2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!
బాలీవుడ్‌లో పని గంటల వివాదంపై దీపికా పదుకొణెకు అలియా భట్ మద్దతు తెలిపారు. సినిమా సెట్లలో మహిళా కళాకారులు, సిబ్బందికి సరైన పని వేళలతో పాటు పరిశుభ్రమైన టాయిలెట్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. 2026లోనూ కనీస మౌలిక సదుపాయాల గురించి చర్చించుకోవాల్సి రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
By: Srikanth Kontham | 20 Nov 2026 10:06 AM ISTబాలీవుడ్ నటి దీపికా పదుకొణె లేవనెత్తిన పని గంటల వివాదం ఎంత సంచలనమైందో తెలిసిందే. ఈ విషయంలో కొందరు దీపికకు మద్దతు ఇవ్వగా మరికొందరు బ్యాలెన్స్ గా తెరపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా అలియా భట్ కూడా దీపికకు మద్దతు ప్రకటించారు. వర్కింగ్ హవర్స్ తో పాటు సెట్లలో మహిళా కళాకారులు, సిబ్బందికి పరిశుభ్రమైన టాయిలెట్ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరాన్ని అలియా ప్రస్తావించడం విశేషం. ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఇప్పటికీ కనీస మౌలిక సదుపాయాల కోసం మాట్లాడుకోవాల్సి రావడం ఆశ్చర్యకరమైన విషయమే అంటూ అసహనం వ్యక్తం చేసారు.
పని గంటల విషయంలో స్పష్టమైన వ్యవస్థ ఉండాలన్నారు. ఇష్టారాజ్యంగా కాకుండా సమంజసమైన పని గంటలు పాటిస్తే పనిలో నాణ్యత, సామర్థ్యం పెరుగుతాయని అభి ప్రాయపడ్డారు. హక్కులు.. పని వేళల గురించి మాట్లాడిదే అవకాశాలు పోతాయనే భయం ఎవరికీ ఉండ కూడదన్నారు. 2026లోనూ సినిమా సెట్‌లో మహిళకు శుభ్రమైన బాత్రూమ్ వాడుకునే అవకాశం గురించి చర్చించుకోవాల్సి రావడం బాధాకరమన్నారు.
`దేశం ఎంతో అభివృద్ది చెందుతుంది. సాంకేతికంగా ఎంతో ముందుంటున్నాం. సాధారణ పోన్ల నుంచి స్మార్ట్ ఫోన్ కు వచ్చాం. గూగుల్ ను దాటి ఏఐ యుగంలో ఉన్నాం. కానీ ఇండస్ట్రీలో కొన్ని పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాకపోవడం శోచనీయం. మన సినిమాలు వందల కోట్లు వసూళ్లు సాధిస్తున్నాయని గొప్పగా చెప్పుకోవడం కాదు. ఆ వసూళ్లకు కారకులైన వారిని పరిశ్రమలో దర్శక, నిర్మాతలు బాగా చూసుకోవాలి. కేవలం అగ్ర హీరోయిన్లకే అన్ని రకాలు సౌకర్యాలు పరిమితం కాకూడదు. కనీస సౌకర్యాలు మహిళా సిబ్బందికి కల్పించాల్సిన బాధ్యత ఉంది. కింది స్థాయి సిబ్బందిని గౌరవంగా గొప్పగా చూసుకోవాలి. అప్పుడే ఇండస్ట్రీ అసలైన పురోగతి సాధ్యమవుతుంద`న్నారు
ఇక అలియాభట్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో `లవ్ అండ్ వార్` సినిమాతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే తుంబాడ్ 2 లోనూ అలియా ఎంపికైంది. ఈ సినిమా కూడా సెట్స్ లోనే ఉంది. అయితే 2026 మాత్రం అలియాకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. అమ్మడు నటించిన `ఆల్పా` భారీ అంచనాల మధ్య విడుదలైనా వాటిని అందుకోవడంలో విఫలమైన సంగతి తెలిసిందే.
