చెన్నైలో ఆలియాను ప్రేమించినది ఎవరు?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కు దక్షిణాదితో ఉన్న అనుబంధం రోజురోజుకూ బలపడుతోంది.
By: Sivaji Kontham | 27 March 2026 10:50 AM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కు దక్షిణాదితో ఉన్న అనుబంధం రోజురోజుకూ బలపడుతోంది. గతంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన `ఆర్.ఆర్.ఆర్` చిత్రంలో నటిస్తున్న సమయంలో హైదరాబాద్ నగరంతో ప్రేమలో పడిపోయిన ఈ బ్యూటీ, ఇప్పుడు చెన్నై నగరంపై తన మనసు పారేసుకుంది. హిందీ చిత్రసీమలో అగ్రతారగా వెలుగుతున్నా.. ఆలియాకు తెలుగు, తమిళ భాషల్లో అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఒక ప్రత్యేక కార్యక్రమం కోసం చెన్నై విచ్చేసిన ఆలియా అక్కడి వాతావరణాన్ని, అభిమానులు చూపిన ప్రేమని చూసి పరవశించిపోయింది.
అంతేకాదు చెన్నై పర్యటనలో ఆలియా భట్ తన అందంతో సోషల్ మీడియాను షేక్ చేసింది. ముఖ్యంగా సూర్యాస్తమయానికి ముందు వచ్చే `గోల్డెన్ అవర్` సమయంలో ఆలియా దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 2022 ఏప్రిల్ 14న రణ్‌బీర్ కపూర్‌తో వివాహం జరిగినప్పుడు ఇటువంటి గోల్డెన్ అవర్ ఫోటోలతోనే ఇంటర్నెట్‌ను హోరెత్తించిన ఆలియా.. మరోసారి అదే మ్యాజిక్‌ను చెన్నైలో రిపీట్ చేసింది. తన ఇన్‌స్టాలో ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. ``గోల్డెన్ అవర్.. ఇంతటి ప్రేమని అందించినందుకు థాంక్యూ చెన్నై`` అంటూ తన కృతజ్ఞతను చాటుకుంది.
ఈ ఈవెంట్ కోసం ఆలియా ఎంచుకున్న దుస్తులు అందరినీ ఆకట్టుకున్నాయి. `జాడన్` కలెక్షన్ నుండి ఎంపిక చేసుకున్న పాస్టెల్ గ్రీన్ కలర్ ఆర్గాంజా శారీలో ఆలియా దేవకన్యలా మెరిసిపోయింది. ఈ చీరపై ఉన్న ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ, ముఖ్యంగా పెద్ద పెద్ద పూల డిజైన్లు ఆర్.ఆర్.ఆర్ సీత రూపానికి నిండుతనాన్ని ఇచ్చాయి. చీరను సాంప్రదాయ పద్ధతిలో కట్టుకుని.. పల్లాను భుజంపైకి వేసుకుని ఎంతో హుందాగా కనిపించింది. దీనికి జతగా వి-నెక్లైన్ కలిగిన మ్యాచింగ్ బ్లౌజ్‌ను ధరించి తన ఫ్యాషన్ సెన్స్‌ను చాటుకుంది. మేకప్ విషయంలో ఆలియా ఎప్పుడూ `లెస్ ఈజ్ మోర్` అనే సూత్రాన్ని పాటిస్తుంది. ఈసారి కూడా పింక్ టింటెడ్ చీక్స్, రోజీ లిప్స్, మ్యాట్ ఐషాడోతో చాలా సింపుల్ గా కనిపించింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఆలియా భట్ ప్రస్తుతం అత్యంత బిజీగా ఉన్న నటి. యష్ రాజ్ ఫిలింస్ యాక్షన్ థ్రిల్లర్ `ఆల్ఫా`లో ఆలియా కనిపించనుంది. అలాగే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామా `లవ్ అండ్ వార్` లో కూడా నటిస్తోంది. బాలీవుడ్‌కే పరిమితం కాకుండా అటు హాలీవుడ్ (హార్ట్ ఆఫ్ స్టోన్), ఇటు సౌత్ సినిమాలతో గ్లోబల్ స్టార్‌గా ఎదుగుతున్న ఆలియాకు చెన్నై వంటి నగరాలు ఇచ్చే ఆత్మీయత మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది.
