Begin typing your search above and press return to search.

దీపిక నుంచి సర్వం దొంగిలిస్తోంది

ఆమె అంటే అసూయ‌.. కుళ్లు..! అందుకే ఎప్పుడూ ఆమెవ‌న్నీ లాక్కుంటోంది! కేవ‌లం ఆమెకు మాత్ర‌మే ద‌క్కాల్సిన వాటిని కూడా ఈమె లాక్కుంటోంది.

By:  Sivaji Kontham   |   7 Sept 2025 9:01 AM IST
దీపిక నుంచి సర్వం దొంగిలిస్తోంది
X

ఆమె అంటే అసూయ‌.. కుళ్లు..! అందుకే ఎప్పుడూ ఆమెవ‌న్నీ లాక్కుంటోంది! కేవ‌లం ఆమెకు మాత్ర‌మే ద‌క్కాల్సిన వాటిని కూడా ఈమె లాక్కుంటోంది. ఇదంతా అభ‌ద్ర‌తాభావం.. వెన‌క‌బాటుత‌నం! అని ఆలియా భ‌ట్ పై అక్క‌సు వెల్ల‌గ‌క్కుతున్నారు దీపిక ప‌దుకొనే అభిమానులు.

ఇటీవ‌లే అమెరిక‌న్ బ్రాండ్ లెవిస్ ప్ర‌చార‌కర్త‌గా ఆలియా ఎంపికైంది. దీంతో ఇన్నాళ్లు లెవిస్ కి ప్ర‌చారం చేసిన దీపిక ప‌దుకొనే ఆ రోల్ నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. బ్రాండ్ ఇప్పుడు కొత్త ముఖాన్ని కోరుకోవ‌డంతో దీపిక త‌ర్వాత మ‌ళ్లీ ఆ స్థాయి ఉన్న ఆలియా భ‌ట్ ని ఎంపిక చేసుకుంది. అయితే ఇది చాలా మంది దీపిక అభిమానుల‌కు న‌చ్చ‌డం లేదు. ఈ ఎంపిక‌ను వారంతా పూర్తిగా త‌ప్పు ప‌డుతున్నారు.

అస‌లు దీపిక‌ను ఎందుకు మార్చారో చెప్పాలని కొందరు డిమాండ్ చేయగా, మరికొందరు ఆలియా దీపిక స్థానాన్ని దొంగిలించిందని ఆరోపించారు. దీపిక నుంచి అన్నిటినీ లాక్కోండి! అంటూ ఆలియాపై ఒక ప్ర‌ముఖుడు సీరియ‌స్ అయ్యాడు. ఆమె ఎందుకు? మాకు దీపిక అవసరం, ఆలియా కాదు! అని మ‌రొక‌రు వ్యాఖ్యానించారు. అయితే చాలా మంది దీపికను ప్రశంసిస్తూ బ్రాండ్ నిర్ణయాన్ని విమర్శించారు. ఆలియాకు ప్రతిదానిపై చాలా ఆకలిగా ఉంది.. అసూయగా ఉంది. ఆమె దీపికపై ఎందుకు అంతగా మక్కువ చూపుతోంది? రిపీటెడ్ ముఖాన్ని మళ్లీ మళ్లీ చూసి విసిగిపోయాము! అని అన్నాడు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే దీపిక‌, ఆలియా ప‌లు భారీ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు.