కేన్స్‌లో అలియా భట్.. దేవ కన్యలా మెరిసిపోయిన బాలీవుడ్ క్వీన్!
కేవలం డ్రెస్ మాత్రమే కాదు, ఆమె వేసుకున్న యాక్సెసరీస్ కూడా హైలెట్‌గా నిలిచాయి. మెడకు ధరించిన లేస్ చోకర్ ఆమె లుక్‌ను మరింత ఎలివేట్ చేసింది.
By: Madhu Reddy | 14 May 2026 9:47 AM ISTకేన్స్ రెడ్ కార్పెట్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఓ క్రేజ్. అలాంటి వేదికపై మన అలియా భట్ అడుగుపెడితే ఆ కళే వేరు. 2026 కేన్స్ ఫెస్టివల్‌లో అలియా ఎంచుకున్న డ్రెస్ అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. 'ఏ ఉమెన్స్ లైఫ్' ప్రీమియర్ కోసం ఆమె ధరించిన 'ఐస్ బ్లూ' గౌన్ చూస్తుంటే, నిజంగానే ఏదైనా ఫెయిరీ టేల్ కథలో నుంచి ఒక యువరాణి నేరుగా దిగి వచ్చిందా అన్నట్లుగా ఉంది. డానియల్ ఫ్రాంకెల్ డిజైన్ చేసిన ఈ గౌన్‌లో అలియా అందం రెట్టింపైంది. ఆ విశేషాలు చూద్దాం..
ఆ డ్రెస్సులో అలియా మేజిక్:
అలియా ధరించిన ఈ ఐస్ బ్లూ గౌన్ చాలా ప్రత్యేకంగా ఉంది. దీని బాడీ పార్ట్ చాలా ఫిటెడ్‌గా ఉండి, కింద వైపు లేయర్ల వారీగా ఉన్న టల్లే స్కర్ట్ అలియాకు ఒక రాయల్ లుక్‌ను ఇచ్చింది. ఇక సింపుల్‌గా చెప్పాలంటే, ఆధునిక కాలంలో దేవా లోకం నుండి వచ్చిన యువరాణిలా, ఆమె ఆ రెడ్ కార్పెట్‌పై నడుస్తుంటే కెమెరా కళ్లన్నీ ఆమెవైపే తిరిగాయి.
సరికొత్త స్టైలింగ్:
కేవలం డ్రెస్ మాత్రమే కాదు, ఆమె వేసుకున్న యాక్సెసరీస్ కూడా హైలెట్‌గా నిలిచాయి. మెడకు ధరించిన లేస్ చోకర్ ఆమె లుక్‌ను మరింత ఎలివేట్ చేసింది. మేకప్ విషయానికి వస్తే.. చాలా సహజంగా, గ్లోయింగ్‌గా ఉండేలా ప్లాన్ చేశారు. ఇక జుట్టును స్టైలిష్‌గా పైకి ముడివేసి, కొన్ని వెంట్రుకలను ముఖం మీదకు వదిలేయడం ఆమెకు ఒక సాఫ్ట్ అండ్ క్లాసీ లుక్‌ను ఇచ్చింది.
సినిమాల విషయానికి వస్తే:
అలియా కేవలం ఫ్యాషన్‌లోనే కాదు, సినిమాల్లోనూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'లవ్ అండ్ వార్' సినిమాలో నటిస్తోంది. ఇందులో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇది 2027 జనవరిలో విడుదల కానుంది. దీనితో పాటు 'ఆల్ఫా' అనే స్పై థ్రిల్లర్‌లో కూడా అలియా కనిపించబోతోంది.
మొత్తానికి అలియా భట్ తన స్టైల్‌తో మరోసారి ఇండియా గర్వపడేలా చేసింది. ఇక కేన్స్‌లో ఆమె వేసుకున్న ఈ ఐస్ బ్లూ గౌన్ సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్. అందం, అభినయం రెండూ కలిస్తే అలియా అని ఆమె మరోసారి నిరూపించుకుంది.
