ఆలీస్ ఇన్ బోర్డర్ ల్యాండ్.. కొత్త సీజన్ పై తెలుగులో వ్యతిరేకత?
సరిగ్గా ఇలాంటి ఒక సీరీస్ విషయంలో ఏకంగా తెలుగు ఆడియన్స్ నుండి వ్యతిరేకత నెలకొనడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
By: Madhu Reddy | 1 Oct 2025 2:00 PM ISTసాధారణంగా కొన్ని చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదలై భారీ పాపులారిటీ అందుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా ఆడియన్స్ మెచ్చిన ఆ చిత్రాలు ఫ్రాంఛైజీల రూపంలో కూడా విడుదలవుతూ అలరిస్తున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా అప్పుడప్పుడు ఈ ఫ్రాంఛైజీ భాషా విడుదల విషయంలో మేకర్స్ చేసే పనులు అభిమానుల ఆగ్రహానికి గురి చేస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. సరిగ్గా ఇలాంటి ఒక సీరీస్ విషయంలో ఏకంగా తెలుగు ఆడియన్స్ నుండి వ్యతిరేకత నెలకొనడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న హిట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఆలీస్ ఇన్ బోర్డర్ ల్యాండ్. దాదాపు మూడు ఏళ్ల తర్వాత మళ్లీ కొత్త సీజన్ తో తిరిగి వచ్చింది.. దీని హింసాత్మక ఆటలు, మానసిక మలుపులను ఈ సిరీస్ కొనసాగిస్తుంది. ఆశ్చర్యకరమైన జోడింపు కోసం అభిమానులు కూడా ఉత్సాహంగా ఎదురు చూశారు. ఇక అలా ఈ సీజన్ విడుదల అవ్వడం అభిమానులను సంతోషపరిచినా.. తెలుగు ప్రేక్షకుల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటుంది. కారణం మునుపటి సీజన్ల లాగా కాకుండా కొత్త సీజన్ కేవలం హిందీ, తమిళ్, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉండడం. దీంతో తెలుగు ఆడియన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా.. బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తోంది..పైగా ప్రపంచ స్థాయిలో గుర్తింపును కూడా దక్కించుకుంది.
ఇలాంటి స్థాయిలో ఉన్న తెలుగులో ఈ సిరీస్ విడుదల చేయకపోవడం పై నెటిజన్స్ తెలుగు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్త సిరీస్ ఇంత పెద్ద ప్రాంతీయ మార్కెట్ ను విస్మరించకూడదు అని అభిమానులు కూడా వాదిస్తున్నారు. ఇక భారతీయ భాషలలో డబ్బింగ్ చేస్తున్నప్పుడు తెలుగు ఆడియోని వదిలివేయాలనే నెట్ ఫ్లిక్స్ నిర్ణయాన్ని కూడా తప్పుపడుతున్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించి తెలుగులో రిలీజ్ చేయాలని కూడా సోషల్ మీడియాలో డిమాండ్లు చేస్తున్నారు. ఇక మేకర్స్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే తెలుగు ఆడియోని జోడించాలని, లేకపోతే వ్యతిరేకత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఆలిస్ ఇన్ బోర్డర్ ల్యాండ్ సినిమా విషయానికి వస్తే.. ఇది జపనీస్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డ్రామా టెలివిజన్ సిరీస్.. హరో అసో పేరుతో మాంగా ఆధారంగా ఈ సిరీస్ ని రూపొందించారు. ఈ సిరీస్ కి షిన్ సుకే సాటో దర్శకత్వం వహించారు. మొదటి సీజన్ 2019లో ప్రకటించగా.. 2020 డిసెంబర్ 10న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. ఇందులో యాక్షన్ సన్నివేశాలు, దర్శకత్వం ,నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. ఇందులో అయామే మిసాకి, అయాక మియోషి, కెంటో యమజాకి, టావో సుచియా, నిజిరో మురకామి తదితరులు కీలక పాత్రలు పోషించారు
