నేపో కిడ్స్‌లోనే అత్యుత్తమ ఫిట్నెస్ ఫ్రీక్ ఈ బ్యూటీ
ప్రఖ్యాత అంతర్జాతీయ బ్రాండ్లకు ప్రమోషన్స్ చేస్తూ నిరంతరం టీవీ ప్రకటనల్లో ప్రత్యక్షమవుతుంది. ఇటీవల ఆలయ నటిగాను కెరీర్ పరంగా బిజీగా ఉంది.
By: Sivaji Kontham | 9 Feb 2026 1:00 AM ISTఆలయ ఫర్నిచర్‌వాలా పరిచయం అవసరం లేదు. అంతర్జాతీయ నటుడు కబీర్ భేడీ మనవరాలు. ప్రముఖ టీవీ మూవీ నటి పూజా భేడీ కుమార్తె. ఈ భామ నటనతో పాటు, టాప్ మోడల్ గా దూసుకుపోతోంది. ప్రఖ్యాత అంతర్జాతీయ బ్రాండ్లకు ప్రమోషన్స్ చేస్తూ నిరంతరం టీవీ ప్రకటనల్లో ప్రత్యక్షమవుతుంది. ఇటీవల ఆలయ నటిగాను కెరీర్ పరంగా బిజీగా ఉంది.
అయితే ఆలయ ఎఫ్ ఒక ఫిట్నెస్ ఫ్రీక్ గా గొప్ప గుర్తింపును తెచ్చుకుంటోంది. జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, సారా అలీఖాన్, సుహానా ఖాన్, అనన్య పాండే లాంటి నటవారసురాళ్ల మధ్య ఫిట్నెస్ ఫ్రీక్ గా, ఫ్యాషన్ ఐకాన్ గా యూనిక్ స్టైల్‌తో వెలిగిపోతోంది. సోషల్ మీడియా ప్రమోషన్స్ తో పాటు, వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ ఆర్జిస్తున్న ఆలయ ఎఫ్ బాలీవుడ్ నట వారసురాళ్లలో ఒకరిగా ఎంట్రీ ఇచ్చినా, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా తన ఫిట్‌నెస్ వీడియోలు, యోగా స్కిల్స్‌తో సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది.
ఆలయ ఇటీవలి ఇంటర్వ్యూలలో తన ఎంపికల గురించి మాట్లాడింది. ఫ్రెడ్డీ, యూటర్న్ లాంటి చిత్రాల్లో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంచుకోవడానికి కారణం తన వైవిధ్యమైన ఆలోచనలే. కెరీర్ ఆరంభమే నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించి సాహసోపేతమైన ఎంపికలతో ఆశ్చర్యపరిచింది. తాను నటించడానికి వచ్చానని, కేవలం తాను ఎంచుకున్నవి నటనకు ఆస్కారం ఉన్నవి మాత్రమేనని ఆలయ క్లియర్ కట్ గా చెప్పింది.
ఆలయ ఇంతకుముందు `బడే మియాన్ చోటే మియాన్` అనే భారీ యక్షన్ చిత్రంలో నటించింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లాంటి అగ్ర హీరోలు నటించారు కానీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టరైంది. ఆ తర్వాత రాజ్ కుమార్ రావు సరసన శ్రీకాంత్ అనే బయోపిక్ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో షటిల్డ్ పెర్ఫామెన్స్ తో ఆలయ ఆకట్టుకుంది.
ఈ భామ ప్రస్తుతం `స్టోర్మ్` అనే సిరీస్ లో నటిస్తోంది. హృతిక్ రోషన్ తన సొంత నిర్మాణ సంస్థ `సినిమా క్రియేషన్స్` దీనిని నిర్మిస్తోంది. ఒక యాక్షన్ సిరీస్ తో ఆలయ డిజిటల్ లో అరంగేట్రం చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. అజిత్‌పాల్ సింగ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. `స్త్రీ రోగ్ విభాగ్` అనే చిత్రంలోను ఆలయ నటిస్తోంది. ఆయుష్మాన్ ఖురానా ఇందులో కథానాయకుడు. సోషల్ కామెడీ కంటెంట్ తో ఈ సినిమా రూపొందుతోంది. రాహు కేతు అనే చిత్రంలోను ఆలయ నటిస్తోంది. మరికొన్ని సినిమాల షూటింగ్ చర్చల దశలో ఉన్నాయి.
బ్రాండ్స్ ప్రమోషన్స్ లో సోషల్ మీడియాల్లో ఆలయ జోరుగా ఉంది. ఈ యంగ్ బ్యూటీ ఫిట్‌నెస్ ఫ్రీక్ కావడం వల్ల పలు హెల్త్, బ్యూటీ, ఫ్యాషన్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ బిజీగా ఉంటోంది. నైకా, స్కెచర్, బాంబే షేవింగ్ కంపెనీ వంటి ఉత్పత్తులకు ఆలయ ప్రచారం చేస్తోంది.
