సీతమ్మ ఇలా స్లో అయితే ఎలా?
అవకాశాలు క్యూలో ఉన్నా అలియా మాత్రం సెలక్టివ్ గా వెళ్తుంది.పెళ్లికి ముందులా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ లు ..పక్కాగా హిట్ అవుతాయి?
By: Srikanth Kontham | 22 Oct 2025 6:00 AM ISTబాలీవుడ్ నటి అలియాభట్ సినిమాలు చేయడంలో స్పీడ్ తగ్గించిందా? పెళ్లికి ముందులా పెళ్లి తర్వాత పని చేయడం లేదా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. 2012 లో అమ్మడు `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్` తో కెరీర్ మొదలు పెట్టింది. అప్పటి నుంచి 2022 వరకూ ఒకే వేగంతో సినిమాలు చేసింది. ఆ వేగానికి తగ్గట్టే సక్సస్లు పడ్డాయి. 20-25 సినిమాల వరకూ ఒకే జోరుతో పని చేసింది. కానీ వివాహం అనంతరం అమ్మడు వేగం పూర్తిగా తగ్గించేసింది. 2022-25 మధ్య చూసుకుంటే కేవలం మూడు నాలుగు సినిమాలు మాత్రమే కనిపిస్తున్నాయి.
2022 లో ఒకే ఏడాది నాలుగు సినిమాలతో ప్రేక్షకుల మధ్యలో ఉంది. అదే ఏడాది అమ్మడికి రణబీర్ కపూర్ తో వివాహమైంది. అప్పటి నుంచి ఏడాదికి ఒక సినిమా మాత్రమే రిలీజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతుంది. 2023 లో `రాకీ ఔర్ రానీకి ప్రేమ్ కహానీ`, హాలీవుడ్ చిత్రం `హార్ట్ ఆఫ్ స్టోన్` తో ప్రేక్షకుల్లో ఉంది. అటుపై 2024 లో `జిగ్రా` తో అలరించింది. 2025 లో మాత్రం `ఆల్పా`తో అలరించడానికి రెడీ అవుతుంది. మరి అలియాలో వేగం తగ్గడానికి అసలు కారణం ఏంటి? అంటే సినిమాలు- ప్యామిలీ లైఫ్ ని బ్యాలెన్స్ చేసే క్రమంలోనే కొత్త ప్రాజెక్ట్ లు కమిట్ అవ్వడంలో ఆచితూచి వ్యవహరిస్తుంది.
అవకాశాలు క్యూలో ఉన్నా అలియా మాత్రం సెలక్టివ్ గా వెళ్తుంది.పెళ్లికి ముందులా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ లు ..పక్కాగా హిట్ అవుతాయి? అన్న కథలవైపే అడుగులు వేస్తోంది. ఏడాదికి ఒక సినిమా రిలీజ్ కు ఉండేలా చూసుకుంటుంది. `ఆల్పా` డిసెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న చిత్రమిది. అలియా ప్రధాన పాత్రలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ ఇది. యశ్ రాజ్ ఫిలింస్ తొలిసారి ఓ లేడీతో స్పై సినిమా చేయడం విశేషం. ఈ సినిమా అనంతరం 2026లో అమ్మడు `లవ్ అండ్ వార్` తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అటు పై ఏ సినిమాలు చేస్తుంది? అన్నది `లవ్ అండ్ వార్` చిత్రీకరణ ముగింపు దశకు వచ్చే వరకూ గానీ క్లారిటీ రాదు. అయితే అలియా భట్ ఇలా నెమ్మదిగా సినిమాలు చేయడంపై ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా అంసతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మునుపటిలా సినిమాలు చేయాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఈ అభ్య ర్ధనలను అలియాభట్ ఎలా తీసుకుంటుందో చూడాలి.
