Begin typing your search above and press return to search.

హీరోయిన్ ద్వంద్వ వైఖ‌రిపై విమ‌ర్శ‌లు!

కేన్స్ వేదికగా భారతీయ చిత్రాల్లో పురుషాధిక్యతపై బాలీవుడ్ న‌టి ఆలియా భట్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   13 May 2026 1:00 PM IST
హీరోయిన్ ద్వంద్వ వైఖ‌రిపై విమ‌ర్శ‌లు!
X

కేన్స్ వేదికగా భారతీయ చిత్రాల్లో పురుషాధిక్యతపై బాలీవుడ్ న‌టి ఆలియా భట్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. పురుషులు కంటే? మ‌హిళ‌లు ఏ కార‌ణంగా త‌క్కువ‌? అనే పాయింట్ ను హైలైట్ చేస్తూ అంత‌ర్జాతీయ వేదిక‌పై మాట్లాడ‌టం పెద్ద దుమారానే రేపుతోంది. అయితే ఆ వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆమెకే ఎదురుదెబ్బగా మారాయి.





అలియాభ‌ట్ వ్యాఖ్య‌ల్లో కపటత్వం క‌నిపిస్తుంద‌ని..స‌ద‌ర్భాన్ని బ‌ట్టి మాట‌లు సునాయాసంగా మార్చ‌గ‌ల మ‌హిళ అంటూ నెటి జ‌నులు విమ‌ర్శిస్తున్నారు. అవ‌స‌రం ఉంటే ఒక‌లా? అవ‌స‌రం లేక‌పోతే మ‌రోలా మాట్లాడ‌టం నీకే చెల్లిందంటూ రుస రుస‌లాడుతున్నారు.





అలియాభ‌ట్ భర్త రణబీర్ కపూర్ `యానిమ‌ల్` లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన సమయంలో యానిమ‌ల్ అత్యంత పురుషాధిక్యతతో కూడినదిగా మహిళలను కించపరిచే విధంగా ఉందని విమర్శలు వ‌చ్చినా? ఆలియా మాత్రం ఆ చిత్రాన్ని , రణబీర్ నటనను ప్రశంసల్లో ముంచెత్తింది. అప్పట్లో అంతటి పురుషాధిక్య చిత్రం గురించి నోరు మెదపని ఆలియా ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై పురుష కేంద్రిత సినిమాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్లు మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు.





ర‌ణ‌వీర్ సింగ్ నటించిన `ధురంధర్` వంటి సినిమాల విషయంలో కూడా అలియాభ‌ట్ మౌనంగా ఉండటాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. పురుషుల కోసం మాత్రమే సినిమాలు తీస్తున్నారని ప్రశ్నిస్తున్న ఆలియా? తానూ అలాంటి చిత్రాల్లో భాగం కాలేదా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తనకు ప్రయోజనం ఉన్నప్పుడు ఒకలా? వేదిక దొరికినప్పుడు మరోలా? మాట్లాడటం సెలబ్రిటీలకు పరిపాటిగా మారిందని విమర్శకులు అభిప్రా యపడుతున్నారు. అలియాభ‌ట్ సొంత నిర్మాణ సంస్థలో చేసే సినిమాల విష‌యంలో ఎలాంటి మార్పుల కోసం ప్రయత్నిస్తున్నారనే చర్చ మొదలైంది.





అలాగే ఆలియా భట్ తన వ్యాఖ్యల ద్వారా భారతీయ సినిమాను తక్కువ చేసి చూపిస్తోందని మ‌రికొంద‌రు వాదిస్తున్నారు. `హాలీవుడ్ సినిమాలు గొప్పవి. మన సినిమాలు కేవలం పురుషుల కోసమే అనే ధోరణిలో ఆమె మాట్లాడటం సరికాదని చెబుతున్నారు. భారతీయ సినిమాలో ఇప్పటికే మహిళా ప్రాధాన్యత పెరుగుతోందని `గంగూబాయి కతియావాడి` వంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించిన విషయాన్ని ఆమె మర్చిపోయినట్లున్నారని గుర్తు చేస్తున్నారు. మార్పును కోరుకునే వారు ముందుగా తాము చేసే పనుల్లో చూపించాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.





అయితే అలియా మద్దతుదారులు మాత్రం ఆమె మాటల్లోని అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. ఆమె కేవలం నటిగా కాకుండా నిర్మాతగా పరిశ్రమలో ఉన్న లోటుపాట్లను ఎత్తిచూపారని సమర్థిస్తున్నారు. భర్త సినిమాను పొగిడినంత మాత్రాన పరిశ్రమలోని వ్యవస్థాగత సమస్యల గురించి మాట్లాడే హక్కు ఆమెకు లేదనడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. అయినా సోషల్ మీడియాలో జరుగుతోన్న చర్చలో మాత్రం ఆమె వ్యతిరేక వర్గమే పైచేయి సాధిస్తోంది.