బాఫ్టాలో బ్యాక్ లెస్ ఫోజులతో రెచ్చిపోయిన ఆలియా
బాఫ్టా (BAFTA) 2026 అవార్డుల వేడుకలో ఆలియా భట్ తన గ్లామర్, హుందాతనంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
By: Sivaji Kontham | 24 Feb 2026 12:00 AM ISTబాఫ్టా (BAFTA) 2026 అవార్డుల వేడుకలో ఆలియా భట్ తన గ్లామర్, హుందాతనంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆలియా ఈ వేడుక కోసం ప్రత్యేకంగా రూపొందించిన సిల్వర్ సీక్విన్డ్ గౌనులో ప్రత్యక్షమైన తీరు చూడగానే.. ఈమె ఒక బిడ్డకు మమ్మీనా? అంటూ వీక్షకులు నోరెళ్లబెట్టారు. ఈ డ్రెస్ హై నెక్ లైన్ , ఫిట్టెడ్ సిల్హౌట్‌తో చాలా రాయల్‌గా కనిపించింది. దీనికి తోడుగా తెల్లటి ఫర్ స్టోల్ ధరించి వింటేజ్ డ్రామాలో క్వీన్ అని నిరూపించింది.
ముఖ్యంగా ఈ సిల్వర్ మిరుమిట్ల గౌనులో బ్యాక్ లెస్ ఫోజులు సోషల్ మీడియాను ఒక రేంజులో ఊపేస్తున్నాయి. ఈ స్పెషల్ ఫ్రాక్‌లో ఆలియా ఫ్యాషన్ సెన్స్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తన ఇన్‌స్టా పోస్ట్‌లో కారులో కూర్చున్న ఫోటోలతో పాటు హెయిర్ ని గాలిలోకి ఫ్లిప్ చేస్తూ ఇచ్చిన ఫోజుల వరకు ఒక విజువల్ డైరీలా ఆలియా ప్రతిదీ షేర్ చేసింది. చివర్లో ఒక పేస్ట్రీ ఫోటోను కూడా జత చేసి తనలోని సరదా కోణాన్ని చూపించింది.
ప్రపంచ వేదికపై నమస్కారం:
అవార్డు ప్రెజెంటర్‌గా స్టేజ్‌పైకి వచ్చిన ఆలియా `అందరికీ నమస్కారం` అని పలకరించి భారతీయుల మనసు గెలుచుకుంది. ఆంగ్లేయేతర కేటగిరీలో అవార్డును అందజేస్తూ.. సినిమాకు సరిహద్దులు లేవని.. భాషా భేదం లేదని తన ప్రసంగంతో ఆకట్టుకుంది. మొత్తానికి బాఫ్టాలో ఆలియా భట్ తన స్టైల్‌తో దుమ్ము దులిపేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు!
ఆలియా చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్టులు:
ఆలియా భట్ ప్రస్తుతం కెరీర్ పరంగా టాప్ గేర్‌లో ఉంది. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో శర్వరీ వాఘ్‌తో కలిసి `ఆల్ఫా` అనే ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్ చేస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తన భర్త రణబీర్ కపూర్, విక్కీ కౌశల్‌తో కలిసి `లవ్ అండ్ వార్`లో ఆలియా నటిస్తోంది. ఈ రెండు సినిమాల రాకతో ఆలియా గ్రాఫ్ మళ్లీ ఒక రేంజులో స్కైని టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
