18 ఏళ్ల తర్వాత మరోసారి స్టార్ కాంబినేషన్!
సైఫ్ అలీఖాన్-అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో మల్టీస్టార్ అంటే? ఒకప్పుడు ఓ సంచలనం.
By: Srikanth Kontham | 25 Aug 2025 11:00 PM ISTసైఫ్ అలీఖాన్-అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో మల్టీస్టార్ అంటే? ఒకప్పుడు ఓ సంచలనం. ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన `మై ఖిలాడి తు అనారి', 'యే దిల్లగి, `తుషాన్` లాంటి చిత్రాలు అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఐదు కోట్లలోపు బడ్జెట్ లోనే తెరకెక్కిన సినిమాలు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. చివరిగా కలిసి నటించిన చిత్రం `తుషాన్`. ఇది రిలీజ్ అయి 18 ఏళ్లు అవుతుంది. ఆ తర్వాత మళ్లీ అక్షయ్-సైఫ్ లు కలిసి సినిమాలు చేయలేదు. ఎవరి సోలో చిత్రాలతో వారు బిజీ అయ్యారు. ఇతర స్టార్లతో కలిసి ఎన్నో చిత్రాల్లోనూ నటించారు.
సౌత్ డైరెక్టర్ కారణగానే:
కానీ ఆ హిట్ కాంబినేషన్ మాత్రం మళ్లీ చేతులు కలపలేదు. తాజాగా 2025 అందుకు వేదికగా మారింది. ఇద్దరి కాంబినేషన్ లో 18 ఏళ్ల తర్వాత `హైవాన్` అనే చిత్రం ప్రారంభమైంది. ప్రియదర్శన్ ఈ చిత్రాన్ని తెరెక్కిస్తుండగా సౌత్ పరిశ్రమకు చెందిన నిర్మాణ సంస్థలు నిర్మించడం విశేషం. డైరెక్టర్ కూడా సౌత్ కి చెందిన వారు కావడంతో? అక్కడ పరిశ్రమకు చెందిన నిర్మాణ సంస్థనే ఎంచుకున్నారు. ఈ సినిమా ప్రా రంభోత్సవం కూడా కొచ్చిలో జరగడం విశేషం. ఇద్దరు స్టార్లను 18 ఏళ్ల ర్తవాత కలిసి చూడటంతో అభి మానుల ఆనందానికి అవదుల్లేవ్.
ఇద్దరు ప్లాప్ ల్లోనే:
ఒకరి కొకరు కలిసి పని చేయడంపై సంతోషం వ్యక్తం చేసారు. హీరోలగా ఇద్దరికీ ఈ సినిమా కూడా అంతే కీలకం. కొంత కాలంగా ఇరువురు నటిస్తోన్న చిత్రాలేవి పెద్దగా ఆడటం లేదు. అక్షయ్ కుమారు వరుస పరాజయాలతోనే కనిపిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ ఇతర స్టార్ల చిత్రాల్లో భాగమై కొంత వరకూ పర్వాలేదనిపి స్తున్నా? అక్షయ్ మాత్రం తీవ్ర ప్రతి కూలతను ఎదుర్కుంటున్నాడు. అలాంటి సమయంలో మళ్లీ ఇద్దరు చేతులు కలపడం సంచలనంగా మారింది. 18 ఏళ్ల తర్వాత ఈ ద్వయం మళ్లీ ఐకానిక్ హిట్ ని నమోదు చేస్తారని అభిమానులు భారీ ఆశలతో ఎదురు చూస్తున్నారు.
హీరోలు విలన్లగా:
ప్రస్తుతం అక్షయ్ కుమార్-సైఫ్ అలీఖాన్ బాలీవుడ్ లో వేర్వేరు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇరువురికి సౌత్ లో ప్రత్యేకించి తెలుగు పరిశ్రమలో మంచి అవకాశాలు వస్తున్నాయి. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్ర లతో పాటు ప్రతి నాయకుడు పాత్రలకు ఇద్దరు స్టార్లను తీసుకుంటున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో నటు లిద్దరు తెలుగు సినిమాలపై దృష్టి పెడితే మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
