ప్రౌడ్ మూమెంట్: నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో అల్లు అర్హ!
అర్హ కేవలం రికార్డులకే పరిమితం కాలేదు, ఇప్పటికే వెండితెరపై కూడా తన ముద్ర వేసింది.
By: Madhu Reddy | 14 March 2026 11:09 AM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తన క్యూట్ మాటలతో, అల్లరితో ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ చిన్నారి, ఇప్పుడు ఒక అరుదైన ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. కేవలం ఐదేళ్ల వయసులోనే మేధస్సుతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ 'నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించి, మెగా అభిమానులకు గర్వకారణంగా నిలిచింది. అల్లు అర్హ సాధించిన ఆ అద్భుత విజయం తాలూకు విశేషాలు ఇప్పుడు చూద్దాం..
చిన్న వయసులోనే పెద్ద రికార్డు:
అల్లు అర్హ కేవలం ఆటపాటల్లోనే కాదు, చదరంగం లాంటి తెలివైన ఆటలోనూ అద్భుతమైన ప్రతిభ కనబరుస్తోంది. ఈ చిన్నారి ఏకంగా 30 చెస్ ఫజిల్స్‌ను అత్యంత వేగంగా పరిష్కరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతటితో ఆగకుండా, దాదాపు 50 మందికి చెస్‌లో మెలకువలు నేర్పించి 'యంగెస్ట్ చెస్ ట్రైనర్'గా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో తన పేరును లిఖించుకుంది. ఇక గతంలో ఈ రికార్డు మంచు లక్ష్మీ కూతురు నిర్వాణ పేరిట ఉండేది, ఇప్పుడు ఆ రికార్డును అర్హ తన వశం చేసుకుంది. కూతురు సాధించిన ఈ గొప్ప విజయాన్ని చూసి అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులు ఎంతో మురిసిపోతున్నారు.
వెండితెర ప్రవేశం నుండి వరల్డ్ రికార్డుల వరకు:
అర్హ కేవలం రికార్డులకే పరిమితం కాలేదు, ఇప్పటికే వెండితెరపై కూడా తన ముద్ర వేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘శాకుంతలం’ సినిమాలో యువరాజు భరతుడిగా నటించి, తెలుగు లో మాట్లాడిన విధానానికి ,తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఆమె 9వ పుట్టినరోజు వేడుకలను అల్లు ఫ్యామిలీ దుబాయ్‌లో ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. ఈ వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి కాస్తా వైరల్ అయ్యాయి.ఇక తాజాగా అర్హ సర్టిఫికేట్ పట్టుకుని నవ్వుతున్న వీడియో నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. చిన్నప్పటి నుండే క్రమశిక్షణతో, ఇష్టమైన రంగంలో రాణిస్తున్న అర్హను చూసి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
తండ్రి అల్లు అర్జున్ డ్యాన్స్, నటనలో గ్లోబల్ స్టార్‌గా ఎదిగితే, కూతురు అర్హ మాత్రం తన ఐదేళ్ల వయసు నుండే మేధస్సు తో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. కేవలం సెలబ్రిటీ కిడ్ అనే ట్యాగ్ మాత్రమే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఈ చిన్నారి సంపాదించుకోవడం నిజంగా అభినందనీయం. ఈ రికార్డ్ కేవలం అల్లు కుటుంబానికే కాదు, తెలుగు వారందరికీ గర్వకారణం. భవిష్యత్తులో అర్హ మరెన్నో ఇలాంటి అరుదైన విజయాలను సాధించి, తన తల్లిదండ్రుల పేరును మరింత నిలబెట్టాలని కోరుకుందాం.
