రష్మిక లాంటి కూతురుంటే బాగుండేది -అరవింద్
ఇక ఈ ఈవెంట్లో రష్మిక మందన్నా యాక్టింగ్ ని అందరూ పొగిడారు.నేషనల్ క్రష్ కి ఏకైక అర్హురాలు కేవలం రష్మికనే అన్న రేంజ్ లో ఈ హీరోయిన్ పై పొగడ్తల వర్షం కురిపించారు.
By: Madhu Reddy | 25 Oct 2025 7:29 PM ISTరష్మిక మందన్నా యాక్టింగ్ ని మెచ్చుకోనివారు ఉండరు. ఈమె ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో తన యాక్టింగ్ తో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.అయితే అలాంటి ముద్దుగుమ్మని పొగడని వారు ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా చిరంజీవి,నాగార్జున,వెంకటేష్ ఇలా టాలీవుడ్ సీనియర్ హీరోలు మొదలు యంగ్ హీరోలు కూడా ఆమెను పొగుడుతూ ఉంటారు. రష్మికని రియల్ నేషనల్ క్రష్ అని ఎంతోమంది సీనియర్ హీరోలు పొగిడారు.ఈ నేపథ్యంలోనే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇలాంటి ఓ కూతురు మా ఇంట్లో కూడా ఉంటే బాగుండు అంటూ మాట్లాడారు..
తాజాగా రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి మనకు తెలిసిందే.ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. "ది గర్ల్ ఫ్రెండ్ మూవీ లో రష్మిక మందన్న పోషించిన క్యారెక్టర్ ని మోయగలిగే కెపాసిటీ కేవలం ఈమెకు మాత్రమే ఉంది. ఈ సినిమాలో రష్మిక పోషించిన పాత్రని ఎవరు ఇంత అద్భుతంగా చేసేవారు కాదు. ఎందుకంటే ఈ సినిమా కోసం రష్మిక మందన్న అంత బాగా యాక్టింగ్ చేసింది. ఈ సినిమాలో ఆమె నటనకి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు.అంత అద్భుతంగా నటించింది" అంటూ రష్మిక మందన్న నటనపై ప్రశంసల జల్లు కురిపించారు.అంతేకాదు "రష్మికని చూస్తుంటే ఇలాంటి కూతురు నాకు కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది" అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అల్లు అరవింద్. అంతేకాదు ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ ను పిలుద్దాం అని చెప్పి ఆడిటోరియంలో ఉన్న వాళ్ళందరిలో సంతోషం నింపారు.
ఇక ఈ ఈవెంట్లో రష్మిక మందన్నా యాక్టింగ్ ని అందరూ పొగిడారు.నేషనల్ క్రష్ కి ఏకైక అర్హురాలు కేవలం రష్మికనే అన్న రేంజ్ లో ఈ హీరోయిన్ పై పొగడ్తల వర్షం కురిపించారు.. అయితే ప్రస్తుతం రష్మిక మందన్నపై నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
ఏంటండీ మీరు మాట్లాడే మాటలు.. మీకు ఇలాంటి కూతురు ఉంటే అల్లు అర్జున్ కి చెల్లెలి అవుతుంది. మీరేంటండి అల్లు అర్జున్ కి రష్మిక ని చెల్లెల్ని చేసేసారు అంటూ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఇక అల్లు అరవింద్ హీరోయిన్లపై ఇలాంటి కామెంట్లు కేవలం రష్మిక మందన్నాపై మాత్రమే కాదు గతంలో అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవిల మీద కూడా చేశారు.అలా తనకు యాక్టింగ్ నచ్చితే కచ్చితంగా ఆ హీరోయిన్లని తనకి ఇలాంటి కూతురు ఉంటే బాగుండు అని పొగుడుతారు...
ఇక రష్మిక మందన్నా దీక్షిత్ శెట్టి నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నవంబర్ 7న విడుదల కాబోతోంది. ఇక ది గర్ల్ ఫ్రెండ్ మూవీని మొదట.. ఈ మూవీకి దర్శకత్వం వహించిన రాహుల్ రవీంద్రన్ 2021లోనే అల్లు అరవింద్ కి చెప్పారట. ఆ సమయంలో ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం దీనిని ఒక వెబ్ సిరీస్ లాగా రెడీ చేద్దాం అనుకున్నారట. కానీ ఆ తర్వాత ఇది వెబ్ సిరీస్ కంటే సినిమా గానే బాగుంటుంది సినిమాగా తీద్దాం అని అల్లు అరవింద్ చెప్పడంతో అప్పటినుండి రాహుల్ రవీంద్రన్ వెబ్ సిరీస్ లాగా కాకుండా సినిమాగా తీయాలని ఫిక్స్ అయ్యారట.
ఆ తర్వాత చాలా సందర్భాలలో రాహుల్ రవీంద్రన్ ని అల్లు అరవింద్ మన స్టోరీ ఎక్కడి దాకా వచ్చిందని అడిగారట. కానీ ఇన్ని రోజులు ఈ గర్ల్ ఫ్రెండ్ మూవీ లోని పాత్రని మోయగలిగే బలమైన హీరోయిన్ కోసం వెతికారట. అలా రష్మిక మాత్రమే ఈ పాత్ర పోషించగలదని ఫిక్స్ అయ్యి ఈ పాత్ర కోసం రష్మిక మందన్నాని తీసుకున్నారట. ఈ విషయాన్ని అల్లు అరవింద్ స్వయంగా తెలియజేశారు.
