Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో ఆలియాపై వ్యతిరేకత.. ఏమైందంటే?

ఈ క్రమంలోనే ఆలియా భట్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆమెపై వ్యతిరేకతను కలిగిస్తున్నాయి.

By:  Madhu Reddy   |   25 Sept 2025 12:00 AM IST
సోషల్ మీడియాలో ఆలియాపై వ్యతిరేకత.. ఏమైందంటే?
X

సినీ సెలబ్రిటీలు అప్పుడప్పుడు బహిరంగంగా చేసే ప్రకటనలు అభిమానులలో కూడా తీవ్ర వ్యతిరేకతను కలిగిస్తున్నాయి అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఆలియా భట్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆమెపై వ్యతిరేకతను కలిగిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. మిలన్ లో జరిగిన గూచీ స్ప్రింగ్/సమ్మర్ 2026 ఫ్యాషన్ షో సందర్భంగా ఆల్ఫా మూవీని తన మొదటి యాక్షన్ మూవీగా అభివర్ణించిన నేపథ్యంలో ఇప్పుడు నెట్టింట ఈమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.

గూచీ గ్లోబల్ అంబాసిడర్ గా ఈ కార్యక్రమానికి హాజరైన ఆలియా భట్.. తన చిత్రం 'ఆల్ఫా' ప్రాజెక్టు పట్ల తనకున్న ఉత్సాహం అలాగే భయం గురించి మాట్లాడింది. దీంతో ఈమె చేసిన కామెంట్లు వైరల్ అవ్వడంతో ప్రేక్షకులు ఈమె మునుపటి చిత్రాలలో యాక్షన్ పాత్రలను గుర్తు చేసుకుంటున్నారు. రాజీ, జిగ్రా సినిమాలలోని ఈమె పాత్రలను హైలెట్ చేస్తూ ఈమెపై విమర్శలు గుర్తిస్తున్నారు. అంతేకాదు ఈమె హాలీవుడ్ అరంగేట్రం మూవీ 'హార్ట్ ఆఫ్ స్టోన్' మూవీలో కూడా ఈమె తీవ్రమైన యాక్షన్ పాత్రలను పోషించి అందరిని ఆకట్టుకుంది.. అయితే ఈ చిత్రాలన్నీ కాదని 'ఆల్ఫా' సినిమానే తనకు మొదటి యాక్షన్ చిత్రంగా భావించడం ఏమాత్రం సరికాదని అటు నెటిజన్స్ కూడా మండిపడుతున్నారు.

ముఖ్యంగా ఆల్ఫా సినిమాను ప్రమోట్ చేయడానికి ఆలియా గతంలో తాను చేసిన పనిని మరిచిపోయిందని కూడా ట్రోలర్స్ మండిపడుతున్నారు. నిజానికి జిగ్రా, రాజీ లాంటి చిత్రాలలో అలియా భట్ బలమైన యాక్షన్ సన్నివేశాలలో నటించింది. అయితే వాటన్నింటినీ మరిచిపోయి ఈ ఆల్ఫా సినిమాను ప్రమోట్ చేయడానికి ఇలా ఆ చిత్రాలను పక్కన పెట్టడంతో నెటిజన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు..

అయితే అలియా భట్ అభిమానులు మాత్రం ఈమె మాటలను ఏకీభవిస్తున్నారు. జిగ్రాలో యాక్షన్ పాత్రలు పరిమితంగా ఉన్నాయి.. రాజీ పోరాటం కంటే నాటకం మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. కాబట్టి ఆల్ఫా సినిమా పూర్తిగా యాక్షన్ కి అంకితమైన చిత్రం కాబట్టి అందుకే ఆల్ఫా తన మొదటి యాక్షన్ మూవీ అని ఆలియా భట్ పేర్కొన్నారు అంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికైతే అలియా భట్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఈమెపై నెట్టింట నెగెటివిటీని క్రియేట్ చేస్తున్నాయని చెప్పాలి.

ఆల్ఫా సినిమా విషయానికి వస్తే.. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రాబోతున్న చిత్రం ఇది. ఇటీవల వార్ 2 చిత్రం ఘోరంగా విఫలమైన తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ చేస్తున్న సినిమా కావడంతో ఇప్పుడు ఈ సినిమా.. ఈ నిర్మాణ సంస్థకు అత్యంత కీలకంగా మారిపోయింది. ఈ చిత్రానికి శివ్ రావైల్ దర్శకత్వం వహించగా.. ఇందులో ఆలియా భట్, శార్వరి , బాబి డియోల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కాబోతోంది.