అనుమతి లేకుండా వీడియోలు తీస్తే మీరు సహిస్తారా? ఆలియా ప్రశ్న!
``మీ ఇంటి లోపలి వీడియోలను మీకు తెలియకుండా, మీ అనుమతి లేకుండా షేర్ చేయడాన్ని మీరు సహిస్తారా? మనలో ఎవరూ సహించలేము.. దీని గురించి మీరు ఆలోచించండి`` అని అలియా అసహనం వ్యక్తం చేసారు
By: Sivaji Kontham | 26 Aug 2025 10:22 PM IST``మీ ఇంటి లోపలి వీడియోలను మీకు తెలియకుండా, మీ అనుమతి లేకుండా షేర్ చేయడాన్ని మీరు సహిస్తారా? మనలో ఎవరూ సహించలేము.. దీని గురించి మీరు ఆలోచించండి`` అని అలియా అసహనం వ్యక్తం చేసారు. ఇంతకుముందు నిర్మాణంలో ఉన్న ఆలియా- రణబీర్ కపూర్ జంట సొంత ఇంటి ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. ఇంకా నిర్మాణంలో ఉన్న ఇంద్ర భవనం లాంటి ఇంటి వీడియో వేగంగా వైరల్ అయింది.
అయితే ఇది తమ గోప్యతపై జరిగిన దాడిగా అభివర్ణించారు ఆలియా భట్. తమ అనుమతి లేకుండా ఈ వీడియోలు, ఫోటోలు తీయడాన్ని తప్పు పట్టారు. ముంబై వంటి చోట్ల ఇరుకుగా ఉండే ఇల్లు.. పక్కనే ఉన్న ఇంట్లోకి తొంగి చూడటం సరికాదని నా అభిప్రాయం. ఇది గోప్యతపైదాడి.. తీవ్రమైన భద్రతా సమస్య. అనుమతి లేకుండా ఒకరి వ్యక్తిగత స్థలాన్ని ఫోటో తీయడం లేదా వీడియోలు తీయడం చట్టపరమైన హక్కులను ఉల్లంఘించడమేనని అన్నారు.
దయచేసి ఇలాంటి కంటెంట్ ని ఇతరులకు షేర్ చేయొద్దని కూడా ఆలియా కోరారు. ఇంకా నిర్మాణంలో ఉన్న తన ఇంటి ఫుటేజ్‌ను వెంటనే తొలగించమని మీడియాను ఆలియా కోరింది. ఫోటోలు వీడియోలను పోస్టో చేసిన మీడియా స్నేహాతులు వాటిని తొలగించాలని ఆలియా వినయపూర్వకంగా కోరింది.
ఆలియా-రణబీర్ దంపతుల కొత్త ఇల్లు `ది కృష్ణ రాజ్ బంగ్లా` చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. ఇది వారసత్వపు ఆస్తి. కపూర్ ల పాత బంగ్లాను పూర్తిగా తొలగించి ఈ కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. ఇప్పటికి దాదాపు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఇంటీరియర్ పనులు సాగుతున్నాయి. నెల రోజుల తర్వాత ఇది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం దీపావళి నాటికి రణబీర్- అలియా తమ కొత్త నివాసంలోకి మారే అవకాశం ఉందని కూడా కథనాలొస్తున్నాయి. దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో అత్యంత విలాసవంతంగా నిర్మించిన ఈ ఇల్లు ముంబై నగరానికే తలమానికంగా కనిపిస్తోంది. రణబీర్- ఆలియా దంపతులు ఈ వారసత్వ సంపదను గారాల కుమార్తె రాహా కపూర్ కి కానుకగా అందిస్తున్నామని ప్రకటించారు.
