Begin typing your search above and press return to search.

రియ‌ల్ ఎస్టేట్ లో కింగ్ లా దూసుకుపోతున్న స్టార్ హీరో!

రియ‌ల్ ఎస్టేట్ రంగంలో బాలీవుడ్ తార‌లు సైతం సంచ‌ల‌నం సృష్టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. న‌ట‌న‌పైనే ఆధార‌ప‌డ‌కుండా బిజినెస్ మార్గాల‌ను కూడా అంతే ఫ్యాష‌న్ తో వెతికి స‌క్సెస్ అవుతున్నారు.

By:  Srikanth Kontham   |   2 July 2026 5:00 PM IST
రియ‌ల్ ఎస్టేట్ లో కింగ్ లా దూసుకుపోతున్న స్టార్ హీరో!
X

రియ‌ల్ ఎస్టేట్ రంగంలో బాలీవుడ్ తార‌లు సైతం సంచ‌ల‌నం సృష్టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. న‌ట‌న‌పైనే ఆధార‌ప‌డ‌కుండా బిజినెస్ మార్గాల‌ను కూడా అంతే ఫ్యాష‌న్ తో వెతికి స‌క్సెస్ అవుతున్నారు. దీనిలో భాగంగా చాలా మంది స్టార్లు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఖిలాడీ అక్షయ్ కుమార్ కూడా తెలివైన పెట్టుబడులతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ముంబై రియల్ ఎస్టేట్ రంగంలో అక్ష‌య్ చేసే లావా దేవీలు తరచుగా ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమవుతుంటాయి. తాజాగా అక్షయ్ కుమార్ పోర్ట్‌ఫోలియోలోని రెండు విలాసవంతమైన అపార్ట్‌మెంట్లను విక్రయించడం తో భారీ లాభాన్ని ఆర్జించారు.

ముంబైలోని ములుండ్ ప్రాంతంలో ఉన్న రెండు లగ్జరీ ఫ్లాట్లను అమ్మకానికి ఉంచగా వాటికి అనూహ్య స్పందన లభించింది. ఈ లావాదేవీలకు సంబంధించిన వివరాల ప్రకారం అక్షయ్ కుమార్ ఈ అపార్ట్‌మెంట్లను దాదాపు 12.38 కోట్ల విక్రయించారు. 2017వ సంవత్సరంలో వీటిని అక్ష‌య్ 9 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. అంటే తొమ్మిదేళ్ల కాలంలో ఈ ఆస్తుల ద్వారా 3.38 కోట్ల రూపాయల మేర లాభాన్ని పొందారు. ముంబై వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ విలువలు ఎలా పెరుగుతాయో? చెప్పడానికి అక్షయ్ కుమార్ చేపట్టిన ఈ లావాదేవీ ఓ ఉదాహరణగా చెప్పొచ్చు.

సాధారణంగా బాలీవుడ్ తారలు జుహు, బాంద్రా వంటి ప్రాంతాల్లో నివాసాలను కలిగి ఉండటానికే ఆసక్తి చూపిస్తారు. అక్షయ్ కుమార్ మాత్రం నగరం నలుమూలలా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను విస్తరిస్తుంటారు. ములుండ్ ప్రాంతం అనేది ముంబైలో అభివృద్ధి చెందుతున్న కీలకమైన నివాస ప్రాంతాలలో ఒకటి. అక్కడ అక్షయ్ కుమార్ పెట్టిన పెట్టుబ‌డి తెలివైన ఆర్థిక పెట్టుబడిగా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. బాలీవుడ్‌లో సంపాదించిన సొమ్మును ఆచితూచి పెట్టుబడిగా మార్చడంలో అక్షయ్ కుమార్ శైలే వేరు.

అక్ష‌య్ వృత్తిపరంగా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాలను ఎంతో పకడ్బందీగా చూసు కుంటున్నారు. ఆస్తుల విక్రయాల ద్వారా ఆయన సంపదను పెంచుకోవడమే కాకుండా పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు పునసమీక్షించుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. తక్కువ రిస్క్‌తో ఎక్కువ రిటర్న్స్ పొందే రియల్ ఎస్టేట్ వైపు అక్ష‌య్ దృష్టి పెట్టడం ఆయన ఆర్థిక స్థిర‌త్వానికి అద్దం పడుతోంది.ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో లగ్జరీ అపార్ట్‌మెంట్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా అక్షయ్ కుమార్ నిర్ణయం పెట్టు బడిదారులకు మార్గదర్శిగా మారింది.

ముఖ్యంగా అక్ష‌య్ కుమార్ బిజీ షెడ్యూల్‌లో కూడా ఇలాంటి పెద్ద మొత్తంలో ఆస్తులను లాభసాటిగా విక్రయించడం ఆయనకున్న వ్యాపార దక్షతను తెలియజేస్తోంది. ఈ విక్రయం తర్వాత అక్షయ్ కుమార్ పెట్టుబడులను మరే ఇతర రంగాల్లోకి మళ్లిస్తారనేది ఆసక్తికరమైన అంశంగా మారింది.స్టార్‌డమ్ అనేది సినిమా సెట్స్‌కే పరిమితం కాకుండా వ్యక్తిగత ఆర్థికాభివృద్ధిలోనూ ప్రతిబింబించాలని అక్షయ్ కుమార్ నిరూపించారు. అదృష్టం మీద ఆధారపడకుండా సరైన ఆస్తుల ఎంపిక, వేచి చూసే ధోరణి , సరైన సమ యంలో విక్రయించడం వంటి సూత్రాలను పాటిస్తే రియల్ ఎస్టేట్ రంగంలో ఎలా లాభపడవచ్చో? అక్ష‌య్ ని ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు.