Begin typing your search above and press return to search.

సూప‌ర్‌స్టార్ హెయిర్ క‌ట్ చేస్తూ చ‌నిపోయిన హెయిర్ డిజైన‌ర్

ఆలిమ్ హ‌కీమ్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వ‌ర‌కూ చాలా మంది ప్ర‌ముఖ హీరోల‌కు అత‌డు హెయిర్ డిజైన‌ర్.

By:  Sivaji Kontham   |   26 Oct 2025 9:44 AM IST
సూప‌ర్‌స్టార్ హెయిర్ క‌ట్ చేస్తూ చ‌నిపోయిన హెయిర్ డిజైన‌ర్
X

ఆలిమ్ హ‌కీమ్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వ‌ర‌కూ చాలా మంది ప్ర‌ముఖ హీరోల‌కు అత‌డు హెయిర్ డిజైన‌ర్. అత‌డి స్టైలింగ్ కార‌ణంగానే ర‌జ‌నీకాంత్, నాగార్జున వంటి సౌత్ స్టార్లు పెద్ద తెర‌పై ఎంతో ప్ర‌త్యేకమైన హెయిర్ క‌ట్ తో క‌నిపించారు. బాలీవుడ్ లో దిగ్గ‌జ హీరోలు షారూఖ్, ర‌ణ‌బీర్, హృతిక్ స‌హా చాలా మందికి అత‌డు హెయిర్ స్టైలిస్ట్. ల‌క్ష‌ల్లో పారితోషికాలు అందుకునే ప్ర‌ముఖుడు ఆయ‌న‌. ఆలిమ్ హ‌కీమ్ హెయిర్ సెలూన్ లు దేశవ్యాప్తంగా ఫేమ‌స్.

అయితే అత‌డు సినీరంగంలోకి ఎలా ప్ర‌వేశించాడు? అంటే.. అత‌డు త‌న తండ్రి వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకుని ఈ రంగంలోకి వ‌చ్చారు. ఇక్క‌డ రారాజుగా ఎదిగాడు. `ఆలిమ్ హ‌కీమ్` అనే పేరే ఒక బ్రాండ్ గా మారిందంటే అర్థం చేసుకోవాలి. అత‌డు త‌న‌ తండ్రి హ‌కీమ్ కైర్వాణీ బాలీవుడ్ స్వ‌ర్ణ‌యుగంలో ఒక భాగం అనే విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు. కైర్వాణీ ప్ర‌ముఖ హీరోలు అమితాబ్ బ‌చ్చ‌న్, సునీల్ ద‌త్ వంటి వారికి హెయిర్ స్టైలిస్ట్ గా ప‌ని చేసారు. ద‌త్ కార‌ణంగా అమితాబ్ కి కైరాణీ ప‌రిచ‌యం అయ్యారు. అమితాబ్ రెండో సినిమా నుంచి ప్రొఫెష‌న‌ల్ హెయిర్ స్టైలిస్టుగా గొప్ప అనుబంధం కొన‌సాగించారు. అమితాబ్ తో కైరాణీ త‌న‌ చివ‌రి రోజు వ‌ర‌కూ ప‌ని చేస్తూనే ఉన్నారని ఆలిమ్ హ‌కీమ్ తాజా ఇంట‌ర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

భార‌త‌దేశ‌పు అతిపెద్ద సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ని స్వ‌ర్ణ‌యుగంలో అద్భుతంగా ఆవిష్క‌రించారు హ‌కీమ్ కైర్వాణీ. ఆలిమ్ హకీమ్ తన తండ్రి అమితాబ్ బచ్చన్, సునీల్ దత్, శశి కపూర్ వంటి దిగ్గజ నటులకు స్టైలింగ్ చేస్తున్న పాతకాలపు ఫోటోలను సోష‌ల్ మీడియాలో షేర్ చేసారు. ఇవ‌న్నీ హిందీ సినిమా స్వర్ణయుగానికి సాక్ష్యాలు అని తెలిపారు. స్టార్ల‌తో కైర్వాణీ సాన్నిహిత్యం ఎంతో గొప్ప‌ది. అమితాబ్ మొద‌టి సినిమా `సాత్ హిందుస్తానీ` తర్వాత క‌లిసారు. రేష్మా ఔర్ షెరా అమిత్ జీ రెండవ సినిమా.. సునీల్ దత్ నేరుగా అమితాబ్ కి ప‌రిచయం చేసారు. షోలే, జంజీర్, డాన్, అమర్ అక్బర్ ఆంథోనీ, దీవార్ వంటి చిత్రాలలో పాపుల‌ర్ హెయిర్ స్టైల్స్ అన్నిటి వెన‌క‌ నా తండ్రి ఉన్నార‌ని ఆలిమ్ హ‌కీమ్ చెప్పారు.

అంతేకాదు.. అమితాబ్‌కి కంటిన్యూటీ హెయిర్ క‌ట్ చేస్తూ ఉన్న‌ప్పుడు గుండెపోటు వ‌చ్చింద‌ని కూడా ఆలిమ్ హ‌కీమ్ త‌న తండ్రి చివ‌రి రోజుల‌ను గుర్తు చేసుకున్నారు. గుండెపోటుతో ఆస్ప‌త్రిలో చేరిన ఒక రోజు త‌ర్వాత త‌న తండ్రి మ‌ర‌ణించార‌ని తెలిపారు. త‌న జీవితాన్ని చివ‌రి రోజు వ‌ర‌కూ కైర్వాణీ త‌న‌ వృత్తికి ఎలా అంకిత‌మిచ్చారో ఆలిమ్ హ‌కీమ్ గుర్తు చేసుకున్నారు. తాజాగా స్క్రీన్ ఇంట‌ర్వ్యూలో చాలా విష‌యాల‌ను రివీల్ చేసారు. మైసూర్‌లో `మార్డ్` సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. ఆయన అమిత్ జీకి కంటిన్యుటీ హెయిర్ కట్ చేస్తున్నారు. ఆ స‌మ‌యంలో అత‌డికి ఛాతీ నొప్పిగా అనిపించింది. మరుసటి రోజు ఆయన మరణించారు.. అని ఆలిమ్ హ‌కీమ్ భావోద్వేగానికి గుర‌వుతూ తెలిపారు.