నంబర్ వన్ హీరోయిన్ రేసులో ఆలియాకు ఫైనల్ టెస్ట్!
కోవిడ్ తర్వాత థియేటర్లు రీఓపెన్ అయ్యాక వచ్చిన గంగూభాయ్ కతియావాడి ఆలియాకు నటిగా విశేష ప్రశంసలు తెచ్చిపెట్టింది. తర్వాత వచ్చిన బ్రహ్మాస్త్ర కమర్షియల్ సక్సెస్ ను అందుకుంది.
By: Sravani Lakshmi Srungarapu | 17 Jun 2026 12:14 PM ISTకోవిడ్ తర్వాత బాలీవుడ్‌లో తన స్టార్‌డమ్‌ను నిలబెట్టుకున్న నటీమణుల్లో ఆలియా భట్ ముందు వరుసలో నిలిచారు. అయితే సక్సెస్‌ల మధ్య కొన్ని ఎదురుదెబ్బలు కూడా ఆమె కెరీర్‌ను వెంటాడాయి. ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆల్ఫా సినిమా కేవలం మరో రిలీజ్ లాగా మాత్రమే కాకుండా, ఆలియా భట్ మార్కెట్ స్థాయి, స్టార్ పవర్, అలాగే బాలీవుడ్‌లో ఆమె స్థానాన్ని మరోసారి నిరూపించుకోవాల్సిన కీలక ప్రాజెక్ట్‌గా మారింది.
కోవిడ్ తర్వాత థియేటర్లు రీఓపెన్ అయ్యాక వచ్చిన గంగూభాయ్ కతియావాడి ఆలియాకు నటిగా విశేష ప్రశంసలు తెచ్చిపెట్టింది. తర్వాత వచ్చిన బ్రహ్మాస్త్ర కమర్షియల్ సక్సెస్ ను అందుకుంది. రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ జిగ్రా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడం ఆమె ట్రాక్ రికార్డుపై కొంతవరకు ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో ఆల్ఫాపై అంచనాలు సహజంగానే పెరిగాయి.
ప్రస్తుతం బాలీవుడ్‌లో కొత్త తరం హీరోయిన్ల మధ్య పోటీ తీవ్రంగా మారుతోంది. కమర్షియల్ సక్సెస్, పాన్ ఇండియా గుర్తింపు, సోషల్ మీడియా ప్రభావం, భారీ ప్రాజెక్టుల్లో ఛాన్సులు వంటి అంశాలు స్టార్ ర్యాంకింగ్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆల్ఫా సక్సెస్ ఆలియాను మరోసారి నంబర్1 రేసులో మరింత బలంగా నిలబెట్టే అవకాశం కల్పించవచ్చు. అదే సమయంలో సినిమా నిరాశపరిస్తే ఆమె మార్కెట్‌పై మరింత ఎఫెక్ట్ పడే ఛాన్సుంది.
ఇక ఆల్ఫా సినిమా విషయానికొస్తే, ఈ సినిమాపై చర్చలతో పాటు అనుమానాలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా YRF స్పై యూనివర్స్ సినిమాలు రీసెంట్ గా కథల విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆల్ఫా కూడా అదే ఫార్ములాను అనుసరిస్తుందా అనే సందేహాలు ప్రేక్షకుల్లో కనిపిస్తున్నాయి. టీజర్ రిలీజ్ తర్వాత మంచి బజ్ వచ్చినప్పటికీ, సోషల్ మీడియాలో మిక్డ్స్ రెస్పాన్స్ వ్యక్తమైంది. కొందరు దీనిని లేడీ ఓరియెంటెడ్ స్పై థ్రిల్లర్‌గా స్వాగతిస్తుంటే, మరికొందరు కొత్తదనం ఎంతవరకు ఉంటుందనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే ట్రేడ్ వర్గాలు మాత్రం ఓ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. బలమైన కథ, ఆకట్టుకునే యాక్షన్ ఎపిసోడ్లు, ఎమోషన్స్ కు చోటు కల్పించే స్క్రీన్‌ప్లే ఉంటే ప్రస్తుతం ఉన్న సందేహాలన్నీ రిలీజ్ తర్వాత క్షణాల్లో మాయమవుతాయని అంటున్నారు. ముఖ్యంగా స్పై థ్రిల్లర్ జానర్‌కు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుంటే ఆల్ఫాకు భారీ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆల్ఫా సినిమా ఆలియా స్టార్‌డమ్ కు నిజమైన పరీక్షగా మారింది. మొత్తంగా చూసుకుంటే ఆల్ఫా సక్సెస్ కేవలం ఓ సినిమా రిజల్ట్ మాత్రమే కాదు, అది ఆలియా బాలీవుడ్ లో అగ్రస్థానాన్ని మరింత బలపరుస్తుందా లేదా కొత్త తరం హీరోయిన్ల నుంచి వస్తున్న సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితి తీసుకొస్తుందా అన్నది కూడా డిసైడ్ చేయనుంది. మరి ఆల్ఫా ఆలియాకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
