'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!
'ఇంకా ఏం అనుకోలేదు' సినిమా నుంచి 'మేఘాలు సంద్రంలో' ఫస్ట్ సింగిల్ విడుదలైంది. సింజిత్ యెర్రమిల్లి స్వరపరిచిన ఈ పాటను ఆదిత్య ఆర్కే, గోమతి అయ్యర్ ఆలపించారు. అక్షయ్ లగుసాని, కేయూరి జంట కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 11న విడుదల కానుంది.
By: M Prashanth | 10 Nov 2026 6:21 PM ISTనేటి తరం ఆలోచనలను కనెక్ట్ అయ్యే సరికొత్త కథలతో సినిమాలు వస్తే ఆడియన్స్ కచ్చితంగా ఎట్రాక్ట్ అవుతారు. అలా యూత్‌ఫుల్ వైబ్‌తో రాబోతున్న చిత్రం 'ఇంకా ఏం అనుకోలేదు'. ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేయగా, లేటెస్ట్ గా మేకర్స్ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి ఫస్ట్ సింగిల్‌ను బయటకు వదిలారు. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ మెలోడీ సాంగ్ సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తోంది.
'మేఘాలు సంద్రంలో' అంటూ సాగే ఈ రొమాంటిక్ ట్రాక్‌కు సింజిత్ యెర్రమిల్లి ఫ్రెష్ ట్యూన్‌తో కంపోజ్ పోశారు. కథానాయకుడు అభి తన మనసులోని ప్రేమ భావాలను వ్యక్తం చేసే తీరును కిట్టు విస్సాప్రగడ క్యాచీ లిరిక్స్‌తో నేటి ట్రెండ్‌కు తగినట్లుగా రాశారు. ఆదిత్య ఆర్కే, గోమతి అయ్యర్ పాడిన విధానం ఈ పాటకు మెయిన్ హైలైట్‌గా నిలిచింది. ఒక పక్క లవ్ ఫీల్, ఇంకో పక్క యూత్‌ఫుల్ రిథమ్‌తో సాగుతూ ఈ ట్రాక్ ఇన్‌స్టంట్‌గా ప్లేలిస్ట్‌లలో చోటు దక్కించుకుంటోంది.
పాటలో హీరో అక్షయ్ లగుసాని, హీరోయిన్ కేయూరి మధ్య కెమిస్ట్రీ చాలా నేచురల్‌గా కుదిరింది. క్యాంపస్ విజువల్స్, కలర్‌ఫుల్ ఫ్రేమ్స్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. రెహాన్ షేక్ అందించిన సినిమాటోగ్రఫీ స్క్రీన్‌పై ఫ్రెష్ ఫీల్‌ను ఇచ్చింది. అంతేకాకుండా సాంగ్ చివర్లో జైకృష్ణ చేసిన కామెడీ బిట్ మంచి ఫన్ టచ్ ఇచ్చి ప్రేక్షకులను నవ్విస్తుంది. రొమాన్స్‌తో పాటు సరదా మూమెంట్స్‌ను బ్యాలెన్స్ చేసిన విధానం బాగా వర్కౌట్ అయింది.
నార్మల్ ప్రచారాలకు పూర్తి భిన్నంగా వెళ్తూ ఈ సినిమా మొదటి నుంచే హైలెట్ అవుతోంది. గతంలో విడుదలైన టైటిల్ గ్లింప్స్, ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ వీడియోలలో వాడిన మీమ్స్, సెటైరికల్ కాన్సెప్ట్‌లు ఆడియన్స్‌కు కొత్తగా అనిపించాయి. డైరెక్టర్లు ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని ఈ చిత్రాన్ని నేటి జనరేషన్ మెచ్చే బ్రోమాంటిక్ కామెడీగా తీర్చిదిద్దినట్లు అర్థమవుతుంది.
టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈటీవీ విన్ సంస్థలు చేతులు కలిపి ఈ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. గతంలోనూ వీరి కాంబోలో సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టులు వచ్చాయి. సమీర్ కన్ను, వెన్నపూస శ్రీకర్ రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమాలో రావు రమేష్, హర్షవర్థన్, సుబ్బరాజు, అనిత చౌదరి లాంటి సీనియర్ నటీనటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 11న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
