దుర్గా పూజ పండల్‌లో ఆలియా సందడి
దేశమంతా దుర్గా పూజల సందడి.. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ దసరా ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటున్నారు.
By: Sivaji Kontham | 2 Oct 2025 9:28 AM ISTదేశమంతా దుర్గా పూజల సందడి.. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ దసరా ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటున్నారు. బుధవారం ముంబైలో కాజోల్ - రాణి ముఖర్జీ కుటుంబాలు నిర్వహించిన దుర్గా పూజ పండల్‌ను అలియా భట్ సందర్శించారు. వేడుకలో సీనియర్ నటీమణుల మధ్య ఆలియా ప్రత్యేక ఆకర్షణగా మారింది.
దుర్గా పూజ పండల్ లోపలికి అలియా వెళ్ళగానే, ఒక అభిమాని అకస్మాత్తుగా తన చేతిని పట్టుకుని, ఫోటో కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. ఆ క్షణం పరిస్థితి గందరగోళంగా మారింది. కానీ అలియా ఆ సందర్భాన్ని ఎంతో తెలివిగా మ్యానేజ్ చేసింది. ఒక చిన్న ఫోటో కోసం పోజులిచ్చే ముందు ప్రశాంతంగా ఉండమని తన సెక్యూరిటీని కోరింది.
అయితే ఆ సందర్భంలో ఆలియా ప్రవర్తనను అందరూ కీర్తించారు. మరికొందరు ఆలియా చేయి పట్టుకున్నందుకు అభిమానిని విమర్శించారు. కానీ ఆలియా ఇవేమీ పట్టించుకోలేదు.
బుధవారం నవమి రోజున నార్త్ బాంబే దుర్గోత్సవ్ లో అలియా భట్ నుదుటిపై నల్లటి బిందీ ధరించడం కూడా ఆకర్షించింది. ఆలియా అందమైన చిరునవ్వుతో హృదయాలను గెలుచుకుంది. రాణి ముఖర్జీ, అయాన్ ముఖర్జీ , తనీషా ముఖర్జీ - అందరూ పండల్ వద్ద ఆలియాతో సెల్ఫీ దిగారు. ఇంతకుముందు ఇదే చోట ఉత్సవాల్లో రణబీర్ కూడా పాల్గొన్నాడు. రణబీర్ - అలియా ఇద్దరూ అయాన్ ముఖర్జీతో కలిసి అతని బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్- శివ చిత్రంలో పనిచేశారు.
గత కొన్ని రోజులుగా ముఖర్జీ ఇంట దుర్గా పూజ ఉత్సవానికి జయ బచ్చన్, ప్రియాంక చోప్రా, ట్వింకిల్ ఖన్నా, బిపాషా బసు, కరణ్ సింగ్ గ్రోవర్, సుష్మితా సేన్ సహా చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు.
