Begin typing your search above and press return to search.

భయపెడుతున్న అల్లు వారసురాలు!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలోకి రాకముందే ఏ రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

By:  Madhu Reddy   |   31 Oct 2025 3:35 PM IST
భయపెడుతున్న అల్లు వారసురాలు!
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలోకి రాకముందే ఏ రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు తమ వారసులను అభిమానులకు పరిచయం చేస్తూ.. వారికంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. అలా అల్లు వారసురాలు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి నిత్యం తన కూతురు, కొడుకుకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ పిల్లలిద్దరికీ మంచి పాపులారిటీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

అటు అల్లు అర్జున్ కూడా తన కూతురు అల్లు అర్హకి చెందిన క్యూట్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పాపకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టారు. ఆ క్రేజ్ తోనే అల్లు అర్హ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన శాకుంతలం సినిమాలో చిన్నప్పటి భరతుడి పాత్రలో అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు అప్పుడప్పుడు అల్లు అర్హ చేసే అల్లరి వీడియోలు కూడా అభిమానులను అలరిస్తూ ఉంటాయి. ఇటీవల మంచు లక్ష్మితో "నువ్వు తెలుగేనా" అని మాట్లాడిన వీడియో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అలాంటి అల్లు అర్హ తాజాగా తన అల్లరితో ఇప్పుడు అందరిని భయపెట్టేసింది.

అసలు విషయంలోకి వెళ్తే.. హాలోవీన్ గెటప్లో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ చిన్నారి. తన అన్నయ్య అల్లు అయాన్ తో కలిసి అల్లు అర్హ హాలోవీన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నట్లు.. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో స్నేహ రెడ్డి పంచుకున్నారు. ఈ హాలోవీన్ సందర్భంగా అల్లు అర్హకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అల్లు అర్హ విషయానికి వస్తే.. మంత్రగత్తె లాంటి నల్లటి దుస్తులలో పొడవాటి టోపీ ధరించి.. తన ఒక కంటి దగ్గర చిన్న నల్ల సాలీడు ఉన్నట్టుగా పెయింట్ వేయించుకుంది. ఈ దృశ్యం చూడడానికి ఒళ్ళు గగుర్పొడిచేలా అనిపించినా... చాలా అందంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. స్నేహ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన అల్లు అర్జున్ అభిమానులు మినీ స్టైల్ ఐకాన్ అని కామెంట్ చేస్తుంటే.. మరి కొంత మంది అందమైన చిన్న మంత్రగత్తే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే ఈ హాలోవీన్ వేడుకల సందర్భంగా అల్లు అర్హ, అల్లు అయాన్లకు సంబంధించిన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అల్లు అర్జున్ విషయానికి వస్తే.. పుష్ప, పుష్ప 2 చిత్రాలతో సంచలనం సృష్టించడమే కాకుండా పాన్ ఇండియా హీరోగా పేరు దక్కించుకున్నారు. ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తన 22వ సినిమా చేస్తున్నారు. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.