12A రైల్వే కాలనీకి కు హిట్ సెంటిమెంట్స్
ఈ మధ్య సీరియస్ సినిమాలు కూడా చేస్తూ ఎంతో మంది ప్రశంసలు అందుకుంటున్న నరేష్ నటించిన తాజా సినిమా 12A రైల్వే కాలనీ.
By: Sravani Lakshmi Srungarapu | 18 Nov 2025 4:03 PM ISTకెరీర్ స్టార్టింగ్ లో ఎక్కువగా కామెడీ సినిమాలే చేసిన అల్లరి నరేష్ ఆ తర్వాత కథా ప్రాముఖ్యత సినిమాలు కూడా చేశారు. ఈ మధ్య సీరియస్ సినిమాలు కూడా చేస్తూ ఎంతో మంది ప్రశంసలు అందుకుంటున్న నరేష్ నటించిన తాజా సినిమా 12A రైల్వే కాలనీ. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ నాని కాసరగడ్డ దర్శకత్వం వహించడగా, పొలిమేర డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ షో రన్నర్ గా వ్యవహరించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో శ్రీనివాస్ చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించగా, నవంబర్ 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా, అందులో చిత్ర యూనిట్ తో పాటూ పలువురు సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు.
మా ప్రొడక్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది
హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ ఎవరికైనా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటే టాక్ ఏంటి, ఓపెనింగ్స్ ఏమిటి ? ఎలాంటి రివ్యూస్ వస్తాయనే టెన్షన్ గా ఉంటుంది. కానీ నాని ఫస్ట్ సినిమా చేస్తున్నా, తనికి ఎక్కడా టెన్షన్ లేదని, ఇంత కాన్ఫిడెన్స్ గా ఉండడానికి కారణం తమ దగ్గర ఉన్న ప్రోడక్ట్ అంత స్ట్రాంగ్ గా ఉండటమేనని, ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే ఎవరూ వారిని ఆపలేరని, తాను 35 మంది కొత్త డైరెక్టర్స్ తో పని చేశానని, తాను డైరెక్టర్, ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ గా ఉండాలనుకుంటున్నట్టు చెప్పారు నరేష్. ఇలాంటి సినిమాలకి విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ గొప్పగా ఉండాలని.. ఈ మూడింటిలో తమ టీమ్ సక్సెస్ అయిందని, నువ్వా నేనా మూవీ టైమ్ లో బీమ్స్ లో ఎంత కసి ఉందో ఇప్పుడు అంతే ఉందని, తాను బిజీగా ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కామాక్షి, అనిల్ తమను తాము ప్రూవ్ చేసుకుని అంచెలంచెలుగా ఎదిగి ఒక ప్యాషన్ తో వర్క్ చేస్తున్నారని, ఈ సినిమాకి పనిచేసిన అందరూ కూడా సిన్సియర్ గా కష్టపడ్డారని చెప్పారు. నా సామి రంగ చేసినప్పుడు తన కాలికి దెబ్బ తగిలిందని నిర్మాతకు చెప్తే సెంటిమెంట్ అన్నారని, తర్వాత ఆ సినిమా పెద్ద హిట్ అయిందని, ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నప్పుడు తన భుజానికి గాయమైందని, సెంటిమెంట్ ప్రకారం కూడా ఈ సినిమా మంచి హిట్ కానుందని నరేష్ చెప్పారు.
అల్లరి నరేష్ కాదు, అందరి నరేష్
డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ సినిమా ట్రైలర్ చూడగానే డైరెక్టర్ గురించి మాట్లాడాలనిపించిందని, డైరెక్టర్ నానినే ఎడిటర్ అని చెప్పారని, ఓ డైరెక్టర్ ఎడిటర్ అయితే సినిమా డబల్ కా మీఠానే అని, తాను పొలిమేర ఫంక్షన్ కి వెళ్ళాను. తర్వాత పార్ట్ 2 వచ్చింది. ముందుముందు ఇంకా రానున్నాయి. అలాగే ధమాకా ఫంక్షన్ కి వెళ్ళాను. అది కూడా పెద్ద హిట్ అయింది. నరేష్ గారు విజయ్ చేసిన నాంది సినిమాకి వెళ్లాను. ఇప్పుడు నిర్మాతలకు అదే సెంటిమెంట్ వర్క్ అవుట్ అవ్వాలని, ఈ సినిమా పొలిమేరలు దాటి ధమాకా సౌండ్ ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అన్నారు. ఈవీవీ గారి సినిమాలు చూశాకే రైటర్ గా కావాలని డిసైడ్ అయ్యానని కానీ ఆయనతో ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం రాలేదన్నారు. ఓ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తే ఎంతో మందికి అవకాశం ఇచ్చినట్టేనని, నరేష్ గారు 35 మంది దర్శకులను పరిచయం చేశారని, ఆ విధంగా చూసుకుంటే కొన్ని వందల మందికి ఆయన లైఫ్ ఇచ్చారని చెప్పారు. ఆయన ఫస్ట్ సినిమా అల్లరి కాబట్టి అల్లరి నరేష్ అన్నారు. ఏ డైరెక్టర్ స్క్రిప్ట్ తో వెళ్లినా రెడీగా ఉంటారు. కాబట్టి ఆయన్ని ఇకపై అందరి నరేష్ అని పిలవాలని కోరారు.
నరేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే
డైరెక్టర్ విజయ కనకమేడల మాట్లాడుతూ నాంది సినిమా అనౌన్స్మెంట్ వీడియోకు సిసి వర్క్ అంతా నానియే చేశాడని, ఇప్పుడతను డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడని, నరేష్ గారు చాలామంది డైరెక్టర్లను పరిచయం చేశారు. నాని 35వ దర్శకుడుని భావిస్తున్నాను. తనకి కూడా మంచి ఫ్యూచర్ ఉండాలి. నరేష్ గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆయన కొత్త కొత్త జోనర్స్ లో కొత్త కొత్త దర్శకులని పరిచయం చేయాలని కోరుకుంటున్నా అన్నారు.
ఆ పాటతో మొదలై ఇక్కడ వరకు వచ్చా
మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ మాట్లాడుతూ.. 2011 నుంచి నరేష్ తో జర్నీ చేస్తున్నానని, ఇన్ని పాటలు చేయడానికి ఒక పాట ప్రాణం పోస్తుందని, అదే నరేష్ గారి వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోను.. ఆ పాట నాకు ప్రాణం పోస్తే అది ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది. ఈ సినిమాలో తన నుంచి కొత్త రకం పాటలను విన్నారని, ఈ మూవీలో ఫస్ట్ నుంచి చివరి వరకు ఏం జరగబోతుంది అనేది ఎవరి ఊహకూ అందదని, ఈ సినిమా స్క్రీన్ ప్లే, మ్యూజిక్, విజువల్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయని చెప్పారు.
నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది
హీరోయిన్ కామాక్షి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమాకు పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నేను డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూనే మోడల్గా యాక్టర్ గా ప్రయత్నించాను. పొలిమేర సినిమా నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమానిచ్చిన అనిల్ గారికి థాంక్యూ. మా నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి గారికి థాంక్యూ,. ఈ సినిమాలో నాకు హీరోయిన్ క్యారెక్టర్ ఇవ్వడం అంత ఈజీ విషయం కాదు. శ్రీనివాస్ గారికి పవన్ గారికి స్పెషల్ థాంక్యూ. ఆరాధన చాలా స్పెషల్ క్యారెక్టర్. నా కెరియర్ లో గుర్తుండిపోతుంది. అల్లరి నరేష్ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన సినిమాలన్నీ చూసాను ఆయన ఎన్నో రకాల పాత్రలని అవలీలగా చేశారు. ఈ సినిమా మీ అందరికీ గుర్తుండిపోయే సినిమా అవుతుందని చెప్పారు.
నరేష్ సింగిల్ టేక్ యాక్టర్
అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. ఇలాంటి కొత్త కథని యాక్సెప్ట్ చేయడానికి చాలామంది ముందుకు రావట్లేదని, ఈ కథని నమ్మి ముందుకు వచ్చిన నరేష్ గారికి థాంక్స్ చెప్పారు. నరేష్ గారు సింగిల్ టేక్ పెర్ఫార్మర్ అని, ఆయనతో వర్క్ చేయడం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నానని చెప్పారు. ఆయన కెరీర్లో గమ్యం, నాంది, 12A రైల్వే కాలనీ టాప్ త్రీలో ఉంటాయని చెప్పిన అనిల్, . సినిమా అదిరిపోయిందని, కథ రాసిన తనకే క్లైమాక్స్ కు వచ్చే సరికి గూస్‌బంప్స్ వచ్చాయన్నారు. కామాక్షి తన డియర్ ఫ్రెండ్ అని, తన ప్రతి సినిమాలో ఆమె ఉంటుందని, తన గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. బీమ్స్ ఇచ్చిన మూడు పాటలూ మూడు ఆణిముత్యాలుగా నిలిచాయని, రీరికార్డింగ్ అదిరిపోయిందని, ఇంటర్వెల్ బ్యాంగ్ కు అందరూ షాకవుతారని, సినిమాలో కావలసిన ట్విస్టులు ఉన్నాయని, అందరికీ ఈ మూవీ నచ్చుతుందని చెప్పారు.
నా తండ్రి కల నెరవేరడానికి 15 ఏళ్లు పట్టింది
డైరెక్టర్ నాని మాట్లాడుతూ, తన తండ్రి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని, ఇలాంటి పెద్ద స్టేజ్‌లపై మాట్లాడాలనేది అతని తండ్రి కోరిక అని, కానీ ఆయన 2014లోనే చనిపోయారని, తాను డైరెక్టర్ అవడానికి 15 ఏళ్లు పట్టిందని, నాన్న ఎక్కడున్నా చూస్తారని నమ్ముతున్నా అన్నారు. అనిల్ వల్లనే డైరెక్టర్ ను అయ్యానని చెప్పిన నాని, ఆయనెప్పుడూ తన భుజం తడుతూనే ఉన్నారని అన్నారు.
అనుభవమున్న డైరెక్టర్ లాగా తీశాడు
వైవా హర్ష మాట్లాడుతూ, డైరెక్టర్ నానికి స్పెషల్ థాంక్స్ చెప్పారు. సినిమాను ఫస్ట్ టైమర్ లాగా కాకుండా ఎంతో అనుభవమున్న డైరెక్టర్ లాగా తీశారని, సినిమాకు బీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయిందని చెప్పారు. నరేష్ గారితో ఇది తన నాలుగో సినిమా అని, నరేష్ మంచితనానికి మారు పేరని చెప్పారు.
