Begin typing your search above and press return to search.

ప్రశాంత్ వర్మ మహాకాళి కోసం శుక్రాచార్యుడుగా మారిన బాలీవుడ్ హీరో..!

హిందీ నటుడు అక్షయ్ ఖన్నా ప్రస్తుతం మహాకాళి అనే ప్రతిష్టాత్మక చిత్రంతో కీలకపాత్రలో నటిస్తున్నారు .

By:  Priya Chowdhary Nuthalapti   |   28 March 2026 3:51 PM IST
ప్రశాంత్ వర్మ మహాకాళి కోసం శుక్రాచార్యుడుగా మారిన బాలీవుడ్ హీరో..!
X

హిందీ నటుడు అక్షయ్ ఖన్నా ప్రస్తుతం మహాకాళి అనే ప్రతిష్టాత్మక చిత్రంతో కీలకపాత్రలో నటిస్తున్నారు . ఈ సినిమాకు ఆయన తన షూటింగ్ భాగాన్ని పూర్తిగా ముగించారు. చాలా తక్కువ రోజుల్లోనే ఈ సినిమాలోని కీలకపాత్ర షూటింగ్ అవ్వడంతో..ఈ విషయం ఆయన అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌గా మారింది.

ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. భారతీయ పురాణాలను ఆధారంగా తీసుకుని ఆధునిక టెక్నాలజీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇది ఒక ముఖ్యమైన చిత్రంగా రాబోతోంది అని వెనుకరి.

అక్షయ్ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక ప్రత్యేకమైన బీటీఎస్ (బ్యాక్‌స్టేజ్) ఫోటో విడుదల చేశారు. ఆ ఫోటోలో అక్షయ్ ఖన్నా.. శుక్రాచార్య పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన దర్శకుడితో మాట్లాడుతున్న సీన్.. అందరిని ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోతో సినిమా మీద ఆసక్తి మరింత పెరిగింది.

ఈ సినిమాలో అక్షయ్ శుక్రాచార్య పాత్రలో.. చాలా విభిన్నంగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అక్షయ్ ఖన్నా తన నటనతో ఈ పాత్రను మరో స్థాయికి తీసుకెళ్తారని అందరూ భావిస్తున్నారు. ఆయనకు ఉన్న అనుభవం ఈ పాత్రకు బాగా ఉపయోగపడనుంది.

మహాకాళి సినిమా షూటింగ్ ఇప్పటికే 100 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ సుమారు 40 రోజులు కొనసాగుతుంది. ప్రధాన నటీనటులు తమ షూటింగ్ భాగాలను పూర్తి చేస్తుండగా..పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి.

ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కు చాలా ప్రాధాన్యం ఉండబోతోంది అంట. పలు స్టూడియోలు కలిసి భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్ పనులు చేస్తున్నారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా భూమి శెట్టి నటిస్తున్నారు. ఆర్కేడీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. దర్శకత్వ బాధ్యతలను పూజా అపర్ణ కొల్లూరు నిర్వహిస్తున్నారు. మొత్తం పైన మహాకాళి సినిమా భారీ అంచనాలతో రూపొందుతోంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నట్లు సమాచారం.