'మన శంకర వరప్రసాద్ గారు' పై అల్లు అరవింద్ క్రేజీ రివ్యూ!
సంక్రాంతి పండుగ పూట మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైన విషయం తెలిసిందే.
By: M Prashanth | 12 Jan 2026 7:34 PM ISTసంక్రాంతి పండుగ పూట మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమా చూసిన తర్వాత ప్రఖ్యాత నిర్మాత అల్లు అరవింద్ తన రియాక్షన్‌ను చాలా ఎగ్జైటింగ్‌గా పంచుకున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే, బాస్ మళ్ళీ ఒకసారి తన పవర్ ఏంటో బాక్సాఫీస్ వద్ద చూపించబోతున్నారు. అల్లు అరవింద్ సినిమా చూసి బయటకు వస్తూనే, "బాస్ చించేశాడు.. బాస్ ఈజ్ బాస్" అంటూ మెగాస్టార్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు.
చిరంజీవిలోని ఆ పాత ఎనర్జీని, వింటేజ్ లుక్స్‌ను మళ్ళీ స్క్రీన్ పై చూడటం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆయన వెల్లడించారు. ఈ కాలంలో కూడా బాస్ అదే రేంజ్ మెరుపులు మెరిపిస్తున్నారని ఆయన కొనియాడారు. ముఖ్యంగా చిరంజీవి కెరీర్‌లో క్లాసిక్ హిట్స్ అయిన 'రౌడీ అల్లుడు', 'ఘరానా మొగుడు' వంటి సినిమాల్లోని వింటేజ్ మేనరిజమ్స్ ఇందులో చాలా బాగా పండాయని అరవింద్ అభిప్రాయపడ్డారు.
ఆ సినిమాల్లో చిరంజీవిని చూసినప్పుడు కలిగిన ఎగ్జైట్‌మెంట్, నోస్టాల్జియా ఫీలింగ్ మళ్ళీ ఈ చిత్రంతో వచ్చిందని ఆయన తెలిపారు. బాస్ అభిమానులకు ఇది పక్కా విందు లాంటి సినిమా అని గట్టిగా చెప్పారు. దర్శకుడు అనిల్ రావిపూడి పనితీరును అల్లు అరవింద్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. చిరంజీవి వింటేజ్ స్టైల్స్, డ్యాన్స్‌లతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వరకు అన్నీ కూడా పాత కాలపు క్రేజీ చిరంజీవిని గుర్తుకు తెచ్చేలా అనిల్ డిజైన్ చేశారని ప్రశంసించారు. అనిల్ రావిపూడి మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్‌ను పర్ఫెక్ట్‌గా వాడుకున్నారని చెప్పారు.
ఇక సినిమాలో మరో హైలైట్ అయిన వెంకటేష్ గారి ఎంట్రీ గురించి కూడా అరవింద్ స్పందించారు. చిరు వెంకీ కాంబినేషన్ సీన్లు క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమా స్థాయిని పెంచాయని ఆయన వెల్లడించారు. ఈ ఇద్దరు స్టార్ల స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సినిమా పక్కా సూపర్ హిట్ ఫిల్మ్ అని ఆయన ముందే తేల్చేశారు.
చివరగా, ఈ సినిమా చూసి ప్రేక్షకులు ఫుల్ ఎగ్జైట్‌మెంట్‌తో బయటకు వస్తారని, జనం అందరికీ ఇది "పైసా వసూల్" సినిమా అని అల్లు అరవింద్ చెప్పారు. సంక్రాంతి సీజన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇదొక పర్ఫెక్ట్ మూవీ అని ఆయన తెలిపారు. చాలా రోజుల తరువాత అల్లు అరవింద్ ఒక సినిమాకు హై లెవెల్లో రివ్యూ ఇవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
