ఈ సినిమాకి తక్కువ రేటింగ్ ఇవ్వడానికి ఇబ్బంది పడతారు: అల్లు అరవింద్
అల్లు అరవింద్ ప్రెజెంట్స్.. ఈ పేరు సినిమా పోస్టర్‌పై కనిపిస్తే, ఆ సినిమా కంటెంట్‌లో ఏదో కొత్తదనం ఉంటుందని ఇండస్ట్రీలో బలంగా నమ్ముతారు
By: M Prashanth | 5 Nov 2025 9:37 PM ISTఅల్లు అరవింద్ ప్రెజెంట్స్.. ఈ పేరు సినిమా పోస్టర్‌పై కనిపిస్తే, ఆ సినిమా కంటెంట్‌లో ఏదో కొత్తదనం ఉంటుందని ఇండస్ట్రీలో బలంగా నమ్ముతారు. ఆయన జడ్జ్‌మెంట్ అలాంటిది. కొత్త టాలెంట్‌ను, డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు ఆయన సమర్పిస్తున్న లేటెస్ట్ చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్'.
రష్మిక మందన్న ప్రధాన పాత్రలో, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్, ప్రేక్షకుల్లో ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా, అల్లు అరవింద్ మాట్లాడుతూ.. రివ్యూయర్లపై, రేటింగ్‌లపై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏమాత్రం మొహమాటం లేకుండా, తన మనసులోని మాటను బయటపెట్టారు.
"నేను ఒకటి బోల్డ్‌గా చెప్పాలి. మీరందరూ (రివ్యూయర్లు) మేం తీసిన సినిమాలకు 1.5 దగ్గర నుంచి 3.5 వరకు రేటింగ్స్ ఇస్తారు" అని అల్లు అరవింద్ అన్నారు. ఈ మాటతో ప్రెస్ మీట్‌లో ఒక్కసారిగా అందరూ నవ్వేశారు. అయితే, ఆయన అసలు పాయింట్‌ను ఆ తర్వాత రివీల్ చేశారు. "ఈ సినిమాకి తక్కువ రేటింగ్ ఇవ్వడానికి ఇబ్బంది పడతారు మీరు" అని ఆయన ఎంతో కాన్ఫిడెంట్‌గా ఛాలెంజ్ విసిరారు.
"అది ఎంత గొప్పగా ఆడని, ఆడనివ్వకపోని" అంటూ తన మాటను పూర్తి చేశారు. ఈ కామెంట్స్, సినిమా అవుట్‌పుట్‌పై ఆయనకు ఎంత నమ్మకం ఉందో స్పష్టం చేస్తున్నాయి. 'ది గర్ల్‌ఫ్రెండ్' ట్రైలర్ చూస్తే, ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ కాదని, రిలేషన్‌షిప్స్‌లోని డార్క్ సైడ్‌ను, కాంప్లెక్సిటీస్‌ను చూపిస్తోందని అర్థమవుతోంది. బహుశా, ఇలాంటి ఒక మెచ్యూర్డ్, ఇంటెన్స్ సబ్జెక్ట్‌ను విమర్శకులు కూడా కాదనలేరని, తక్కువ రేటింగ్ ఇవ్వడానికి సంకోచిస్తారని అల్లు అరవింద్ బలంగా నమ్ముతున్నట్లున్నారు.
అల్లు అరవింద్ జడ్జ్‌మెంట్‌కు, కాన్ఫిడెన్స్‌కు ఇండస్ట్రీలో మంచి పేరుంది. మొత్తం మీద, అల్లు అరవింద్ చేసిన ఈ కామెంట్స్ 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఆయనకు ఇంత నమ్మకాన్ని ఇచ్చిన ఆ కంటెంట్ ఏంటి? నిజంగానే ఈ సినిమా రివ్యూయర్లను సైతం మెప్పించి, అధిక రేటింగ్‌లను సొంతం చేసుకుంటుందా అనేది తెలియాలంటే నవంబర్ 7 వరకు ఆగాల్సిందే.
