Begin typing your search above and press return to search.

మహాకాళి శుక్రాచార్య వచ్చేశాడు..!

హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ ప్రెస్టీజియస్ గా అనౌన్స్ చేసిన సినిమా మహాకాళి. ఈ సినిమాను ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిస్తున్నారు

By:  Ramesh Boddu   |   30 Sept 2025 12:16 PM IST
మహాకాళి శుక్రాచార్య వచ్చేశాడు..!
X

హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ ప్రెస్టీజియస్ గా అనౌన్స్ చేసిన సినిమా మహాకాళి. ఈ సినిమాను ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిస్తున్నారు. మహాకాళి సినిమాకు స్టోరీ, షో రన్నర్ గా ప్రశాంత్ వర్మ వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాను పూజ అపర్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఆర్.కె.డి స్టూడియోస్ బ్యానర్ లో రావాజ్ రమేష్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. మహాకాళి నుంచి శుక్రాచార్య పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

మహాకాళి సినిమాలో అక్షయ్ ఖన్నా..

సినిమాలో శుక్రాచార్య పాత్రలో బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ ఖన్నా నటిస్తున్నారు. బాలీవుడ్ లో ఎన్నో ఏళ్లుగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు అక్షయ్ ఖన్నా.. మహాకాళి సినిమాలో అక్షయ్ ఖన్నా కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమా నుంచి శుక్రాచార్య పోస్టర్ రిలీజ్ చేశారు. శుక్రాచార్య పోస్టర్ తోనే మహాకాళికి మంచి బజ్ ఏర్పరిచారు.

అక్షయ్ ఖన్నా రీసెంట్ గా ఛావా సినిమాలో ఔరంగజేబ్ రోల్ లో అదరగొట్టారు. ఇప్పుడు ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మహాకాళిలో శుక్రచార్యుడు రోల్ లో అక్షయ్ ఖన్నా పర్ఫెక్ట్ అనిపించేలా ఫస్ట్ లుక్ ఉంది. హనుమాన్ తో తన పెన్ పవర్ ఏంటో చూపించిన ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో రెండో మూవీగా మహాకాళి చేస్తున్నాడు. ఐతే ఈ సినిమాను డైరెక్షన్ బాధ్యతలను పూజ అపర్ణకి అప్పచెప్పారు.

ప్రశాంత్ వర్మ జై హనుమాన్..

ప్రశాంత్ వర్మ మహాకాళికి డైరెక్షన్ చేయకపోయినా స్క్రీన్ ప్లే, షో రన్నర్గా తన మార్క్ చూపించబోతున్నారు. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా యాడ్ అవ్వడం మరింత స్పెషల్ గా మారింది. ఐతే మహాకాళి అక్షయ్ ఖన్నా ఓకే కానీ ఆ నెక్స్ట్ సినిమా మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమాతో పాటుగా ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమా కూడా చేయాల్సి ఉంది. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. సినిమాతో మరోసారి ప్రశాంత్ వర్మ స్టామినా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఎలాగు ఈమధ్య ఇలాంటి కథలు, సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు తెస్తున్నాయి. అందుకే ప్రశాంత్ వర్మ కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నాడు. రిషబ్ శెట్టి లీడ్ రోల్ లో నటిస్తున్న జై హనుమాన్ కథ కూడా చాలా ఎగ్జైట్మెంట్ తో ఎదురుచూస్తున్నాడు. జై హనుమాన్, మహకాళి ఇలా వరుస