Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : చీర కట్టకుండా లుంగీ కట్టిందేం..?

ఆమె తన దీపావళి సెలబ్రేషన్‌ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ధరించిన ఔట్‌ ఫిట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయింది.

By:  Ramesh Palla   |   23 Oct 2025 11:34 AM IST
పిక్‌టాక్‌ : చీర కట్టకుండా లుంగీ కట్టిందేం..?
X

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ముఖ్యంగా హీరోయిన్స్‌ ఫ్యాషన్‌కు తగ్గట్లుగా, ట్రెండ్‌కి అనుగుణంగా తమ స్టైల్‌ను మార్చుకోవాల్సిందే. అలా మారకుంటే ఔట్‌ డేటెడ్‌ బ్యూటీ అంటారు. ట్రెండ్‌కు తగ్గట్లుగా మారినప్పుడు కొన్ని సార్లు ట్రోల్స్ కి గురి కావాల్సి వస్తుంది. మోడ్రన్‌ డ్రెస్‌, ఫ్యాషన్ ఔట్‌ ఫిట్‌ అని ధరించిన కొన్ని డ్రెస్‌లు మిస్ ఫైర్ అయిన సందర్భాలు ఉంటాయి. చాలా మంది హీరోయిన్స్ ఆ అనుభవం ను చవిచూసిన సందర్భాలు ఉన్నాయి. ఫ్యాషన్‌ పేరుతో కొందరు ధరించే ఔట్‌ ఫిట్‌ ఎప్పటికప్పుడు విమర్శలు ఎదుర్కోవడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఆలియా భట్‌ వంతు వచ్చినట్లుగా ఉంది. ఆమె తన దీపావళి సెలబ్రేషన్‌ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ధరించిన ఔట్‌ ఫిట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయింది.




ఆలియా భట్‌ దీపావళి సెలబ్రేషన్స్‌

ఆలియా భట్‌ సింపుల్‌ వేర్‌ను ధరించింది. అయితే అది కూడా విభిన్నంగా ఉండటం వల్ల చర్చకు తెర తీసినట్లు అయింది. కుర్తా ధరించిన ఆలియా భట్‌ కింద మాత్రం పాయింట్‌ ధరించకుండా విభిన్నంగా ఉండే విధంగా పాలజో టైప్‌ పాయింట్‌ను ధరించినట్లుగా అనిపించింది. అయితే దాన్ని చాలా మంది లుంగీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్స్ కొందరు చీరను సరిగ్గా కట్టుకోకుండా ఆలియా ఇలా లుంగీలా చుట్టుకుందా అన్నట్లుగా కామెంట్స్‌ చేస్తున్నారు. నెట్టింట ప్రస్తుతానికి ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. కొందరు మాత్రం ఆలియా దీపావళి ఔట్‌ ఫిట్‌ను అభినందిస్తున్నారు. చాలా బాగుందని, కొత్త ట్రెండ్‌ అంటున్నారు. లుంగీ ఆకారంలో ఉన్న ఆ ఔట్‌ ఫిట్‌ విషయంలో రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అమ్మాయిలు ఎలాంటి ఔట్‌ ఫిట్‌ ధరించిన అందంగా ఉంటారని ఆలియా మరోసారి నిరూపితం చేసింది.




ఫ్యాషన్‌ వరల్డ్‌లో కొత్త ట్రెండ్‌

దీపావళి సెలబ్రేషన్స్‌లో ఆలియా ధరించిన ఔట్‌ ఫిట్‌ చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ ఆమె స్టార్‌డం కారణంగా అది వార్తల్లో నిలిచింది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడి యొక్క ఫోటోలు, అదే సమయంలో షేర్‌ చేసిన వీడియోలు సైతం వైరల్‌ అవుతున్నాయి. తన భర్త, ఇతర ఫ్యామిలీ మెంబర్స్‌తో ఆలియా భట్‌ దీపావళి సెలబ్రేషన్స్‌ లో పాల్గొంది. బాలీవుడ్‌ సెలబ్రిటీల యొక్క చీర కట్టు ఫోటోలు మాత్రమే కాకుండా ఇలాంటి విభిన్నమైన ఔట్‌ ఫిట్‌ ఫోటోలు సైతం వైరల్‌ కావడం మనం రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఆలియా భట్‌ యొక్క ఈ దీపావళి సెలబ్రేషన్‌ ఔట్‌ ఫిట్‌ ఆకట్టుకుంది అంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఎప్పటిలాగే విమర్శలు చేస్తున్నారు. వాటి గురించి పట్టించుకోకుండా భవిష్యత్తులో ఆలియాను చాలా మంది యూత్‌ ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయని ఫ్యాషన్ విశ్లేషకులు అంటున్నారు.




ఆలియా ఆల్ఫా సినిమా కోసం వెయిటింగ్‌

సినిమాల విషయానికి వస్తే ఆలియా బిజీ బిజీగా సినిమాలు చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఈమె నటిస్తున్న ఆల్ఫా స్పై థ్రిల్లర్‌ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న ఈ స్పై థ్రిల్లర్‌ మొదటి లేడీ స్పై థ్రిల్లర్‌ సినిమాగా బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఆలియా భట్‌ ఈ సినిమా కోసం చాలా కాలం కష్టపడింది. ఆల్ఫా సినిమాతో ఆలియా భట్‌ ఇండియాస్ లేడీ సూపర్‌ స్టార్‌ కాబోతుందని అభిమానులతో పాటు, చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. శివ్ రావైల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. శార్వరి మరియు బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తర్వాత ఆలియా భట్‌ లవ్‌ అండ్‌ వార్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా సైతం మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.