23 ఏళ్ల నట ప్రస్థానంలో ఐకాన్ స్టార్!
మెగా-అల్లు ట్యాగ్ తో వెండి తెరకు పరిచయమైన అల్లు అర్జున్ చిత్ర పరిశ్రమలో ఎలా ఎదిగాడు? అన్నది చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 30 March 2026 5:00 AM ISTమెగా-అల్లు ట్యాగ్ తో వెండి తెరకు పరిచయమైన అల్లు అర్జున్ చిత్ర పరిశ్రమలో ఎలా ఎదిగాడు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా? ట్యాలెంట్ లేనిది పైకి రాలేడు. బ్యాకప్ అన్నది ఎంట్రీ కార్డుగా వినియోగించుకుని కష్టపడి పైకొచ్చిన నటుడు బన్నీ. నేడు బన్నీ గ్లోబల్ స్థాయిలో ఐకాన్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. సరిగ్గా 2003 మార్చి 28న గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన బన్నీ 2026 మార్చి 28 నాటికి విజయ వంతంగా 23 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ రెండు దశాబ్దాల కాలంలో బన్నీ కేవలం నటుడిగానే కాదు. తనదైన స్టైల్, డ్యాన్స్ , మేనరిజమ్స్‌తో భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేశారు.
ఆరంభంలో విమర్శలు ఎదురైనప్పటికీ సుకుమార్ దర్శకత్వంలో రిలీజ్ అయిన ఆర్య చిత్రంతో అల్లు అర్జున్ కెరీర్ మలుపు తిరిగింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం బన్నీని యూత్ ఐకాన్‌గా మార్చేసింది. అక్కడి నుండి బన్నీ, దేశముదురు, పరుగు వంటి చిత్రాలతో మాస్ , క్లాస్ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. ముఖ్యంగా డ్యాన్స్‌లో ఆయన చేసే ప్రయోగాలు తెలుగు సినిమా స్థాయిని పెంచాయి అనడంలో అతిశయోక్తి లేదు.ప్రతి సినిమాకు తనను తాను మలుచుకోవడం బన్నీ ప్రత్యేకత. వేదం`లో కేబుల్ రాజుగా,`రుద్రమదేవి**లో గోన గన్నారెడ్డిగా బన్నీ నటనలో వైవిధ్యంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
స్టైలిష్ స్టార్ నుండి `ఐకాన్ స్టార్`గా మారే క్రమంలో ఆయన ఎంచుకున్న కథలు, పాత్రలు ఆయనలోని పరిణతిని చాటి చెప్పాయి. `రేసు గుర్రం, సరైనోడు, అల వైకుంఠపురములో వంటి బ్లాక్‌బస్టర్లు బన్నీని టాలీవుడ్ టాప్ లీగ్‌లో నిలబెట్టాయి. అల్లు అర్జున్ కెరీర్‌లో పుష్ప: ది రైజ్ ఒక మైలురాయి. ఈ చిత్రంతో ఆయన క్రేజ్ దేశ సరిహద్దులు దాటింది. తగ్గేదే లే అనే డైలాగ్ గ్లోబల్ సెన్సేషన్‌గా మారింది. ఉత్తమ నటుడిగా పుష్పరాజ్ పాత్రతో జాతీయ అవార్డు అందుకున్న మొదటి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించాడు. తెలుగు సినిమా కీర్తిని దశదిశలా వ్యాపింపజేశాడు.
పుష్ప 2: ది రూల్ కూడా రికార్డుల వేటను కొనసాగిస్తూ ఆయన బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించింది. ఆ చిత్రం ఏకంగా 1800 కోట్ల వసూళ్లను సాధించి రికార్డు పరంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రెండవ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం బన్నీ 22వ చిత్రం అట్లీ దర్శకత్వంలో గ్లోబల్ స్థాయిలో ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయం సాధిస్తే గనుక బన్నీ ఇమేజ్ గ్లోబల్ రేంజ్ రీచ్ అవుతుంది. బన్నీ తదుపరి చిత్రాల ప్రణాళిక కూడా అంతే స్ట్రాంగ్ ఉంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న 23 చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు.
అలాగే సందీప్ రెడ్డి వంగా, ఆదిద్యధర్ వంటి సంచలన దర్శకుల్ని లైన్ లో పెడుతున్నాడు. అలాగేసుకుమార్ తో `పుష్ప 3: ది రాంపేజ్ కోసం రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని 2029లో పట్టాలెక్కించాలన్నది ప్లాన్ .23 ఏళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణంలో బన్నీ సాధించిన విజయాలు కేవలం ఆరంభం మాత్రమే. నటుడిగా ప్రపంచ సినిమాను శాషించే స్థాయికి చేరుకోవాలన్నది బన్నీ లక్ష్యం. ఆ సాధన దిశగా ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నాడు.నటుడిగానే కాదు బన్నీ వ్యక్తిత్వం కూడా ఎంతోమందికి ఆదర్శం. క్రమశిక్షణ, కఠిన శ్రమ , అభిమానుల్లో ఆయనకు ఉన్న గౌరవం ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టాయి. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న దక్షిణాది హీరోలలో ఒకరిగా రికార్డు ఉంది. బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ లోనూ బన్నీ అగ్రగామిగా కొనసాగుతున్నాడు.
