అల్లరి నరేష్ 'రైల్వే కాలనీ'.. సరైన డేట్ ఫిక్స్ చేశారుగా!
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
By: M Prashanth | 27 Oct 2025 1:27 PM ISTటాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కామెడీ చిత్రాలతో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న ఆయన.. ఇప్పుడు రూట్ మార్చి విభిన్నమైన చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు వినూత్న థ్రిల్లర్ మూవీ 12A రైల్వే కాలనీలో లీడ్ రోల్ లో నటిస్తున్నారు.
హారర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఆ సినిమాకు పొలిమేర, పొలిమేర 2 చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న డా. అనిల్ విశ్వనాథ్ షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. నాని కాసరగడ్డ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను కూడా చూసుకుంటున్నారు
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి చిత్రాన్ని నిర్మిస్తుండగా.. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. పొలిమేర, పొలిమేర -2 చిత్రాలలో మెప్పించిన కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తున్నారు. అనిల్ విశ్వనాథ్ ఆమెతో వరుసగా చేస్తున్న మూడో చిత్రం ఇది కావడం విశేషం.
అయితే 12A రైల్వే కాలనీ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా బిగ్ అప్డేట్ ఇచ్చారు. సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. నవంబర్ 21వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆ సమయంలో స్పెషల్ వీడియోతో పాటు పోస్టర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
విడుదల తేదీ పోస్టర్ లో అల్లరి నరేష్ ఐకానిక్ పోజులో కనిపించారు. ఆయన చుట్టూ డ్యాన్సర్లు ఉత్సాహంగా ఉన్నారు. అదే సమయంలో మేకర్స్ విడుదల చేసిన ప్రత్యేక వీడియో కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మంచు కొండల్లో అల్లరి నరేష్ స్పెషల్ బైక్ పై వస్తారు. ఏం బండి అని అడగ్గా.. ఫారిన్ బండి అని చెబుతారు. ఆ తర్వాత రిలీజ్ డేట్ ను రివీల్ చేస్తారు.
అయితే మేకర్స్ సరైన రిలీజ్ డేట్ ను సెలెక్ట్ చేసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే ఆ వారంలో పెద్ద సినిమాలు ఏవీ విడుదల కావడం లేదు. దీంత్ మూవీకి మంచి అడ్వాంటేజ్ లభించనుంది. సింగిల్ గా విడుదల అవ్వనుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టైటిల్ టీజర్.. వెన్నులో వణుకు పుట్టించే కథనంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. మరి మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి
