Begin typing your search above and press return to search.

'గర్ల్ గ్యాంగ్' లో ఆలియా తోడి పెళ్లికూతురు లుక్ కిరాక్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ షేర్ చేసిన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

By:  Sivaji Kontham   |   13 July 2026 9:50 PM IST
గర్ల్ గ్యాంగ్ లో ఆలియా తోడి పెళ్లికూతురు లుక్ కిరాక్
X

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ షేర్ చేసిన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. తన ప్రాణస్నేహితురాలి వివాహ వేడుకకు సంబంధించిన అందమైన ఫొటోలను షేర్ చేయ‌గా.. అభిమానులు-నెటిజన్లు లవ్ ఎమోజీలతో కామెంట్ల వర్షం కురుపిస్తున్నారు. ఈ ఫొటోలలో ఆలియా తన చిన్ననాటి స్నేహితుల గుంపుతో కలిసి ఎంతో ఉత్సాహంగా, సందడిగా కనిపిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.




ఈ సోషల్ మీడియా పోస్ట్ తో ఒక అరుదైన, భావోద్వేగభరితమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆలియా భట్ స్కూల్ రోజుల నాటి బెస్ట్ ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో చివరిగా మిగిలిన స్నేహితురాలికి కూడా ఇప్పుడు వివాహం జరిగిపోయింది. ఈ శుభ‌సంద‌ర్భంలో ``గర్ల్స్ గ్యాంగ్‌లో అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి!`` అంటూ అభిమానులు కామెంట్ల సెక్షన్‌లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగి... ఒకరికొక‌రు జీవితంలోని ప్రతి ముఖ్యమైన ఘట్టంలోనూ తోడుగా నిలిచిన ఈ స్నేహితుల బంధం అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని నెటిజన్లు కొనియాడుతున్నారు.




స్నేహితురాలి పెళ్లి వేడుకలో బ్రైడ్స్‌మెయిడ్‌(తోడి పెళ్లికూతురు)గా ఆలియా భట్ తన ఫ్యాషన్ సెన్స్‌తో మరోసారి మెరిసిపోయింది. ముఖ్యంగా ఈ బ్యూటీ ధరించిన గ్రే కలర్ శారీ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ``మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ`` అంటూ ఫ్యాన్స్ ఆలియా అందాన్ని తెగ పొగిడేస్తున్నారు. గతంలో ఈ స్నేహితులంతా కలిసి దిగిన బ్రైడ్స్‌మెయిడ్ ఫొటోలను, పోజులను ఈ పెళ్లిలో మళ్లీ రీక్రియేట్ చేయడం విశేషం. ఈ పాత జ్ఞాపకాల కలయిక అభిమానులకు ఒక కనులవిందుగా మారింది. ముఖ్యంగా తోడి పెళ్లికూతురుగా ఆలియా హంగామాను అభిమానులు మ‌ర్చిపోలేక‌పోతున్నారు.




ఈ వైరల్ పోస్ట్‌లో కేవలం స్నేహితులే కాకుండా ఆలియా భట్ భర్త, నటుడు రణ్‌బీర్ కపూర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫొటోల సిరీస్‌లో ఆఖరి స్లైడ్‌లో ఆలియా తన భర్త రణ్‌బీర్‌తో కలిసి క్యూట్‌గా పోజ్ ఇచ్చింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ... ఆలియా తన లైఫ్ పార్ట్నర్‌తో కలిసి ఆఖరి స్లైడ్‌లో అదిరిపోయే పోజ్ ఇచ్చిందని కామెంట్లు పెడుతున్నారు. అటు స్నేహితులు, ఇటు భర్తతో కలిసి ఆలియా గడిపిన ఈ క్షణాలు ఈ ఫొటోల సిరీస్‌కే హైలైట్‌గా నిలిచాయి.




ఆలియా పోస్ట్‌ చేసిన కొన్ని నిమిషాలకే బెస్ట్ ఫ్రెండ్ ఆకాంక్ష రంజన్ కపూర్ సరదాగా స్పందిస్తూ... నాకంటే ముందే మీరెలా పోస్ట్ చేశారు? అంటూ కామెంట్ చేయగా... ఆలియా తల్లి సోనీ రజ్దాన్ కూడా హార్ట్ ఎమోజీలతో `సో బ్యూటిఫుల్` అంటూ తన ప్రేమను చాటుకున్నారు. కొందరు నెటిజన్లు జోకులు వేసినా.. అత్యధిక శాతం మంది ఈ సుదీర్ఘమైన చిన్ననాటి స్నేహ బంధాన్ని, పెళ్లి సంబరాలను ఎంతో హోల్‌సమ్ క్రేజీ మూమెంట్‌గా అభివర్ణిస్తున్నారు. ఆలియా భ‌ట్ వ‌రుస‌గా పాన్ ఇండియా చిత్రాల‌తో దూసుకుపోతుండ‌గా, త‌న స్నేహితురాలు ఆకాంక్ష రాంజ‌న్ క‌పూర్ కూడా గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్ లో వెల‌గాల‌ని క‌ల‌లు కంది. టాలీవుడ్ లోను ఈ అమ్మ‌డు న‌టించింది. కానీ కెరీర్ ప‌రంగా ఆశించిన స్థాయి ద‌క్క‌లేదు. గ‌ర్ట్స్ గ్యాంగ్ లో ఇత‌రులు మోడ‌లింగ్ లో రాణిస్తున్నారు.