Begin typing your search above and press return to search.

ఈమె గ్రనేడ్ బాంబ్ లాంటిది.. డెబ్యూ బ్యూటీపై బాస్ అర‌వింద్ కామెంట్!

‘ఆకాశంలో ఒక తార’ ప్రీరిలీజ్ వేడుకలో హీరోయిన్ సాత్వికపై అల్లు అరవింద్ ప్రశంసలు కురిపించారు. ఆమె నటన అద్భుతంగా ఉందని, పెద్ద స్టార్‌ను తీసుకోవాలనుకున్నా ఆడిషన్స్ తర్వాత సాత్వికనే ఎంపిక చేశామని తెలిపారు. మొదటి సినిమా విడుదల కాకముందే ఆమెతో మరో రెండు సినిమాలకు కాంట్రాక్ట్ చేసుకున్నట్లు వెల్లడించారు.

By:  Sivaji Kontham   |   16 Nov 2026 2:23 AM IST
ఈమె గ్రనేడ్ బాంబ్ లాంటిది.. డెబ్యూ బ్యూటీపై బాస్ అర‌వింద్ కామెంట్!
X

బాస్ అల్లు అర‌వింద్ మంచి ప్ర‌తిభ‌ను ఎంక‌రేజ్ చేయ‌డంలో ఎప్పుడూ ముందుంటారు. వేదిక‌ల‌పై య‌థాలాపంగా మాట్లాడేస్తూ కొంద‌రు న‌టీన‌టుల‌కు అల‌వోక‌గా అవ‌కాశాల్ని కూడా క‌ల్పించేస్తుంటారు. ఇప్పుడు అలాంటి జాక్ పాట్ అందుకుంది ఒక డెబ్యూ హీరోయిన్. ఈ ఎన్నారై గాళ్ ని చూస్తుంటే జూనియ‌ర్ కియ‌రా అద్వాణీలా క‌నిపిస్తోంది. అలా క‌నిపించ‌డ‌మే కాదు.. ప్ర‌తిభ‌లోను ఎక్క‌డా త‌క్కువ కాద‌ని కితాబిచ్చేసారు బాస్ అల్లు అర‌వింద్. ఆయ‌న స‌మ‌ర్ప‌ణ‌లో దుల్క‌ర్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `ఆకాశంలో ఒక తార` సినిమా ప్రీరిలీజ్ వేడుక‌లో మాట్లాడుతూ హీరోయిన్ సాత్విక‌ను ఆకాశానికెత్తేసారు అర‌వింద్. అంతేకాదు .. మొద‌టి సినిమా విడుద‌ల కాక ముందే... త‌న‌తో మ‌రో రెండు సినిమాల కాంట్రాక్ట్ కూడా రాయించేసుకున్నార‌ట‌.

ఈ చిత్రంలో నటిస్తున్న సాత్విక గురించి అర‌వింద్ మాట్లాడుతూ.. ఆమె ఒక పెద్ద గ్ర‌నేడ్‌ బాంబ్ లాంటిదని.. త‌న‌ నటన అద్భుతంగా ఉంద‌ని కితాబిచ్చేసారు. మొదట్లో ఈ పాత్రకు పెద్ద స్టార్‌ను పెడదామని అనుకున్నా.. ఆడిషన్స్ చూశాక సహజంగా నటించగల ఈ అమ్మాయే కరెక్ట్ అనిపించిందని చెప్పారు. సాత్వ‌క‌ నటన చూశాక తనతో మరో రెండు సినిమాలకు కాంట్రాక్ట్ కూడా రాయించుకున్నట్లు వెల్లడించారు.

అర‌వింద్ ఇదే వేదిక‌పై దుల్క‌ర్ స‌ల్మాన్ సింప్లిసిటీ -ఒదిగి ఉండే త‌త్వం గురించి మాట్లాడారు. హీరో దుల్కర్ సల్మాన్ కేవలం ఆన్-స్క్రీన్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ చాలా నిజాయితీగా.. అందరితోనూ ఒదిగి ఉండే చాలా సున్నితమైన వ్య‌క్తి అని కొనియాడారు. నాని లాంటి నటుడు చేసే తరహా పాత్రలను దుల్కర్ చాలా బాగా చేశాడని ప్రశంసించారు.

దర్శకుడు, రైటర్ గంగరాజు రాసిన స్క్రీన్ ప్లే చాలా బ్రహ్మాండంగా కుదిరిందని కూడా ఈ వేదిక‌పై అభినందించారు. ఈ సబ్జెక్ట్‌ను 2021 నుండి బన్నీ వాసు తన వద్దకు తీసుకొచ్చాడని.. ఇన్నాళ్లకు ఇది కార్యరూపం దాల్చిందని పేర్కొన్నారు. తాను తన కెరీర్‌లో ఎన్నో దశాబ్దాలుగా సినిమాలు తీస్తూ.. ఎన్నో బ్లాక్‌బస్టర్‌లను చూశానని.. అయితే ఈ సినిమా రషెస్ చూస్తున్నప్పుడు మాత్రం ఒక గొప్ప కథను జనాలకు చెప్పబోతున్నామనే సరికొత్త ఎక్సైట్‌మెంట్ కలిగిందని అల్లు అరవింద్ తెలిపారు.

కెరీర్ లో తన మంచి స్నేహితుడైన అశ్విని దత్‌తో కలిసి ఏడు సినిమాలు చేశానని.. ఇప్పుడు ఆయన కుమార్తె స్వప్నతో కలిసి ఈ సినిమా చేయడం చాలా ఎక్సైటింగ్‌గా ఉందని అల్లు అరవింద్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అర్జున్‌కు .. వేడుకను విజయవంతం చేసిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.