ప్రిన్సెస్ లుక్కులో అలియా భట్.. తల్లైనా తరగని అందం!
సహజ నటిగా బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అలియా భట్.. మహేష్ భట్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
By: Madhu Reddy | 13 May 2026 11:44 AM ISTసహజ నటిగా బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అలియా భట్.. మహేష్ భట్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అద్భుతమైన నటనతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకున్న ఈమె.. అటు బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సీత పాత్ర ద్వారా దగ్గరైన అలియా.. ఇప్పుడు బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఈ క్రమంలోనే ఒకవైపు నటనతో ఆకట్టుకుంటూనే.. మరొకవైపు ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది.
తాజాగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2026లో సందడి చేసిన ఈమె ప్రిన్సెస్ లుక్కులో అందరిని కట్టిపడేసింది. రెడ్ కార్పెట్ పై ఆడంబరాలకు తావు ఇవ్వకుండా సింపుల్ లుక్ లో కనిపించి హొయలు పోయింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ యష్ పాటిల్ రూపొందించిన ఈ గౌనుపై ఫ్రెంచ్ రివేరా స్ఫూర్తితో బసూరి చోక్షీ తన స్వహస్తాలతో అద్భుతమైన కళాకృతిని డిజైన్ చేసింది. ముఖ్యంగా లేత ఆకుపచ్చ, నీలం , లావెండర్, పసుపు రంగులతో అందమైన చిత్రాలను రూపొందించారు.
ముఖ్యంగా ఆధునికతకు రూపం పోస్తూ చాలా అద్భుతంగా డిజైన్ చేసిన ఈ గౌను 1950 లనాటి సిల్హౌట్ ల నుండి ప్రేరణ పొందింది . ముఖ్యంగా ఇందులో స్ట్రక్చర్డ్ కార్సెట్ బోడిస్ తో ఈ గౌనును మరింత అత్యంత సుందరంగా డిజైన్ చేశారు.
79వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ప్రస్తుతం ఫ్రాన్స్ లో జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతూ.. రెడ్ కార్పెట్ పై నడుస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే బాలీవుడ్ బార్బీ గర్ల్ అలియా భట్ ఇలా తను సింపుల్ అవుట్ ఫిట్ తో ఆధునికతను ప్రజెంట్ చేస్తూ రెడ్ కార్పెట్ పై సందడి చేసింది. ఇకపోతే స్టైలిస్ట్ రియా కపూర్, అలియా భట్ ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన తీరుకి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. మొత్తానికి అయితే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తన అద్భుతమైన ఔట్ఫిట్ తో బీచ్ లో భిన్నమైన ఫోజులిస్తూ..ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో ఈమె ఫోటోలను చూసి అభిమానులు కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు.
అలాగే అలియా భట్ పై తమ అభిప్రాయాలను కురిపిస్తూ రాకుమారిలా ఉంది అని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు వేసవికి సరిగా సరిపోతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొక అభిమాని.. అలియా చాలా అందంగా ఉంది. సుదీర్ఘ ప్రయాణం తర్వాత కూడా ఆమె మరింత తాజాగా కనిపిస్తోంది అని కామెంట్లు చేశారు. ఇంకొంతమంది తల్లి అయినా సరే పెళ్లి కానీ అమ్మాయిలా.. తరగని అందంతో అందరిని కట్టిపడేస్తోంది అంటూ ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
