలా చూపించబోతున్నాడు?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన లైనప్‌లో మరో భారీ ప్రాజెక్టును యాడ్ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మెగా అభిమానులకు ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
By: M Prashanth | 14 Jan 2026 7:28 PM ISTటాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన లైనప్‌లో మరో భారీ ప్రాజెక్టును యాడ్ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మెగా అభిమానులకు ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. సెన్సేషనల్ కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో బన్నీ ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. భోగి పండుగ రోజే ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ రావడంతో సోషల్ మీడియా మొత్తం ఈ వార్తతో షేక్ అవుతోంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్టుతో బిజీగా ఉండటం వల్ల, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై క్లారిటీ ఇచ్చారు. అట్లీ సినిమా పూర్తయిన తర్వాత, అంటే 2026లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. అప్పటి వరకు లోకేష్ కూడా స్క్రిప్ట్ పనులను పూర్తి చేసి, బన్నీ కోసం ఒక పక్కా మార్క్ యాక్షన్ సినిమాను సిద్ధం చేయనున్నారు.
ఈ అప్‌డేట్‌కు సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. అందులో బన్నీని అడవికి రాజు అయిన సింహంతో పోలుస్తూ, కొన్ని నక్కలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నట్లు చూపించారు. 'AA23' అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్‌గా నిర్మించబోతున్నారు. బన్నీ లోకేష్ కలయికలో సినిమా అంటేనే అంచనాలు హైలెవెల్లో ఉంటాయి..
నిజానికి లోకేష్ కనగరాజ్ తన 'కూలీ' తర్వాత మరో తమిళ్ హీరోతో సినిమా చేస్తారని అందరూ భావించారు. కానీ సడన్ గా బన్నీతో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. అల్లు అర్జున్ అనిరుధ్ కాంబినేషన్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు ఇది నిజంగా పండగ లాంటి వార్త అనే చెప్పాలి.
లోకేష్ కనగరాజ్ తన విభిన్నమైన టేకింగ్ తో ఇప్పటికే సౌత్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. బన్నీ లాంటి మాస్ అపీల్ ఉన్న హీరోతో ఆయన కలవడం వల్ల బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవ్వడం ఖాయం. ప్రస్తుతం బన్నీ లైనప్ చూస్తుంటే, రాబోయే రెండు మూడేళ్ల వరకు ఆయన తన మార్కెట్‌ను మరింత పెంచుకునేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు అర్థమవుతోంది.
ఇక లోకేష్ కనగరాజ్ రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రజినీకాంత్ సినిమాకు 50 కోట్లు తీసుకున్న ఆయన, ఈ సినిమా కోసం సుమారు 75 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుల జాబితాలో ఆయన చేరిపోతారు. ఏదేమైనా ఈ ఇద్దరి కలయికలో రాబోయే సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త ప్రకంపనలు సృష్టించడం ఖాయం.
