Begin typing your search above and press return to search.

ఫేమ‌స్ విల‌న్ పై ఇంకా మ‌నోళ్లు క‌ళ్లు ప‌డ‌లేదే!

తెలుగు ప్రేక్షకులు కూడా కొత్త నటులను, వైవిధ్యమైన విలనిజాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో అక్షయ్ రాక కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

By:  Srikanth Kontham   |   15 July 2026 8:00 AM IST
ఫేమ‌స్ విల‌న్ పై ఇంకా మ‌నోళ్లు క‌ళ్లు ప‌డ‌లేదే!
X

బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా కెరీర్‌ సరికొత్త మలుపు తిరిగింది. ఒకప్పుడు చాక్లెట్ బాయ్‌గా, క్లాసిక్ హీరోగా అలరించిన అక్ష‌య్ ఇప్పుడు విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. ముఖ్యంగా `ఛావా`, `ధురంధర్` చిత్రాల తర్వాత ఆయన నటనకు ముఖ్యంగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషించే తీరుకు విమర్శకుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బాలీవుడ్‌లో విలన్ పాత్ర అంటే మొదట గుర్తుకు వచ్చే పేరుగా అక్షయ్ ఖన్నా అన్న‌ట్లు గా స‌న్నివేశం మారిపోయింది. అక్షయ్ ఖన్నాలో వైవిధ్యమైన నటన, ఆయన కళ్ళలో ఉండే తీవ్రత ఏ పాత్రనైనా అద్భుతంగా పండించగలవని నిరూపిస్తున్నాయి.

సాధారణ ప్రతినాయకుడిలా కాకుండా? పాత్రలో లోతును చూపే అక్షయ్ శైలి, ఇప్పుడున్న ట్రెండ్‌కు సరిగ్గా సరిపోతుంది. పాత్ర నేపథ్యాన్ని, ఆ పాత్ర ఎందుకు విలన్ కావాల్సి వచ్చిందో? తన హావభావాలతో చెప్పే సత్తా ఆయనకు ఉంది. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ దర్శక నిర్మాతలంతా అక్షయ్ కోసం క్యూ కడుతున్నారనే ప్ర‌చారం బాలీవుడ్ మీడియాలో ఊపందుకుంది .

టాలీవుడ్ విషయానికి వస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. భారీ బడ్జెట్ చిత్రాలకు, ప్యాన్ ఇండియా ప్రాజెక్టులకు క్రూరమైన ..తెలివైన విలన్ కావాలి. అక్షయ్ ఖన్నా నటనతో అలాంటి పాత్రలకు పూర్తి న్యాయం చేయగలరు. టాలీవుడ్ అగ్ర హీరోల సరసన అక్షయ్ వంటి ప్రతిభావంతుడైన నటుడు విలన్‌గా కనిపిస్తే? ఆ సినిమా రేంజ్ ఖచ్చితంగా పెరుగుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. కానీ ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి అక్షయ్‌కు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడం ఆశ్చర్యకరం. తెలుగు పరిశ్రమకు ఆయన ఆహార్యం, నటన ఎంతో సరిపోతాయని తెలిసినా? ఇంకా ఎందుకో ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు.

బహుశా సరైన కథ లేదా బలమైన విలన్ పాత్ర కోసం దర్శక నిర్మాతలు వేచి చూస్తున్నారే మోననిపిస్తుందని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అక్ష‌య్ ఖ‌న్నా పాత్ర గనుక బలంగా ఉంటే అది కథను ఎంతగా మలుపు తిప్పుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు తమ చిత్రాలను ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నటుడు విలన్‌గా ఉంటే ఆ చిత్రానికి మరింత క్రేజ్ వస్తుంది. అక్షయ్ ఖన్నాను కేవలం ఒక పాత్రగా కాకుండా సినిమా మార్కెటింగ్‌కు కూడా ఉపయోగించుకునే వీలుంది.

తెలుగు ప్రేక్షకులు కూడా కొత్త నటులను, వైవిధ్యమైన విలనిజాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో అక్షయ్ రాక కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

తెలుగు ప‌రిశ్ర‌మ‌లో ప్రయోగాత్మక పాత్రలకు, విలక్షణమైన ప్రతినాయక పాత్రలకు మంచి ఆదరణ ఉంటుంది. అక్షయ్ ఖన్నా లాంటి పరిణతి చెందిన నటుడు టాలీవుడ్‌లోకి ప్రవేశిస్తే? నటన పరంగానే కాకుండా భాషా పరిధులను దాటి రెండు పరిశ్రమల మధ్య సృజనాత్మక మార్పిడికి కొత్త ద్వారాలు తెరుస్తుంది. దర్శకులు కేవలం రొటీన్ విలన్ పాత్రలకే పరిమితం కాకుండా అక్షయ్ ఖన్నాలోని నటనా పటిమను పూర్తి స్థాయిలో విని యోగించుకునేలా బలమైన స్క్రిప్టులను సిద్ధం చేస్తే? ఖచ్చితంగా వెండితెరపై అద్భుతమైన విలనిజం పండుతుంది. వైవిధ్యమైన పాత్రలను కోరుకునే తెలుగు ప్రేక్షకులు అక్షయ్ ఖన్నా వంటి నటుడిని చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రి టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఎప్పుడు అవకాశం ఇస్తారో చూడాలి.