Begin typing your search above and press return to search.

బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలి - అల్లు అరవింద్

ఈ ఈవెంట్ కి వచ్చిన అల్లు అరవింద్ రష్మిక గురించి, ఆమె నటన గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

By:  Madhu Reddy   |   25 Oct 2025 6:16 PM IST
బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలి - అల్లు అరవింద్
X

రష్మిక మందన్న, కన్నడ హీరో దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ' ది గర్ల్ ఫ్రెండ్ '. ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా.. గీత ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడులు నిర్మాతలుగా వ్యవహరించారు. భారీ అంచనాల మధ్య నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అలా ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ ని పెంచడంతో రష్మిక ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ఇకపోతే ఈరోజు ట్రైలర్ లాంఛ్ చేశారు.. ఇందుకోసం ఘనంగా ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి వచ్చిన అల్లు అరవింద్ రష్మిక గురించి, ఆమె నటన గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఆమెకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలి అంటూ అల్లు అరవింద్ కామెంట్ చేయడంతో అందరూ ఆమె నటన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

విషయంలోకి వెళ్తే.. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. "ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కథను డైరెక్టర్ రాహుల్ నాకు 4 ఏళ్ల క్రితమే చెప్పాడు. దీనిని ఆహా కి వెబ్ సిరీస్ గా చేయాలని రాహుల్ అన్నాడు. కానీ ఇలాంటి మంచి కథతో సినిమా చేస్తేనే బాగుంటుంది అని నాకనిపించింది. ఆ తర్వాత ఎప్పుడు కలిసినా ఈ కథ గురించి రాహుల్ కి గుర్తు చేసేవాడిని. ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ ఇందులో చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. అంత హెవీ పెర్ఫార్మెన్స్ ఎవరు చేస్తారు? అనుకున్నప్పుడు వెంటనే రష్మిక మాత్రమే చేయగలదు అని ఆమెను తీసుకున్నాము. రష్మికకు ఈ సినిమాతో బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుంది" అంటూ అల్లు అరవింద్ కామెంట్ చేశారు.

అలాగే నటీనటుల పర్ఫామెన్స్ గురించి మాట్లాడుతూ.. "దీక్షిత్ , రాష్మిక ఇద్దరు మంచి ఇంటెన్స్ పెర్ఫార్మర్స్. ఇంత గొప్ప నటులను ఏరి కోరి మరీ రాహుల్ తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. రాహుల్ ని చూస్తే ఇలాంటి సినిమా ఇతడు చేశాడా అనిపిస్తుంది. నిజంగా ఇదొక అద్భుతమైన సినిమా.. కథ ఖచ్చితంగా మిమ్మల్ని అందరిని మెప్పిస్తుంది" అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు అల్లు అరవింద్.

ఇకపోతే ఈ సినిమా విషయానికి వస్తే.. 13 ఏళ్ల క్రితమే ఈ సినిమా కథకు బీజం పడింది అని, ఐదేళ్ల క్రితమే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నానని.. ఇప్పుడు ఒక మంచి ఇంటెన్స్ కథతో మీ ముందుకు వస్తున్నాను అని ఈ చిత్ర దర్శకుడు రాహుల్ చెప్పుకొచ్చారు.. మొత్తానికైతే ఎన్నాళ్ల నుంచో సిద్ధం చేస్తున్న ఈ కథ ఇప్పుడు ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.