Begin typing your search above and press return to search.

30 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఆ మాత్రం ఉండదా మరి..?

బాలీవుడ్ లో లేటెస్ట్ సెన్సేషన్ దురంధర్ సినిమా ప్రస్తుతం అంతటా చర్చలకు కారణం అవుతుంది.

By:  Ramesh Boddu   |   8 Dec 2025 10:13 AM IST
30 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఆ మాత్రం ఉండదా మరి..?
X

బాలీవుడ్ లో లేటెస్ట్ సెన్సేషన్ దురంధర్ సినిమా ప్రస్తుతం అంతటా చర్చలకు కారణం అవుతుంది. రణ్ వీర్ సింగ్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా బీ టౌన్ ఆడియన్స్ ని మెప్పించడమే కాదు బాక్సాఫీస్ దగ్గర కళకళలాడుతుంది. ఐతే ఈ సినిమా విషయంలో రణ్ వీర్ సింగ్ యాక్టింగ్ విషయంలో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ సూపర్ అనేస్తున్నారు. ఐతే సినిమాలో మరో స్పెషల్ సర్ ప్రైజ్ గా అక్షయ్ ఖన్నా యాక్టింగ్ చూసి వావ్ అనేస్తున్నారు. సినిమాలో రణ్ వీర్ సింగ్ కి ఏమాత్రం తగ్గని విధంగా అక్షయ్ ఖన్నా ప్రదర్శన ఉంది.

అక్షయ్ ఖన్నా పెర్ఫార్మెన్స్..

అక్షయ్ ఖన్నా లాస్ట్ ఇయర్ కూడా ఇలానే డిసెంబర్ లో ఛావా సినిమాలో ఔరంగజేబు రోల్ లో అదరగొట్టాడు. మళ్లీ ఈసారి కూడా దురంధర్ తో ఇంప్రెస్ చేశాడు. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా పెర్ఫార్మెన్స్ చూసి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఐతే దాదాపు 30 ఏళ్ల సినీ కెరీర్ ఉన్న అక్షయ్ ఖన్నా ఈ విధంగా తిరిగి ఫాం లోకి రావడం సినీ లవర్స్ ని ఖుషి చేస్తుంది.

ఏదైనా పనిలో సీనియారిటీ ఉంటే అది ఎప్పుడో ఒకచోట మళ్లీ వాళ్లని షైన్ అయ్యేలా చేస్తుంది అని చెప్పడానికి చాలా ఎక్సాంపుల్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈమధ్య బాబీ డియోల్, సన్నీ డియోల్ కొన్ని సినిమాలతో తిరిగి సూపర్ ఫాం లోకి రాగా.. దురంధర్ తో అక్షయ్ ఖన్నా స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయ్యింది. 1997 లో హిమాలయ్ పుత్ర సినిమాతో తెరంగేట్రం చేసిన అక్షయ్ ఖన్నా ఇన్నేళ్ల కెరీర్ లో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చారు.

యునానిమస్ హిట్ టాక్..

లాస్ట్ ఇయర్ ఛావా సినిమాతోనే ఆయన గురించి అందరు డిస్కస్ చేసుకోగా దురంధర్ లో స్ట్రాంగ్ రోల్ లో మరోసారి తన వర్సటాలిటీ చూపించారు అక్షయ్ ఖన్నా. దురంధర్ 2 కూడా ఉంటుంది కాబట్టి అందులో కూడా అక్షయ్ ఖన్నా మరింత మెప్పించే ఛాన్స్ ఉంటుంది. ఏది ఏమైనా బాలీవుడ్ లో ఈమధ్య చాలా తక్కువ సినిమాలకు యునానిమస్ హిట్ టాక్ వస్తుంది. దురంధర్ సినిమాకు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. రణ్ వీర్ సింగ్ ఏదైనా సినిమా మీద నమ్మకాన్ని పెట్టుకున్నాడో అది నిజమైంది.

రణ్ వీర్ సింగ్ కూడా దురంధర్ సినిమాని ఒక ఛాలెంజ్ లా తీసుకున్నాడని అనిపించింది. అందుకే సినిమా లెంగ్త్ ఎక్కువ ఉన్నా కూడా ఎక్కడ ఆడియన్స్ కి బోర్ కొట్టించకుండా అదరగొట్టారు. దురంధర్ తో రణ్ వీర్ సింగ్ కూడా ఫాం లోకి వచ్చినట్టే. ఇక నెక్స్ట్ సినిమాలు కూడా ఇదే జోష్ తో చేయాలని ఫిక్స్ అయ్యాడు రణ్ వీర్ సింగ్.

ఐతే బాలీవుడ్ లో అదరగొట్టేస్తున్న అక్షయ్ ఖన్నా నెక్స్ట్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో వస్తున్న మహాకాళి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అతని రోల్ గురించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. శుక్రాచార్యగా అక్షయ్ ఖన్నా మరోసారి అదరగొట్టే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఓ విధంగా అతన్ని సినిమాలో తీసుకోవడం ప్రశాంత్ వర్మ చేసిన మంచి నిర్ణయమని చెప్పొచ్చు.