Begin typing your search above and press return to search.

నితిన్ ఈ సారి కొట్టేలా ఉన్నాడు, కారణం ఇదే

చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్‌ ‘అలియాస్ రుక్మిణి’తో డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మురళికాంత్ దేవసోత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ ఆసక్తి పెంచింది. రచయితగా, ‘రుక్మిణి’ కలం పేరుతో హీరో కనిపించడం కథలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నాని సమర్పకుడిగా వ్యవహరించడం సినిమాపై అంచనాలను పెంచుతోంది.

By:  Ramesh Palla   |   27 Nov 2026 12:45 PM IST
నితిన్ ఈ సారి కొట్టేలా ఉన్నాడు, కారణం ఇదే
X

నితిన్‌ సాలిడ్‌ హిట్‌ కొట్టి చాలా కాలం అయింది. గత ఏడాది రాబిన్‌హుడ్‌, తమ్ముడు సినిమాలతో వచ్చిన నితిన్‌ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన విషయం తెల్సిందే. సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నితిన్‌ కథల ఎంపికలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తమ్ముడు తర్వాత కాస్త ఎక్కువ సమయం తీసుకున్న నితిన్‌ ఈ ఏడాది వస్తాడా రాడా అనే అనుమానాల మధ్య ఫైనల్‌గా 'అలియాస్ రుక్మిణి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న సక్సెస్‌ను ఈ సినిమాతో నితిన్‌ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి, ఆ నమ్మకం మరింతగా పెరిగింది అనడంలో సందేహం లేదు. ఈ సినిమాకు నాని సమర్పకుడు కావడంతో సినిమాపై నమ్మకం మరింతగా పెరిగిందని మీడియా వర్గాల వారు అంటున్నారు.

అలియాస్ రుక్మిణి సినిమా ట్రైలర్‌ టాక్‌...

టైటిల్‌ అనౌన్స్‌ చేసిన సమయంలో చాలా మంది ఈ సినిమా కథ ఎక్కువగా హీరోయిన్‌ చుట్టూ తిరుగుతుంది అనుకున్నారు. కానీ ఈ సినిమాలో హీరో ఒక రచయిత, ఆ రచయిత కలం పేరు రుక్మిణి అని షాకింగ్‌ విషయాన్ని ట్రైలర్‌ ద్వారా చెప్పకనే చెప్పారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందించడం మాత్రమే కాకుండా, సినిమా పూర్తిగా వినోదాత్మకంగా సాగుతూ కొన్ని చోట్ల ఎమోషనల్‌ టచ్‌ కూడా ఉంటుందని ట్రైలర్‌ చూస్తుంటే అర్థం అవుతుంది. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న ఒక కుర్రాడు, తన రచనల కారణంగా అమ్మాయిలతో తిరస్కరించబడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో హీరో జీవితంలోకి అడుగు పెట్టిన హీరోయిన్‌, ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా కథగా ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతుంది. శృంగార కథల రచయిత అంటూ హీరోను ఈ సినిమాలో చూపించడం ద్వారా కామెడీ కావాల్సినంత ఉండబోతుందని చెప్పకనే చెప్పారు.

నితిన్‌ హీరోగా మురళికాంత్‌ దేవసోత్‌ దర్శకత్వంలో...

దండోరా సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు మురళికాంత్‌ దేవసోత్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. యునానిమస్ ప్రొడక్షన్స్‌లో దీప్తి గంటా నిర్మించారు. ఈ సినిమా సబ్జెక్ట్‌పై నమ్మకంతో, ఆసక్తితో నాని స్వయంగా సినిమాను సమర్పించేందుకు ముందుకు వచ్చాడని యూనిట్‌ సభ్యులు అంటున్నారు. నాని స్వయంగా ఈ సినిమా ప్రొడక్షన్‌ పనుల్లో భాగస్వామ్యం అయ్యాడు అనేది ఇండస్ట్రీ టాక్‌. ఆ విషయం పక్కన పెడితే ప్రమోషన్‌ వేడుకల్లో మాత్రం నాని కనిపిస్తున్నాడు. ఆ మధ్య ట్రైలర్‌ లాంచ్‌ కి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌లో నాని కనిపించాడు. ఆ తర్వాత కూడా నాని ఈ సినిమా గురించి పలు వేదికలపై స్పందిస్తూ తనదైన తరహాలో ప్రమోట్‌ చేస్తున్నాడు. దాంతో ఈ సినిమాపై అంచనాలు, ఆసక్తి రెండూ పెరుగుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

నాని సమర్పణలో నితిన్‌ సినిమా...

నాని గతంలో నిర్మించిన, సమర్పించిన సినిమాలకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా కోర్ట్‌ మూవీకి నాని ఎలాంటి ప్రశంసలు దక్కించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ అభిరుచి ఉన్న నిర్మాత అనే పేరును నాని దక్కించుకున్నాడు. కనుక ఈ సినిమా ను అంత ఈజీగా నాని ప్రజెంట్‌ చేసేందుకు ముందుకు వచ్చి ఉండడు. ప్రతి విషయాన్ని లోతుగా అంచనా వేసిన తర్వాత, కథను పూర్తిగా విశ్లేషించి, ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనే విషయాన్ని అంచనా వేసిన తర్వాత ముందుకు వచ్చి ఉంటాడు. నాని అంత నమ్మకం తో ముందుకు వచ్చాడు కనుక అలియాస్ రుక్మిణి సినిమా కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అని నితిన్‌ ఫ్యాన్స్ బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. హిట్‌ కోసం పరితపిస్తున్న నితిన్‌కు ఈ సినిమా హిట్‌ కావాలని ఆయన సన్నిహితులు కూడా బలంగా కోరుకుంటున్నారు. డిసెంబర్‌ 4, 2026న విడుదల కాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆఫియా సయ్యద్‌ నటించింది.