Begin typing your search above and press return to search.

దసరా స్పెషల్.. చీరకట్టులో మరింత అందంగా కనిపిస్తున్న ఆలియా!

బాలీవుడ్ నటి ఆలియా భట్ తాజాగా దసరా సందర్భంగా చీరకట్టుతో మెరిసింది. అద్భుతమైన చీరలో ఈ హీరోయిన్ మరింత అందంగా కనిపిస్తోంది.

By:  Madhu Reddy   |   2 Oct 2025 2:51 PM IST
దసరా స్పెషల్.. చీరకట్టులో మరింత అందంగా కనిపిస్తున్న ఆలియా!
X

బాలీవుడ్ నటి ఆలియా భట్ తాజాగా దసరా సందర్భంగా చీరకట్టుతో మెరిసింది. అద్భుతమైన చీరలో ఈ హీరోయిన్ మరింత అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం చీరకట్టుతో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. సాంప్రదాయం ఉట్టిపడేలా అద్భుతమైన ఆలీవ్ రంగు చీరను ధరించింది.. ఆర్గాంజా ఫ్యాబ్రిక్ తో రూపొందించిన ఈ ఆరు గజాల ఆలీవ్ రంగు చీరను స్టైల్ చేసింది ఆలియా భట్.


ఈ చీర కి వెండి అంచులను.. భారీ సీక్వెన్స్ వర్క్ తో పాటు గ్రాండ్ టచ్ తో కూడిన జరీ ఎంబ్రాయిడరీ తో చక్కగా డిజైన్ చేశారు. అలాగే బంగారు రంగు తో కూడిన ప్రింటింగ్ చీరకి హైలెట్ గా నిలిచింది.. ఈ శారీ లుక్ ని ఫుల్ ఫిల్ చేయడం కోసం వైట్ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేసింది. స్వీట్ హార్ట్ నెక్ లైన్ ఫుల్ స్లీవ్స్ వేసుకొని మరింత అందంగా కనిపిస్తోంది.. అలాగే వెండి రంగు కుందన్ పొదిగిన చెవిపోగులను ధరించిన ఈమె, ఎరుపు రంగు గాజులతో స్టైల్ చేసింది.అలాగే మేకప్ తో ఆలియా భట్ మొహం మరింత అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అలియా భట్ కి సంబంధించిన ఈ శారీ స్టైల్ ఫొటోస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి..


ఆలియా భట్ సినిమాల విషయానికి వస్తే..గత ఏడాది ఈ హీరోయిన్ జిగ్రా మూవీలో కనిపించింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ చేతిలో యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో ఓ సినిమా చేస్తోంది. అలాగే ఆల్ఫా మూవీ తో పాటు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో వస్తున్న లవ్ అండ్ వార్ మూవీలో కూడా నడుస్తోంది.ఈ సినిమాలో హీరోగా ఈమె భర్త రణబీర్ కపూర్ నటించడం విశేషం. అలాగే గతంలో ఈమె తన భర్త రణబీర్ కపూర్ తో కలిసి చేసిన బ్రహ్మాస్త్ర సీక్వెల్ లో కూడా నటిస్తోంది. ఒకవైపు హీరోయిన్ గా మరొకవైపు తల్లిగా, భార్యగా కుటుంబ బాధ్యతలు చేపడుతూ.. బిజీగా మారిన అలియా భట్.. పిల్లల కోసం బ్రాండెడ్ దుస్తులను అందిస్తూ ఇటు బిజినెస్ రంగంలో కూడా మరింత సక్సెస్ అయ్యింది ఆలియా భట్.


ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇప్పటివరకు ఏకంగా ఐదుసార్లు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. అలాగే గంగు భాయ్ కతియావాడి సినిమలోని నటనకి గానూ ఏకంగా ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకుంది. అలా ఓవైపు ఫిలింఫేర్ అవార్డులతో పాటు నేషనల్ అవార్డు అందుకొని సత్తా చాటింది.


అయితే ఈ హీరోయిన్ అవార్డుల విషయంలో చాలానే విమర్శలు ఎదుర్కొంది. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి ఆలియాభట్ నెపోకిడ్ అనే విమర్శలు ఎదుర్కొంటుంది. ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉండడం వల్ల ఆమెకు అవకాశాలు రావడంతో పాటు ఇన్ని అవార్డులు వస్తున్నాయి అని కొంతమంది విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా తన కెరియర్ తాను చూసుకుంటూ ఇండస్ట్రీలో ముందుకు సాగుతోంది.