ఆ బ్యూటీ ఇండస్ట్రీ జర్నీ అలా!
అలయా.ఎఫ్ బాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. పదేళ్ల క్రితం కెరీర్ ప్రారంభమైనా అమ్మడు నిలదొక్కుకోవడానికి ఐదేళ్లు సమయం పట్టింది.
By: Srikanth Kontham | 25 Oct 2025 9:00 PM ISTఅలయా.ఎఫ్ బాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. పదేళ్ల క్రితం కెరీర్ ప్రారంభమైనా అమ్మడు నిలదొక్కుకోవడానికి ఐదేళ్లు సమయం పట్టింది. ఐదేళ్లగా నటిగా బిజీ అయింది. `జవానీ జనేమాన్`, `ప్రెడీ`, `అల్మోస్ట్ ప్యార్ విత్ ద మెహబాత్` చిత్రాల్లో నటించింది. అటు పై `బడేమియాన్ చోటే మియాన్`, `శ్రీకాంత్` లాంటి చిత్రాలతో మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం అమ్మడికి అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఎలాంటి ఛాన్సులొచ్చినా నో చెప్పకుండా కమిట్ అవుతుంది. మరి ఈ బ్యూటీ సినిమాల్లోకి రావడానికి అసలు కారణం ఏంటి? అంటే ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది.
తొలుత అలయాకి సినిమాలంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదంది. ఆ సమయంలో అమ్మడు `క్రిష్` చిత్రం థియేటర్లో చూసానంది. ఆ సినిమా బాలీవుడ్ పై ఆశలు కలిగించినట్లు పేర్కొంది. ఆ చిత్రాన్ని తన బాల్యాన్ని గుర్తించే చిత్రంగా భావిస్తానంది. తనకు ఇష్టమైన నటులు ఆ సినిమాలో నటించడమే తనకు ప్రేరణ కలిగించిందంది. ` క్రిష్` రిలీజ్ అనంతరం హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రాలకు అభిమానులుగా మారినట్లు తెలిపింది. అప్పుడే అలయా పరిశ్రమను ఇష్టపడటం మొదలు పెట్టినట్లు తెలిపింది.
`క్రిష్` సినిమా కంటే ముందు తన స్నేహితులు చాలా మంది బాలీవుడ్ కి ఫిదా అయ్యేవారు కానీ తాను మాత్రం సినిమాల పట్ల పెద్దగా ఆసక్తిగా ఉండేదాన్ని కాదంది. `క్రిష్` తనలో సినిమాల్లోకి రావాలనే ఆశ పుట్టించడంతో మ్యాకప్ వేసుకున్నట్తు తెలిపింది. అలయా .ఎఫ్ ఇండస్ట్రీ బిడ్డ అన్న సంగతి తెలిసిందే. నటి పూజాబేడి కుమార్తె. పూజాబేడి బాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ కాదు గానీ కొన్ని టీవీ షోలను హోస్ట్ చేసి ఫేమస్ అయ్యారు.
ఇలా కుటుంబంలో నటనా రంగం నుంచి ఉంటే పిల్లలు కూడా అదే వృత్తిని ఎంచుకోవడం సహజం . కానీ అలయా మాత్రం అనుకోకుండా సినిమాల్లోకి వచ్చింది. తల్లి ప్రభావం తనపై ఎంత మాత్రం లేదని అలయా మాటల్ని బట్టి తెలుస్తోంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని నటిగానే బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తాను అభిమానించిన హృతిక్ రోషన్ తోనే కలిసి ఓ ప్రాజెక్ట్ కి పని చేస్తోంది. హృతిక్ నటిస్తోన్న ఓ వెబ్ సిరీస్ లో జోడీగా నటిస్తోంది.
