`ఫేమ్` కోసం ఇలాంటి పోజులు అవసరమా? ఆలయపై ట్రోలింగ్
బాలీవుడ్ యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ ఆలయ ఎఫ్ సోషల్ మీడియా పోస్ట్ ఇంటర్నెట్‌లో విపరీతమైన చర్చకు దారితీసింది.
By: Sivaji Kontham | 28 Jun 2026 11:00 PM ISTబాలీవుడ్ యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ ఆలయ ఎఫ్ సోషల్ మీడియా పోస్ట్ ఇంటర్నెట్‌లో విపరీతమైన చర్చకు దారితీసింది. `హ్యాపీ సండే` అంటూ డెనిమ్ అవుట్‌ఫిట్ లో ఉన్న గ్లామరస్ ఫొటోలను షేర్ చేయగానే కొద్దిసేపట్లోనే వైరల్‌గా మారాయి. అయితే ఈ ఫొటోల్లో యంగ్ బ్యూటీ కూర్చున్న భంగిమ (పోజ్), ముఖ్యంగా మూడవ, 11వ ఫొటోపై కొందరు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నెగెటివ్ కామెంట్లతో ట్రోలింగ్ ప్రారంభించారు.
ఈ ఫొటోషూట్‌లో ఆలయ ఎఫ్ బో*ల్డ్ లుక్‌లో టీజ్ చేస్తోందని కొందరు నెటిజన్లు పరిధులు దాటి కామెంట్లు పెట్టారు. `ఫేమ్ కోసం ఇలాంటి పోజులు అవసరమా?`, `ఇలాంటి సిట్టింగ్ పోజ్ అస్సలు బాగాలేదు.. చాలా అసభ్యకరంగా ఉంది`` అంటూ తీవ్రంగా విమర్శించారు. మరికొందరైతే ఈ ఫొటోలను ఉద్దేశించి ``ఇదొక టిపికల్ ఫెమినిస్ట్ ధోరణి.. కెరీర్‌లో ఆఫర్లు లేనప్పుడు ఇలాంటి ఫొటోషూట్లతో ఇంటర్నెట్‌ను బ్రేక్ చేయాలని చూస్తున్నారు`` అంటూ ఆరోపణలు గుప్పించారు.
అయితే ఈ ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై అలయ అభిమానులు, సాధారణ నెటిజనం గట్టిగానే స్పందించారు. నెగెటివ్ కామెంట్లు చేసే వారి ఆలోచనా విధానాన్ని తప్పుబడుతూ.. ఈ ఫొటోల్లో ఎలాంటి అసభ్యత లేదని, ఇదొక స్టైలిష్ - క్లాసీ ఫొటోషూట్ మాత్రమేనని మద్దతుగా నిలిచారు. అలయ చాలా స్టన్నింగ్‌గా, గ్లామరస్‌గా ఉంది అని ప్రశంసిస్తూ.. ట్రోలర్స్ చేసే చెత్త కామెంట్లను లైట్ తీసుకోవాలని తమ ఆరాధ్యదేవతకు సూచిస్తున్నారు. ఏదేమైనా ఈ గ్లామరస్ ఫొటోషూట్ చుట్టూ జరుగుతున్న సోషల్ మీడియా డిబేట్ ప్రస్తుతం బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
2024లో విడుదలైన బయోపిక్ డ్రామా `శ్రీకాంత్` చిత్రంలో రాజ్ కుమార్ రావు సరసన వీర స్వాతి పాత్రలో నటించి అలయ ఎఫ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతకుముందు `జవానీ జానెమన్` (2020), `ఫ్రెడ్డీ` (2022), `యూ-టర్న్` (2023), `బడే మియాన్ చోటే మియాన్` (2024) వంటి వైవిధ్యమైన చిత్రాలతో బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రతి సినిమాకు నటిగా తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతోంది.
ఇక 2026 కొత్త సినిమా ఆఫర్ల విషయానికి వస్తే.. అలయ ఎఫ్ కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఓ వెబ్ సిరీస్ `స్టార్మ్`లో ప్రధాన పాత్ర పోషించింది. దీనితో పాటు ప్రముఖ నిర్మాత ప్రేరణ అరోరా నిర్మించనున్న ఒక హై-వోల్టేజ్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోందని కథనాలొచ్చాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అలయ ఎఫ్‌తో పాటు టాలీవుడ్ పాపులర్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం.
