సీతమ్మ స్పీడ్ ఒక్కసారిగా 20కి పడిపోయిందే!
బాలీవుడ్ నటి అలియాభట్ అలియాస్ సీతమ్మ రెండేళ్ల క్రితం వరకూ ఇండస్ట్రీలో ఎంత యాక్టివ్ గా సినిమాలు చేసేదో? చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 23 Sept 2025 8:00 PM ISTబాలీవుడ్ నటి అలియాభట్ అలియాస్ సీతమ్మ రెండేళ్ల క్రితం వరకూ ఇండస్ట్రీలో ఎంత యాక్టివ్ గా సినిమాలు చేసేదో? చెప్పాల్సిన పనిలేదు. ఏడాదికి రెండు..మూడు సినిమాలతోనైనా ప్రేక్షకుల మధ్యలో ఉండేది.
దాదాపు దశాబ్దం పాటు అమ్మడు ప్రయాణం అలాగే సాగింది. ఒక సినిమా సెట్స్ లో ఉండగానే మరో ప్రాజెక్ట్ ఒకే చేయడం పట్టాలెక్కించడం జరిగేది. మధ్య లో హాలీవుడ్ ని కూడా టచ్ చేసింది. బాలీవుడ్లో బిజీగా ఉన్నా హాలీవుడ్లో చిన్న రోల్ అయినా కాదనకుండా పని చేసింది. అంత బిజీగా ఉండే అలియాభట్ స్పీడ్ ఒక్కసారిగా తగ్గిపోయింది.
రెండు సినిమాలతోనే బిజీగా:
ప్రస్తుతం అమ్మడి లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. సెట్స్ లో ఉన్నది రెండు సినిమాలే. ఒకటి `ఆల్పా` అయితే మరోకటి `లవ్ అండ్ వార్`. `ఆల్పా` ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో అమ్మడు స్పై పాత్రలో కనిపించనుంది. యశ్ రాజ్ ఫిలింస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రమిది. అలాగే `లవ్ అండ్ వార్` సెట్స్ లో ఉంది. ఈ సినిమా షూటింగ్ నెమ్మదిగా జరుగుతోంది. మరోసారి రణబీర్ కపూర్ తో కలిసి నటిస్తోన్న చిత్రమిది. చేతిలో ఈ రెండు ప్రాజెక్ట్ లు తప్ప కొత్త సినిమాలేవి లేవు.
కథలు వినడం మానేసిందా:
కథలు వింటున్నట్లు కూడా బాలీవుడ్ మీడియాలో ఎక్కడా ప్రచారం కూడా జరగలేదు. దీంతో అలియాభట్ ఖాళీ సమయంలో ఏం చేస్తున్నట్లు? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధరాణంగా అలియా ఖాళీగా ఉండటం అంటూ తన డిక్షనరీలో ఉండదని ఓ సందర్భంలో తెలిపింది. ఖాళీ సమయంలో కొత్త కథలు వినడం..దర్శక రచయితలో ఇంటరాక్ట్ వంటివి చేస్తానని గతంలో తెలిపింది. వాటిలో నచ్చిన కథలు ఉంటే పిక్ చేసుకుంటుంది. కానీ అలియా ఇప్పుడా పద్దతిని పక్కన బెట్టినట్లు తెలుస్తోంది.
హాలీవుడ్ గుర్తింపు ప్రత్యేకం:
`ఆల్పా` చిత్రం ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. `లవ్ అండ్ వార్` మాత్రం వచ్చే ఏడాది రిలీజ్ ప్రాజెక్ట్ గా ప్రకటించారు. అలియా భట్ గతేడాది `జిగ్రా` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవడంలో విఫలమైంది. అంతకు ముందు ఏడాదే `హార్ట్ ఆఫ్ స్టోన్` తో హాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అమ్మడి పాత్ర చిన్నది కావడంతో విమర్శలకు గురైనా? హాలీవుడ్ పరంగా మంచి గుర్తింపు దక్కింది.
