Begin typing your search above and press return to search.

అందుకే డెలివరీ తర్వాత బరువు తగ్గా.. నిజం బయటపెట్టిన ఆలియా!

తన అద్భుతమైన నటనతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె కెరియర్ పీక్స్ లో ఉండగానే ప్రముఖ హీరో రణబీర్ కపూర్ తో ఏడడుగులు వేసింది.

By:  Madhu Reddy   |   5 Oct 2025 2:00 AM IST
అందుకే డెలివరీ తర్వాత బరువు తగ్గా.. నిజం బయటపెట్టిన ఆలియా!
X

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది అలియా భట్. తన అద్భుతమైన నటనతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె కెరియర్ పీక్స్ లో ఉండగానే ప్రముఖ హీరో రణబీర్ కపూర్ తో ఏడడుగులు వేసింది. అదే ఏడాది పండంటి అమ్మాయికి కూడా జన్మనిచ్చింది. కూతురుకి రాహా అని నామకరణం చేసింది ఈ జంట. ఇకపోతే రాహా జన్మించిన తర్వాత తమ జీవితంలోనే కాదు లైఫ్ స్టైల్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి అని.. అలవాటు లేని పనులు కూడా చేయాల్సి వస్తోంది అంటూ సరదాగా చెప్పుకొచ్చింది ఆలియా భట్.

అంతేకాదు తాను డెలివరీ తర్వాత వేగంగా బరువు తగ్గడానికి గల కారణాన్ని కూడా ఆమె బయటపెట్టింది. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ బాలీవుడ్ నటీమణులు కాజోల్, ట్వింకిల్ కన్నా అమెజాన్ ప్రైమ్ వీడియోలో "టూ మచ్" అనే ఒక టాక్ షో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సహనటుడు వరుణ్ ధావన్ తో కలిసి ఆలియా భట్ ముఖ్య అతిథిగా హాజరయ్యింది. ఈ టాక్ షోలో తన నిద్రతీరు గురించి కూడా ఆమె మాట్లాడుతూ.. "నేను ఎప్పుడూ కూడా త్వరగా పడుకొని త్వరగా లేచే వ్యక్తిని. కానీ రాహా పుట్టిన తర్వాత నా నిద్ర టైమింగ్లో చాలా మార్పులు వచ్చాయి. నేను మేల్కొనకూడదు అనుకున్నాను. సాధారణంగా నేను తొమ్మిదిన్నర గంటలకే నిద్రపోతాను. అయితే ఇప్పుడు నిద్రపోయిన గంటలను లెక్కిస్తున్నాను. కానీ ఇదంతా నా కూతురు కోసమే అని తెలిసి మరింత సంతోషంగా ఉంది"అంటూ చెప్పుకొచ్చింది.

అలాగే రాహాకు జన్మనిచ్చిన తర్వాత నేను వేగంగా బరువు తగ్గిపోయాను.దీంతో చాలామంది నాపై విమర్శలు గుప్పించారు.. అసలు నిజం ఏమిటంటే.. రాహాకు జన్మనిచ్చిన తర్వాత నేను వేగంగా బరువు తగ్గాను. తల్లిపాలు ఇవ్వడం వల్ల చాలా క్యాలరీలు ఖర్చు అవుతాయి. ముఖ్యంగా నేను ఎంత తిన్నా సరే సహజంగానే బరువు తగ్గాను. అయితే నా ఫోటో బయటకు వచ్చినప్పుడు నేను అసహజ పద్ధతులలో బరువు తగ్గాను అంటూ నాపై చాలామంది ట్రోల్స్ చేశారు.. ఎందుకు అంత త్వరగా బరువు తగ్గాల్సి వచ్చింది అంటూ కూడా కామెంట్లు చేశారు. అయితే మేము ఆ ట్రోల్స్ ని పెద్దగా పట్టించుకోలేదు. సాధారణంగా చాలామందిలో ఇలాంటి మార్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ నేను సహజ పద్ధతిలోనే బరువు తగ్గాను"అంటూ అలియా భట్ చెప్పుకొచ్చింది.

ఇకపోతే ఆలియా భట్ లో వచ్చిన ఈ మార్పులను అటు కాజోల్ ఇటు ట్వింకిల్ కన్నా ప్రోత్సహించారు. ప్రస్తుతం మహిళలు తమ శరీరాలను ఏ పరిమాణంలోనైనా సరే ఆలింగనం చేసుకోవాలని.. అదే దిశగా తమను తాము ప్రోత్సహించుకోవాలని తెలిపారు. అటు ప్రజలు కూడా నువ్వు అలా చేయి.. నువ్వు ఏ పరిమాణంలో ఉండాలనుకుంటున్నావో అలాగే ఉండు.. అని నాతో కూడా చెప్పారు. ప్రస్తుత కాలంలో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లిలో వచ్చే మార్పులను నిజంగా ఎవరూ పట్టించుకోరు. అది రిఫ్రెషింగ్ గా ఉంది అంటూ కూడా ఆలియా తెలిపింది. మొత్తానికైతే బరువు తగ్గడంపై వచ్చిన ట్రోల్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చింది ఆలియా.