'మందు తాగితే కొట్టను సంపేస్తా'- అల్లరి నరేష్ ఆల్కహాల్ టీజర్ చూశారా?
హిట్ కొట్టేందుకు అల్లరి నరేష్ సిద్ధంగా ఉన్నట్లు తెలుపుతూ కొత్త ఉన్నత శిఖరం వేచి ఉందంటూ రాసుకొచ్చారు.
By: M Prashanth | 4 Sept 2025 11:58 AM ISTటాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సొంతం చేసుకున్న ఆయన.. ఇప్పుడు విభిన్న సినిమాలతో తనదైన ముద్ర వేస్తున్నారు. గత ఏడాది బచ్చల మల్లి సినిమాతో వచ్చి ప్రేక్షకులను, అభిమానులను అలరించారు.
ఇప్పుడు కొత్త అవతార్ లో కనిపించబోతున్నారు. అప్ కమింగ్ ఆల్కహల్ మూవీలో నెవ్వర్ బిఫోర్ లుక్ లో సందడి చేయనున్నారు. ఫ్యామిలీ డ్రామా మూవీ ఫేమ్ మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్నారు. 2021లో థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన ఫ్యామిలీ డ్రామాతో మంచి గుర్తింపు సంపాదించుకుని ఇప్పుడు ఆల్కహల్ మూవీ చేస్తున్నారు.
కొత్త బ్యూటీ నిహారిక ఎన్ ఎమ్, రుహానీ శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఆ సినిమాను శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రీసెంట్ గా హీరో, హీరోయిన్ కు సంబంధించిన పోస్టర్లు విడుదలై మంచి రెస్పాన్స్ అందుకోగా నిన్న టీజర్ అప్డేట్ ఇచ్చారు.
హిట్ కొట్టేందుకు అల్లరి నరేష్ సిద్ధంగా ఉన్నట్లు తెలుపుతూ కొత్త ఉన్నత శిఖరం వేచి ఉందంటూ రాసుకొచ్చారు. ఇప్పుడు చెప్పినట్లు టీజర్ ను రిలీజ్ చేశారు. గ్లాస్ లో ఆల్కహల్ వేస్తున్న సీన్ తో టీజర్ స్టార్ట్ అవ్వగా.. లక్షలు లక్షలు సంపాదిస్తావ్.. మందు ఎందుకు తాగవ్.. ఇంకెందుకు రా నీ బతుకు అంటూ అల్లరి నరేష్ ను సత్య అడుగుతారు.
తాగుడికి సంపాదనకు లింక్ ఏముంది సార్ అన్న అల్లరి నరేష్.. ఆ తర్వాత నేను తాగితే ఇక్కడ ఎవరుండరు.. తాగితే మనమీద కంట్రోల్ ఉండదు.. నన్ను ఆల్కహల్ కంట్రోల్ చేయడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పారు. అనంతరం అల్లరి నరేష్ గ్యాంగ్ ను పరిచయం చేశారు. లాస్ట్ లో మందు తాగాక కొట్టను సర్.. చంపేస్తానంటూ హీరో చెబుతారు.
అయితే టీజర్ ను ఇంట్రెస్టింగ్ గా మేకర్స్ కట్ చేశారని చెప్పాలి. అల్లరి నరేష్ మరోసారి తన మార్క్ ను చూపించారు. రోల్ లో ఒదిగిపోయి కనిపించారు. డైలాగ్ డెలివరీ ఎఫెక్టివ్ గా ఉంది. సత్య రోల్ సినిమాకు కీలకంగా తెలుస్తోంది. మెహర్ తేజ్ విభిన్నమైన కథతో సినిమా తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. నాగవంశీ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. న్యూ ఇయర్ కానుకగా వచ్చే ఏడాది జనవరి 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
