బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?
ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూతురుగా, ప్రముఖ హీరోయిన్ సోనమ్ కపూర్ చెల్లిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రియా కపూర్.
By: Madhu Reddy | 4 Nov 2026 11:10 AM ISTప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూతురుగా, ప్రముఖ హీరోయిన్ సోనమ్ కపూర్ చెల్లిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రియా కపూర్. తొలిసారి 2010లో ఐషా అనే చిత్రంతో నిర్మాతగా తన వృత్తిని ప్రారంభించింది. ఒకవైపు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తూనే.. మరొకవైపు తన సోదరి సోనమ్ కపూర్ తో కలిసి ఫ్యాషన్ లైన్ రీసన్ అనే బ్రాండెడ్ దుస్తుల వ్యాపారాన్ని కూడా ప్రారంభించింది. అలాంటి ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ స్టార్ హీరోయిన్స్ ఔట్ ఫిట్ డిజైన్లను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఆలియా భట్ లేటెస్ట్ అవుట్ ఫిట్ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.
అలియా భట్ ధరించిన ఈ అవుట్ ఫిట్ అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈమె ధరించిన ఈ దుస్తులలో అందరి చూపు ఈమె బ్లౌజ్ పైనే పడడం గమనార్హం. అసలు విషయంలోకి వెళ్తే రా సిల్వర్ తో ఈమె బ్లౌజును చాలా చక్కగా డిజైన్ చేశారు. ఇకపోతే ఆలియా భట్ ధరించిన అవుట్ ఫిట్ విషయానికి వస్తే.. ప్రముఖ డిజైనర్ బ్రాండ్ అనావిలకీ చెందిన టూ - టోన్, డీప్ మాస్ గ్రీన్ కలర్ ప్యూర్ లెనిన్ చీర కట్టుకుంది. దీనికి కాంబినేషన్ లో డిజైనర్లు రింపిల్, హర్ ప్రీత్ రూపొందించిన కస్టమ్ మేడ్, హెవీలీ ఎంబెల్లిష్డ్ రా సిల్వర్ హాల్డర్ నెక్ బ్లౌజ్ ధరించింది. దీనిని ప్రాచీన వెండి ఆభరణాల డిజైన్లు, అలాగే రా జువెలర్స్ ఉపయోగించి చాలా వినూత్నంగా డిజైన్ చేశారు.మొత్తానికైతే డిఫరెంట్ ఔట్ ఫిట్ లో కనిపించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది అలియా భట్.
ఇకపోతే ఈమె ఈ ప్రత్యేకమైన అవుట్ ఫిట్ ను ధరించడానికి గల కారణం విషయానికొస్తే.. ముంబైలో జరిగిన రామాయణ సినిమా ప్రీమియర్ స్క్రీనింగ్ కోసం ఈ ల్యాండ్ మార్క్ స్టైల్ ను ఈమె ఎంపిక చేసుకున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ రియాకపూర్ డిజైన్ చేసిన ఈ లుక్ సాంప్రదాయ చేనేతకు సరికొత్త గ్లామర్ ను జోడించింది.
రామాయణ విషయానికి వస్తే.. నితీష్ తివారి దర్శకత్వంలో నమిత్ మల్హోత్ర భారీ బడ్జెట్ లో రూపొందించిన ఇతిహాస చిత్రం రామాయణ. దీపావళి సందర్భంగా నవంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా మొదటి భాగాన్ని ఈ దీపావళికి విడుదల చేయబోతున్నారు. వచ్చే ఏడాది దీపావళికి రెండో భాగాన్ని రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇంగ్లీషులో ఈ సినిమా స్క్రీనింగ్ కి రాగా.. ఇప్పుడు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా ముంబైలో స్పెషల్ స్క్రీనింగ్ వెయ్యగా.. ఈ షో కి ఈమె ఇలా చాలా యూనిక్ గా తయారయ్యి అందరిని ఆకట్టుకుంది.
