కోటి రూపాయల స్టవ్ కొనాలి.. అనన్య సిస్టర్ కోరిక!
లైగర్ బ్యూటీ అనన్య పాండే సోదరి, ప్రముఖ యూట్యూబర్ అలన్నా పాండే తన కొత్త ఇంటి రినోవేషన్ కోసం చేస్తున్న ఖర్చు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
By: Sivaji Kontham | 11 Jan 2026 2:05 PM ISTలైగర్ బ్యూటీ అనన్య పాండే సోదరి, ప్రముఖ యూట్యూబర్ అలన్నా పాండే తన కొత్త ఇంటి రినోవేషన్ కోసం చేస్తున్న ఖర్చు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒక స్టవ్, మార్బుల్ ధరల గురించి బాహాటంగా అలనా చెప్పిన మాటలు విని నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు.
అలన్నా భర్త ఐవర్ మెక్‌క్రే సైతం అలనా చెప్పిన ధరలు విని ఆశ్చర్యపోయాడు. కాలిఫోర్నియాలోని తమ కొత్త 5-బెడ్రూమ్ ఇంటి కోసం షాపింగ్‌కు వెళ్లిన అలనాకు అక్కడ ఒక ఖరీదైన స్టవ్ నచ్చింది. దాని ధర సుమారు 80లక్షల నుంచి 1.1 కోట్లు. ఈ ధర గురించి వినగానే ఐవర్ షాక్ అయ్యారు. ఇది చాలా కామెడీగా ఉందని కూడా వ్యాఖ్యానించాడు. ఒక ఫ్రిజ్ ఖరీదు నా మొదటి కారు రేంజు ధర... ఇక ఈ స్టవ్ అయితే మరీనూ! అని జోక్ చేశారు.
వంటగది, బాత్రూమ్ కోసం అలన్నా ఒక ప్రీమియం మార్బుల్‌ను ఎంపిక చేశారు. దాని ఖరీదు 63లక్షలు. ఒక్కో మార్బుల్ స్లాబ్ ధర ఖర్చు 6.4 లక్షలు. మొత్తం 10 స్లాబ్‌లు కావాల్సి ఉండటంతో కేవలం మార్బుల్ కోసమే 63 లక్షలకు పైగా ఖర్చవుతుందని అలనా పేర్కొన్నారు. దీనిపై భర్త ఐవర్ జోక్ చేస్తూ..నేను వీడియో కింద ఒక డొనేషన్ లింక్ పెడతాను, ఎవరైనా విరాళం ఇవ్వండి! అని సరదాగా వ్యాఖ్యానించారు.
అలన్నా- ఐవర్ దంపతులు ఇటీవల లాస్ ఏంజిల్స్ (LA)లో కూడా మరో పెద్ద ఇంటిని కొనుగోలు చేశారు. ఆ ఇంటికి ఉన్న డార్క్ ఫ్లోరింగ్‌ను తీసేసి `లైట్ ఓక్` ఫ్లోరింగ్‌ను వేయించాలని వారు నిర్ణయించుకున్నారు. దీనివల్ల బ్రైట్ నెస్ తో ఇల్లు కళకళలాడుతుంది. ఇంటి విలువను పెంచేందుకే విదేశీ మార్బుల్, ఖరీదైన వస్తువులను కొంటున్నామని, ఇదంతా పెట్టుబడిగా చూడాలని కూడా ఐవర్ తెలిపారు.
అలన్నా పాండే వ్యక్తిగత వివరాల్లోకి వెళితే, అందాల కథానాయిక అనన్యా పాండేకు సోదరి, చంకీ పాండే సోదరుడి కుమార్తె. ప్రస్తుతం యూట్యూబ్ సోషల్ మీడియాల్లో పాపులర్ సెలబ్రిటీ. ప్రభావశీలి. విదేశీయుడు ఐవర్ మెక్‌క్రేతో కలిసి ట్రావెల్- లైఫ్‌స్టైల్ వ్లాగ్స్ చేస్తూ పాపులరయ్యారు.
కోటి రూపాయల స్టవ్ గురించి విన్నాక అందరూ విమర్శిస్తుంటే, తాము ఆ రేంజు స్టవ్ కొనబోవడం లేదని వివరణ ఇచ్చిన అలనా రూ.10 లక్షల రేంజులో ఉండే మోడల్స్‌ను పరిశీలిస్తున్నామని తెలిపారు.
