బాలీవుడ్ స్టార్ హీరో బిజినెస్ భలేగుందే!
సినీ నటులు కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాకుండా పలు విధాలుగా తమ ఫాలోయింగ్, క్రేజ్ ను వాడుకుని క్యాష్ చేసుకోవాలనుకుంటారు.
By: Sravani Lakshmi Srungarapu | 29 July 2025 3:00 AM ISTసినీ నటులు కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాకుండా పలు విధాలుగా తమ ఫాలోయింగ్, క్రేజ్ ను వాడుకుని క్యాష్ చేసుకోవాలనుకుంటారు. అందులో భాగంగానే సినిమాలతో పాటూ బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, బిజినెస్ లు చేసి తమ ఆదాయాన్ని మరింత పెంచుకుంటూ ఉంటారు. కొందరు బ్యూటీ బ్రాండ్స్ ను స్టార్ట్ చేస్తే, మరికొందరు ఫ్యాషన్ రంగంలోకి దిగి బిజినెస్ చేస్తుంటారు.
ఇంకొందరు ఫుడ్ బిజినెస్ లోకి దిగితే, మరికొందరు తెలివిగా ఆలోచిస్తూ వ్యవహరిస్తూ ఉంటారు. బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ కూడా ఆ తెలివితోనే ఓ క్రేజీ బిజినెస్ ను చేస్తున్నారు. అదే అపార్ట్‌మెంట్స్ అమ్మకం. తక్కువ రేటుకు ఫ్లాట్స్ లేదా అపార్ట్‌మెంట్స్ ను కొని వాటికి మంచి రేటు వచ్చాక తిరిగి అమ్ముతూ విపరీతమైన లాభాలను ఆర్జిస్తున్నారు.
భారీగా లాభాలు ఆర్జిస్తున్న హీరో
అక్షయ్ కుమార్ రీసెంట్ గా ముంబైలోని బోరివాలి ఏరియాలో రెండు అపార్ట్‌మెంట్స్ ను రూ.7.10 కోట్లకు అమ్మారు. ఆ అపార్ట్‌మెంట్స్ ను అక్షయ్ కుమార్ 2017లో కొన్నారు. ఈ ఎనిమిదేళ్లలో అక్షయ్ వాటి ద్వారా ఇప్పుడు 92% లాభాలను అందుకున్నారు. అందులో ఒక అపార్ట్‌మెంట్ రూ.5.75 కోట్లకు అమ్మగా, అక్షయ్ దాన్ని రూ.3.02 కోట్లకు మాత్రమే కొన్నారు. అందులో రూ.34.50 లక్షల స్టాంప్ డ్యూటీతో పాటూ రూ.30000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా ఉన్నాయి.
ఇక రెండో అపార్ట్‌మెంట్ ను అక్షయ్ కుమార్ 2017లో రూ. 67.90 లక్షలకు కొనగా ఇప్పుడు దాన్ని రూ.1.35 కోట్లకు అమ్మేశారు. దీనికి రూ.6.75 లక్షల స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజ్ కూడా అదనంగా చెల్లించాల్సి వచ్చింది. దీనికంటే ముందు మార్చిలో అక్షయ్ కుమార్ అదే ఏరియాలోని మరో రెండు ఫ్లాట్ లను రూ.6.60 కోట్లకు అమ్మగా, ఏప్రిల్ లో లోయర్ పరేల్ లోని ఆఫీస్ స్పేస్ ను రూ.8 కోట్లకు అమ్మేశారు. చూస్తుంటే అక్షయ్ కుమార్ దీన్ని చాలా సీరియస్ బిజినెస్ లా చేస్తున్నట్టు అనిపిస్తుంది.
