ఆలియా ఇంట దీపావళి సంబరాలు.. అంబరాన్ని అంటిన వేళ!
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
By: Madhu Reddy | 20 Oct 2025 9:21 AM ISTప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నేచురల్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. అతి తక్కువ సమయంలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా సూపర్ స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయిన ఆలియా భట్ అందాన్ని వలకబోయడమే కాదు యాక్షన్ సన్నివేషాలలో కూడా అదరగొట్టగలను అని నిరూపిస్తోంది.
హిందీలో సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. ఇటీవల తెలుగులో కూడా సినిమా చేసి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ ప్రేయసి పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇకపోతే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేసే ఈమె తాజాగా దీపావళి సెలబ్రేషన్స్ లో భాగంగా అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
ఈరోజు దీపావళి కావడంతో గత కొన్ని రోజుల ముందే సెలబ్రిటీల ఇళ్లల్లో దీపావళి సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.. అందులో భాగంగానే అలియా భట్ కూడా తన ఇంట్లో తన స్నేహితులకు, బంధుమిత్రులకు దీపావళి పార్టీ ఇచ్చింది. అందులో చాలామంది సెలబ్రిటీలు హాజరయ్యారు. వారితో కలిసి ఫోటోలు దిగిన ఈమె.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇకపోతే ఆలియా భట్ ఆతిథ్యం ఇచ్చిన వారిలో కరీనాకపూర్ , కరిష్మా కపూర్ తో పాటు అలేఖ వాణి జైన్, నందనీ తాషా, అనీషా మల్హోత్రా జైన్, నీతూ తదితరులు పాల్గొన్నారు. ఈ దీపావళి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
మరికొన్ని ఫోటోలలో ఆలియా భట్ అందంగా ముస్తాబైన ఫోటోలను షేర్ చేసింది. గోల్డెన్ కలర్ అవుట్ ఫిట్ లో తన అందాలతో మరొకసారి అభిమానులను అబ్బురపరిచింది. ఒక పిల్లకు తల్లి అయినా.. మరింత అందంగా అభిమానులను ఆకట్టుకుంటుంది అంటూ ఆలియా భట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. ఆలియా భట్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే ప్రముఖ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది.పెళ్లయిన అదే ఏడాది పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ఆలియా భట్ విషయానికి వస్తే.. హిందీ చిత్రాలలో ఎక్కువగా పనిచేసే ఈమె సవాలుతో కూడిన పరిస్థితులను ఎదుర్కొనే హీరోయిన్స్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఈమె భారతీయ సంతతికి చెందిన బ్రిటీష్ నటి కావడం గమనార్హం తన అద్భుతమైన నటనతో నేషనల్ అవార్డుతో పాటు ఏడు ఫిలింఫేర్ అవార్డులు తో సహా అనేక ప్రశంసలు అందుకుంది.. ఇండియాలోనే అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న ఈమెకు.. 2022లో టైం 100 ఇంపాక్ట్ అవార్డును కూడా ప్రధానం చేశారు. 2024 లో అత్యంత ప్రభావంతమైన వ్యక్తులలో ఒకరిగా స్థానం సంపాదించుకుంది.
