Begin typing your search above and press return to search.

అందుకే పుట్టానేమో అనిపిస్తుంది

గుచ్చీ తొలి భారతీయ గ్లోబల్ అంబాసిడర్‌గా క్రియేటివ్ ప్రాసెస్ లో భాగమవడం తనకు గర్వకారణమని అలియా ఈ సంద‌ర్భంగా వెల్లడించారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   23 Feb 2026 11:49 AM IST
అందుకే పుట్టానేమో అనిపిస్తుంది
X

అలియా భ‌ట్ మొద‌టి సారి బ్రిటీష్ అకాడ‌మీ ఫిల్మ్ అవార్డ్స్ స్టేజ్ పై అడుగుపెట్టి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలిచారు. ఫిబ్రవరి 22న లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్‌లో జరిగిన ఈ అంతర్జాతీయ వేడుకలో ఆమె బెస్ట్ ఫిల్మ్ నాట్ ఇన్ ది ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగానికి ప్రెజెంటర్‌గా వ్యవహరించారు. ముంబై నుంచి నేరుగా లండన్‌కు చేరుకున్న అలియా, 30ల్లో జెట్ ల్యాగ్ మరింతగా ప్రభావం చూపుతుంద‌ని స‌ర‌దాగా చెప్పిన‌ప్ప‌టికీ, రెడ్ కార్పెట్‌పై మాత్రం అలసటకు ఎలాంటి ఆనవాళ్ల‌ను కనిపించనీయ‌లేదు.

ప్రెజెంట‌ర్ గ్లామ‌ర్ అతి కాకూడ‌దు

కస్టమ్ గుచ్చి గౌన్‌లో అలియా ఓల్డ్ హాలీవుడ్ గ్లామర్‌ను గుర్తు చేశారు. హాలీవుడ్ లెజెండ్ మార్లిన్ మ‌న్రో ధ‌రించిన సిల్వర్ గౌన్ నుంచి ఇన్‌స్పైర్ అయిన‌ ఈ లుక్‌కు స్పెష‌ల్ గా షీర్‌లింగ్ ర్యాప్ జతచేసిన‌ట్టు తెలిపారు. ట్యూల్ ఫ్యాబ్రిక్‌పై సిల్వర్ సీక్విన్స్, మైక్రోబీడ్స్‌తో రూపొందించిన హాల్టర్ నెక్ డ్రెస్ అలియాకు సినిమాటిక్ గ్లోని అందించ‌గా, ప్రెజెంటర్‌గా గ్లామర‌స్ ఉండాలి, కానీ అతి కాకూడదు. లుక్ ఎలిగెంట్‌గా, లైట్‌గా ఉండాలని అనుకున్నట్టు ఆమె పేర్కొన్నారు.

ద‌శాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా అలియా భ‌ట్

గుచ్చీ తొలి భారతీయ గ్లోబల్ అంబాసిడర్‌గా క్రియేటివ్ ప్రాసెస్ లో భాగమవడం తనకు గర్వకారణమని అలియా ఈ సంద‌ర్భంగా వెల్లడించారు. గతేడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ క్లోజింగ్ ఈవెంట్ లో గుచ్చీ హిస్ట‌రీలో తొలి బెస్పోక్ లెహెంగా ధరించడం కూడా ఆమె స్టైల్ స్టేట్‌మెంట్‌గా నిలిచింది. 2012లో రిలీజైన స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ మూవీతో బాలీవుడ్‌లో కెరీర్ ను స్టార్ట్ చేసిన అలియా, దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు.

సినిమా అనుభ‌వానికి భాష అడ్డు కాదు

ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచే సినిమాల్లోకి రావాలనేది త‌న క‌ల అని, సినిమాల్లో న‌టించడానికే పుట్టానేమో అనిపిస్తుంద‌ని, కెమెరా ముందు నిలబడిన ప్రతిసారీ త‌న‌కు కొత్త ఉత్సాహం వస్తుందని, ఈ ఇండ‌స్ట్రీలో భాగ‌మ‌వ‌డం ఒక వ‌రమ‌ని చెప్పారు. సినిమా అనుభవానికి భాష అడ్డంకి కాద‌ని చెప్పిన అలియా, ఎమోష‌న్సే క‌థ‌ను ముందుకు న‌డిపిస్తాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఎన్నో విష‌యాల్లో స్పూర్తిగా రాహా

ఈ సంద‌ర్భంగా ప‌ర్స‌న‌ల్ లైఫ్ పై కూడా అలియా స్పందించి మాట్లాడారు. తన కుమార్తె రాహా తనకు స్ఫూర్తినిస్తోందని, తన సాంగ్స్ కు రాహా డ్యాన్స్ చేస్తుంటే ఎంతో ఆనందం కలుగుతుందని అలియా చెప్పారు. ప్రతి పెద్ద ఈవెంట్ తర్వాత తన టీమ్‌తో కలిసి డిన్నర్‌కు వెళ్లడం తన సంప్రదాయమని, అందరితో కూర్చొని నవ్వుతూ మంచి భోజనం చేస్తేనే తాను బెస్ట్‌గా కనిపిస్తాన‌ని అలియా వ్యాఖ్యానించారు. ఈ కార్య‌క్ర‌మంలో మ‌ణిపురి మూవీ బూంగ్ బెస్ట్ చిల్డ్ర‌న్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్ కేట‌గిరీలో అవార్డును సొంతం చేసుకోగా, ఆ సినిమా డైరెక్ట‌ర్ ల‌క్ష్మీ ప్రియదేవి కూడా ఈ ఈవెంట్ కు హాజ‌ర‌య్యారు. మొత్తంగా బాఫ్టా స్టేజ్ పై అలియా త‌న ఫ్యాష‌న్, భావేద్వోగం, భారతీయ సినీ ప్ర‌తిష్ట.. ఈ మూడింటి స‌మ్మేళ‌నంగా నిలిచారు.