సొంత బిడ్డవి కాదు..బిస్కెట్ ప్యాకెట్ తో ప్రీగా వచ్చావ్ అన్నారు!
బాలీవుడ్ లో ఆలియా భట్ కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 12 Sept 2026 3:00 PM ISTబాలీవుడ్ లో ఆలియా భట్ కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే కథల విషయంలో మాత్రం తొందరపడటం లేదు. సరైన కథలు వస్తే తప్ప కమిట్ అవ్వడం లేదు. పారితోషికం భారీగా ఆపర్ చేస్తున్నా? నచ్చిన కథలకే కమిట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా `డోంట్ బీ షై` ఈవెంట్ లో అలియాభట్ అక్క షాహిన్ బట్ తో ఉన్న చిన్న నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఓ కార్యక్రమంలో భాగంగా రేజ్‌బెయిట్ ( ఇతరులను కావాలని కోపం తెప్పించడం లేదా చిరాకు పెట్టడం) అనే అంశంపై మాట్లాడాల్సిందిగా ఆలియాను కోరారు. దానికి అలియా భట్క ఇలా స్పందించారు.
చిన్నతనంలో తన సోదరి షాహీన్ తనను నిరంతరం కోపానికి గురిచేసేదని తెలిపారు. తనకు నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పుడు `నువ్వు అమ్మానాన్నల (మహేష్ భట్, సోని రజ్దాన్) సొంత బిడ్డవి కావు.. పార్లే-జి బిస్కట్ ప్యాకెట్‌తో ఫ్రీగా వచ్చావు అని చెప్పి ఏడిపించేదని ఆలియా భట్ నవ్వుతూ వెల్లడించారు. చిన్నప్పుడు షాహీన్ చేసిన ఈ సరదా వ్యాఖ్యలు తనను తీవ్రంగా కోపానికి గురిచేసేవని, ఆ వయసులో అదే నిజమని నమ్మి ఏడ్చేదాన్ని అన్నారు. అక్కచెల్లెళ్ల మధ్య ఉండే చిన్ననాటి చిలిపి గొడవలు, ఆటపట్టించడాలు తమ మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేసాయన్నారు.
ఇదే వేదికపై ఆలియా భట్ తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. 2012లో కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కిన `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్` చిత్రం ద్వారా అలియభట్ కథానాయికగా పరిచయమైన సంగతి తెలిసిందే. సరిగ్గా 14 ఏళ్ల క్రితం నటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అలియా ఇప్పుడు ఒక నిర్మాతగా తన ప్రాజెక్ట్ ద్వారా నలుగురు కొత్త నటీనటులను పరిచయం చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తోందని ఆనందం వ్యక్తం చేశారు.
నిర్మాతగా వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తూనే నూతన ప్రతిభను ప్రోత్సహించడం సంతోషంగా ఉందని ఆలియా పేర్కొన్నారు. ఆలియా భట్ నిర్మించిన `డోంట్ బీ షై` సిరీస్ విషయానికొస్తే ఇందులో ఆరుషి బజాజ్, పీయూష్ ఖాటి, బియాంకా అరోరా అంశ్ దుగ్గల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రేమ, చిన్ననాటి పొరపాట్లు, యువత ఆలోచనల చుట్టూ సాగే కమింగ్-ఆఫ్-ఏజ్ సిరీస్ సెప్టెంబర్ 25 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఆలియా భట్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `లవ్ & వార్` చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమెతో పాటు రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీంతో పాటు `తుంబాడ్ 2` చిత్రంలోనూ అమ్మడు కీలక పాత్ర పోషిస్తున్నారు.
