వామ్మో అలియాభట్ టాలెంట్ చూశారా.. అదరగొట్టేసిందిగా?
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కి ఇండస్ట్రీలో ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ తన సొంత టాలెంట్ తోనే ఎదిగింది.
By: Madhu Reddy | 27 Sept 2025 5:00 PM ISTబాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కి ఇండస్ట్రీలో ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ తన సొంత టాలెంట్ తోనే ఎదిగింది. అలియా భట్ తండ్రి పెద్ద నిర్మాత.. అలాంటిది ఈమెకు అవకాశాలు తెప్పించుకోవడం చాలా ఈజీ. కానీ అలియా భట్ మాత్రం తన నటనతోనే అవకాశాలు అందుకుంటుంది. అయితే అలాంటి అలియా భట్ తన జీవితాన్ని చాలా చక్కగా బిల్డ్ చేసుకుంటుంది. ఓవైపు తల్లిగా..మరోవైపు భార్యగా..ఇంకో వైపు నటిగా.. ఇలా ప్రతి ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది.అయితే అలాంటి అలియా భట్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోని అప్లోడ్ చేసింది.
అందులో ఏముందంటే.. పాడిల్ బాల్ గేమ్.. మీ అందరికీ తెలిసిందే. అలియా భట్ కేవలం నటిగానే కాదు టైం దొరికినప్పుడల్లా పాడిల్ బాల్ గేమ్ ఆడుతుంది కూడా.. రీసెంట్ గా ఆమె పాడిల్ బాల్ గేమ్ ఆడిన టైంలో.. చాలామంది ఆమె వీడియోలు చిత్రీకరించినప్పుడు వారిపై ఆగ్రహించింది. ఆమె వీడియోలు తీయడానికి వచ్చిన చాలామంది నెటిజన్స్ పై.." ఇక్కడతో ఆగిపోండి..మా ఇంట్లోకి రాకండి.. ఇది మీ ఇల్లు కాదు" అన్నట్లుగా రియాక్ట్ అయిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. అయితే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పాడిల్ బాల్ గేమ్ ఆడుతున్న వీడియోని షేర్ చేసింది అలియా భట్.
అయితే ఈ వీడియోలో అలియా భట్ చాలా అద్భుతంగా పాడిల్ బాల్ గేమ్ ఆడుతోంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు అలియా భట్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు..ఎందుకంటే ఓవైపు హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలో రాణిస్తూనే.. మరోవైపు పలు వ్యాపారాలు చేస్తూ బిజినెస్ ఉమెన్ గా కూడా సక్సెస్ అయింది. అంతేకాకుండా రణబీర్ కపూర్ కి భార్యగా.. రాహాకి తల్లిగా తన బాధ్యతలు కొనసాగిస్తోంది. అలా ప్రతి విషయంలో సక్సెస్ఫుల్ గా రాణిస్తూ మల్టీ టాలెంటెడ్ ఉమెన్ గా అలియాభట్ పేరు తెచ్చుకుంటుంది. అయితే అలాంటి అలియాభట్ తాజాగా పాడిల్ బాల్ గేమ్ ఆడిన వీడియోని చూసిన ఎంతోమంది నెటిజెన్లు మల్టీ టాలెంటెడ్ ఉమెన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సమయం దొరికితే చాలు అలియా భట్ ఈ గేమ్ ఆడటానికి ఎక్కువగా ఇష్టపడుతుందట..
అలియా భట్ సినిమాల విషయానికి వస్తే.. అలియా భట్ చేతిలో ప్రస్తుతం ఇన్షా అల్లా, మధుబాల, ఆల్ఫా, తఖ్త్ వంటి సినిమాలు ఉన్నాయి.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తో అలియా భట్ ఇన్షా అల్లా అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాకి సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత అయినటువంటి కరణ్ జోహార్ డైరెక్షన్లో తఖ్త్ అనే సినిమాలో కూడా నటిస్తోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఆల్ఫా అనే మూవీ రాబోతోంది. అలా అలియా భట్ తన కూతుర్ని చూసుకుంటూనే మరోవైపు ఒకే ఏడాది నాలుగైదు సినిమాల్లో నటిస్తోంది.
